ఫిర్యాదు స్వీకరించకపోవడంతో పోలీస్‌స్టేషన్ నుంచి వెళ్లిపోతున్న మహిళలు
లేకపోతే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని టీడీపీ నేత హెచ్చరిక
పోలీసులను ఆశ్రయించిన మహిళలు
ఫిర్యాదు స్వీకరించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన రామిరెడ్డిపల్లి మహిళలు
చంద్రగిరి (తిరుపతి జిల్లా): ఎన్నికల అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లిలో జరిగిన హింసాత్మక ఘటనలు తెలిసిందే. కూచువారిపల్లి, రామిరెడ్డిపల్లిలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే స్థానిక టీడీపీ నేత రామిరెడ్డిపల్లి గ్రామస్తులకు ఫోన్‌లు చేస్తూ బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులైన పలువురు మహిళలు శనివారం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.
తమకు రక్షణ కల్పించాలని, ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి నుంచి తమను కాపాడాలని రామిరెడ్డిపల్లి మహిళలు స్టేషన్‌కు వెళ్లారు. అయితే పోలీసులు ఫిర్యాదులు కూడా తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రామిరెడ్డిపల్లి గ్రామస్తులందరూ కూచువారిపల్లి భజన మందిరం వద్దకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మహిళలు వాపోయారు.
లేకపోతే ఒక్కొక్కరిపై కేసులు పెట్టి మీ అంతు చూస్తామంటున్నారని, దీంతో గ్రామంలో పలువురు యువకులు ప్రాణభయంతో పారిపోయారని తెలిపారు. కూచువారిపలి్లకి చెందిన ఓ వ్యక్తి తమను బెదిరిస్తున్నాడంటూ, కాల్ రికారి్డంగ్‌ను పోలీసులకు వినిపించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు తమ ఫిర్యాదులు తీసుకోలేదని మహిళలు తెలిపారు. ఎవరిని బెదిరించారో వారే ఫిర్యాదు చేయాలే తప్ప, కుటుంబ సభ్యులు రాకూడదని పోలీసులు అంటున్నారని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని మహిళలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment