Rs 2 lakh
-
రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!
మంచి స్టైల్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోరుకునేవారు.. కొంత ఎక్కువ డబ్బు వెచ్చించి బైక్ కొనాలని చూస్తారు. అలాంటి వారి కోసం ఈ కథనంలో రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 'కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్' విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బైక్ ధర రూ. 1.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 210 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 9250 rpm వద్ద 25.1 Bhp పవర్, 7250 rpm వద్ద 20.4 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ బైక్.. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ వంటి వాటితో పాటు టర్న్-బై-టర్న్ న్యావిగేషన్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.యమహా ఆర్15 వీ4రూ.1.82 లక్షల నుంచి రూ.1.87 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభించే 'యమహా ఆర్15 వీ4' మన జాబితాలో చెప్పుకోడదగ్గ బైక్. ఈ బైకులోని 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 10,000 rpm వద్ద 18.1 Bhp పవర్, 7500 rpm వద్ద 14.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.యమహా ఆర్15 వీ4 బైక్ 282 మిమీ ఫ్రంట్ డిస్క్, 220 మిమీ రియర్ డిస్క్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందించడానికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా కలిగి ఉంది.బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200బజాజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది పల్సర్. ఈ బైక్ మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతోంది. బజాజ్ ఆర్ఎస్ 200 ధర రూ. 1.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 200 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 24.1 Bhp పవర్, 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి పొందుతుంది.కేటీఎమ్ ఆర్సీ 125రూ.2 లక్షల కంటే తక్కువ ధర వద్ద కేటీఎమ్ బైక్ కావాలనుకునేవారికి.. ఆర్సీ 125 బెస్ట్ ఆప్షన్. ఈ బైకులోని 124.7 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 9250 rpm వద్ద 14.34 Bhp పవర్, 8000 rpm వద్ద 12 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, అడ్జస్టబుల్ హ్యాండిల్‌బార్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ఎక్కువమందికి ఇష్టమైన మోడల్. -
క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు నగదు లావాదేవీపై కేంద్రం తీపి కబురు చెప్పింది. రూ.2లక్షలు అంతకన్నా మించిన నగదు లావాదేవీలపై ఉన్న నిబంధనలు క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లింపుదారులకు వర్తించవని స్పష్టం చేసింది. ప్రభుత్వం, బ్యాంకింగ్ కంపెనీ, పోస్ట్ ఆఫీస్ పొదుపు బ్యాంకు లేదా కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా రసీదులను రూ .2 లక్షల పరిమితి వర్తించదని రెవిన్యూ విభాగం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. బ్యాంకింగ్ రంగానికి, అలాగే గ్రామీణ ప్రాంతానికి అవసరమైన ఉపశమనం కల్పించనున్నామని నాంజియా అండ్ కో డైరెక్టర్ శైలేష్ కుమార్ తెలిపారు.బ్యాంకులు నియమించిన బిజినెస్ కరస్పాండెంట్లు, ప్రీపెయిడ్ ఉపకరణాల ద్వారా ఆయా బిల్లులను చెల్లించవచ్చని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది. రూ. 2 లక్షల లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలపై పరిమితులు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, బ్యాంకులు నియమించిన వ్యాపార ప్రతినిధులు మరియు ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ జారీచేసేవారికి వర్తించంటూ ఆదాయపన్నుశాఖ భారీ ఊరటనిచ్చింది. తాజా నోటిఫికేషన్ ద్వారా ఆదాయపన్ను శాఖ పరిధినుంచి అయిదు అంశాలను మినహాయించింది. అయితే బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకుల తరపున పనిచేసే బిజినెస్ కరస్పాండెంట్లు, ఒకటి అంతకన్నా ఎక్కువ క్రెడిట్ బిల్లు చెల్లింపులకు కంపెనీ లేదా సంస్థ ఇచ్చే రసీదులు, ప్రీపెయిడ్ పేమెంట్ పరికరాల ద్వారా చేసే చెల్లింపులు, రిటైల్ అవుట్లెట్లు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఏంలు ఇచ్చే రసీదులు.. ఐటీ చట్టం 1961 సెక్షన్ 10 క్లాజ్ (17ఏ) ప్రకారం వ్యక్తి మొత్తం ఆదాయంలో ఇది కలవబోదని తెలిపింది. కాగా 2017 , ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా 2017 ఆర్థిక బిల్లు ప్రకారం రూ.2లక్షలు, ఆ పైన ట్రాన్సాక్షన్స్‌పై నిబంధనలు విధించింది. అక్రమ లావాదేవీలను నివారించేందుకు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేదిశగా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఇలాంటి లావాదేవీలపై 100 శాతం జరిమానా చెల్లించాల్సిందేనని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఇక మెషిన్లోనే రూ.2 లక్షల డిపాజిట్
-
నాసా విద్యార్థులకు టీసర్కార్ సాయం
-
భూకంప మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
న్యూఢిల్లీ: భూకంపంలో మరణించినవారి కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల ఆర్ధికసాయాన్ని ప్రకటించింది. నేపాల్ సరిహద్దు రాష్ట్రమైన బీహార్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రంలో భూకంపం వల్ల ఇళ్లు, గోడలు కూలిన ఘటనల్లో 47 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్ లో 17, బెంగాల్ లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మొత్తంమీద భూకంపం ధాటికి భారత్‌లో 67 మంది చనిపోగా, 240 మందికి పైగా గాయపడ్డారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. -
కుక్కకాటుకు రెండు లక్షలు
నైనితాల్ : ఉత్తరాఖండ్ హైకోర్టు అసాధారణ తీర్పును వెల్లడించింది. కుక్కకాటు బాధితులకు రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ జస్టిస్ అలోక్‌నాథ్, జస్టిస్ సర్వేష్ కుమార్ ల డివిజన్ బెంచ్ గురువారం తీర్పు చెప్పింది. తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వీధి కుక్కలు, కోతులు, గిబ్బన్స్ దాడిలో గాయపడిన వారికి కూడా ఈ ఆ దేశాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది . ఈ పరిహార మొత్తాన్నిమున్పిపల్ కార్పోరేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో విధిగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అది కూడా ఘటన జరిగిన ఒక వారం రోజుల లోపే ఈ చెల్లింపు జరగాలని సూచించింది. నైనితాల్ పట్టణంలో గత మూడేళ్ల కాలంలో జరిగిన నాలుగువేల వీధి కుక్కకాటు కేసులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపాలిటీ సంస్థకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కుక్కకాటు సంఘటలను నివారించడానికి వాటికోసం తక్షణమే షెల్టర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే కోతులు, గిబ్బన్స్ దాడికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని కోరింది. చిత్రంగా ఈ ఆదేశాలను జారీ చేసిన సీనియర్ న్యాయవాది భార్యతో పాటు నలుగురు అదేరోజు వీధికుక్కల బారిన పడి గాయాల పాలయ్యారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్టు ఈ తాజా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.