2024 ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఆటోమొబైల్ మార్కెట్ బాగా అభివృద్ధి చెందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అనేక కొత్త వాహనాలను దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. ఇందులో టూ వీలర్స్ ఉన్నాయి, ఫోర్ వీలర్స్ కూడా ఉన్నాయి. ఎన్ని కొత్త వాహనాలు మార్కెట్లో అడుగుపెట్టినా.. ప్రజలు మాత్రం 'ఓలా ఎలక్ట్రిక్' స్కూటర్స్ కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఓలా ఎలక్ట్రిక్ ఈ ఒక్క ఏడాది (2024) సుమారు నాలుగు లక్షల స్కూటర్లను విక్రయించింది. దీంతో దేశంలోనే అత్యధిక రిటైల్ విక్రయాలను సాధించిన స్కూటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. వాహన్ డేటా ప్రకారం.. 2024 డిసెంబర్ 15 ఉదయం 7 గంటల సమయం నాటికి దేశంలో అమ్ముడైన మొత్తం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏకంగా 4,00,099 యూనిట్లు అని తెలిసింది.
ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!
ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచ ఈవీ దినోత్సవం (సెప్టెంబర్ 9) నాటికి 3 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఓలా ఎలక్ట్రిక్ తరువాత మంచి ఎక్కువ స్కూటర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ వంటివి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిపోతున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment