నారాయణపేట, న్యూస్‌లైన్: జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లా బాలాకోడ్ ప్రాంతంలోని దేశ సరిహద్దుల్లో సోమవారం రాత్రి పాక్ చొరబాటుదారులు జరిపిన కాల్పుల్లో నారాయణపేటకు చెందిన ఫిరోజ్‌ఖాన్ (33) మృతి చెందాడు. ఫిరోజ్ మృతిని కల్నర్ ఆర్‌కే పల్లా బుధవారం ధ్రువీకరించారు. 1996లో ఆర్మీలో చేరిన ఫిరోజ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఫిరోజ్ మరణ వార్త తెలియగానే పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తండ్రి కూడా జవానే...
‘పేట’కు చెందిన అక్తర్‌బేగం, జాఫర్‌ఖాన్ దంపతులకు 1978లో ఫిరోజ్ జన్మించాడు. ఫిరోజ్ తండ్రి జాఫర్‌ఖాన్ కూడా ఆర్మీ జవాన్‌గా దే శ సరిహద్దులో పనిచేసి రిటైరయ్యారు. ఫిరోజ్ స్థానిక ఎంబీ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేసిన అతను 1996లో తండ్రి ప్రోత్సాహంతో ఆర్మీలో చేరాడు. ఏడేళ్లక్రితం అతను న శ్రీన్ బేంగంను వివాహం చేసుకున్నాడు.
తండ్రి ఆర్మీలో పనిచేస్తుండడంతో 18ఏళ్ల క్రితం వారు పేట’ను వదిలి హైదరాబాద్ పాతబస్తీ నవాబ్‌సాబ్‌కుంటలో నివాసముంటున్నారు. వరంగల్‌లోని ఓ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న జాఫ ర్ సహజ మరణం పొందారు. సైనికుడుగా వివిధ ప్రాంతాల్లో పని చేసిన ఫిరోజ్ రెండేళ్ల క్రితం కాశ్మీర్‌లో బదిలీ అయ్యాడు. గత ఏడాది సౌత్ ఇండి యా అటవీశాఖలో డిప్యుటేషన్‌పై పని చేసిన అతను మళ్లీ సరిహద్ద్దుకు వెళ్లాడు. బుధవారం బక్రీద్ వేడుకల్లో ఉన్న పేటలో ఫిరోజ్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు ఈ విషాదకర వార్త తెలియడంతో కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే వారు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
వీరజవాన్‌కు ఘన నివాళి
ఆమనగల్లు: దేశ సరిహద్దులో మృతి చెందిన ఫిరోజ్‌ఖాన్ ఆత్మకు శాంతి కలగాలని ఆమనగల్లులో ముస్లిం సో దరులు బుధవారం శాంతిర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్ చౌరస్తా వద్ద ఫిరోజ్‌ఖాన్‌కు ఘనంగా నివాళులర్పించారు. ‘ఆర్మీ జవాన్ ఫిరోజ్‌ఖాన్ షహిద్‌హై’ అంటూ నినాదాలు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఏ పాషా, ఖలీల్, అల్తాఫ్, తాహేర్, రబ్బానీ, అజీం, అలీం, రఫీ, రబ్బానీ, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
దేశరక్షణలో నేలకొరిగిన పాలమూరు తేజం
Published Thu, Oct 17 2013 3:22 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement
Advertisement