మంచి స్టైల్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోరుకునేవారు.. కొంత ఎక్కువ డబ్బు వెచ్చించి బైక్ కొనాలని చూస్తారు. అలాంటి వారి కోసం ఈ కథనంలో రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.
హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్
ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 'కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్' విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బైక్ ధర రూ. 1.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 210 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 9250 rpm వద్ద 25.1 Bhp పవర్, 7250 rpm వద్ద 20.4 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.
హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ బైక్.. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ వంటి వాటితో పాటు టర్న్-బై-టర్న్ న్యావిగేషన్, ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
యమహా ఆర్15 వీ4
రూ.1.82 లక్షల నుంచి రూ.1.87 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభించే 'యమహా ఆర్15 వీ4' మన జాబితాలో చెప్పుకోడదగ్గ బైక్. ఈ బైకులోని 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 10,000 rpm వద్ద 18.1 Bhp పవర్, 7500 rpm వద్ద 14.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.
యమహా ఆర్15 వీ4 బైక్ 282 మిమీ ఫ్రంట్ డిస్క్, 220 మిమీ రియర్ డిస్క్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందించడానికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా కలిగి ఉంది.
బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200
బజాజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది పల్సర్. ఈ బైక్ మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతోంది. బజాజ్ ఆర్ఎస్ 200 ధర రూ. 1.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 200 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 24.1 Bhp పవర్, 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి పొందుతుంది.
కేటీఎమ్ ఆర్‌సీ 125
రూ.2 లక్షల కంటే తక్కువ ధర వద్ద కేటీఎమ్ బైక్ కావాలనుకునేవారికి.. ఆర్‌సీ 125 బెస్ట్ ఆప్షన్. ఈ బైకులోని 124.7 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 9250 rpm వద్ద 14.34 Bhp పవర్, 8000 rpm వద్ద 12 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, అడ్జస్టబుల్ హ్యాండిల్‌బార్, ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ఎక్కువమందికి ఇష్టమైన మోడల్.
Comments
Please login to add a commentAdd a comment