
నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి వేధిస్తున్నారని దామరగిద్ద మండలం బాపన్‌పల్లి సర్పంచ్ జి.శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మెయిల్, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేఖను పంపినట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన శివకుమార్‌రెడ్డి పక్షన తాను నిలబటం తప్పా అని ప్రశ్నించారు. తనపై అక్రమకేసులు బనాయింపచేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులను ప్రారంభించాలని కోరి నా శివకుమార్‌రెడ్డి అనుచరుడిగా ముద్ర వేస్తూ పట్టించుకోవడం లేదన్నారు.