గురువారం కురిసిన అకాలవర్షానికి జిల్లాలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్ లలో విక్రయానికి వచ్చిన వరి, మొక్కజొన్న ధాన్యం తడిసిముద్దయింది. జడ్చర్ల, అలంపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి, నారాయణపేట మార్కెట్‌లో రైతులు కవర్లు కప్పి ధాన్యాన్ని కాపాడుకున్నారు. వర్షానికి పత్తి నల్లబారుతుందే మోనని రైతులు బెంబేలెత్తిపోతున్నారు.
అకాల వర్షం జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం నీటి పాలైంది. నాగర్‌కర్నూల్, వనపర్తి, జడ్చర్ల, నారాయణపేట, పెబ్బేరు, అలంపూర్, కొడంగల్, దేవరకద్ర ప్రాంతాల్లో కొతకు వచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డుల్లో విక్రయానికి తెచ్చిన మక్కలు తడిసిముద్దయ్యాయి. బాదేపల్లి మార్కెట్ 30వేల బస్తాల ధాన్యం తడవగా, నారాయణపేటలో వెయ్యి, వనపర్తిలో పది వేలు, లింగాలలో 15 వేలు, నాగర్‌కర్నూల్‌లో దాదాపు 20 వేల బస్తాలు తడిపిపోయాయి. - ‘సాక్షి’ నెట్‌వర్క్
వర్షార్పరణం
Published Fri, Dec 12 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement