
న్యూఢిల్లీ: వెండార్లతో సంప్రదింపుల వల్ల తలెత్తిన వాహన విక్రయాలు, రిజిస్ట్రేషన్లకు మధ్య వ్యత్యాసాల సమస్యను పరిష్కరించుకోవడంపై ఓలా ఎలక్ట్రిక్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 40 శాతం బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేశామని, మిగతా వాటిని నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని కంపెనీ తెలిపింది.
ఓలా ఫిబ్రవరిలో 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు వెల్లడించినప్పటికీ ప్రభుత్వ వాహన్ పోర్టల్‌లో 8,651 స్కూటర్లు మాత్రమే రిజిస్టర్ అయినట్లు గత గణాంకాల్లో వెల్లడయ్యాయి. మార్చి 20 నాటికి కంపెనీ రిజి్రస్టేషన్లు 11,781 యూనిట్లుగా ఉన్నాయి. వాహనాల గణాంకాల్లో వ్యత్యాసాలను నియంత్రణ నిబంధనలపరమైన సమస్యగా కొన్ని స్వార్ధ శక్తులు దుష్ప్రచారం చేశాయని ఓలా వ్యాఖ్యానించింది.
కార్యకలాపాలను క్రమబద్దీకరించుకోవడం, లాభదాయకతను మెరుగుపర్చుకునే క్రమంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించే రెండు జాతీయ స్థాయి వెండార్లతో కాంట్రాక్టులను నిలిపివేసిన తర్వాత ఇది మరింత తీవ్రమైందని పేర్కొంది. అమ్మకాలు, రిజి్రస్టేషన్ల మధ్య గణాంకాల్లో వ్యత్యాసాలపై భారీ పరిశ్రమల శాఖ, రహదారి రవాణా.. హైవేస్ శాఖ కంపెనీని స్పష్టత కోరిన నేపథ్యంలో ఓలా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment