ముందస్తు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసులో నాల్గవ నిందితుడైన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ఉమ్మడి హైకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. మురళి హత్య కేసులో ముందస్తు బెయిల్ మం జూరు చేయాలంటూ రాజేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని గురువారం జస్టిస్ సునీల్ చౌదరి విచారణ జరిపారు. ఈ కేసులో రాజేందర్‌రెడ్డి పాత్రపై పోలీసులు అదనపు సమాచారా న్ని కోర్టు ముందు ఉంచకపోవడంతో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో పోలీసుల కు సహకరించాలని ఆదేశించింది.
హత్య కేసులో రాజేందర్‌రెడ్డికి ఊరట
Published Fri, Sep 1 2017 1:24 AM | Last Updated on Tue, Sep 12 2017 1:29 AM
Advertisement
Advertisement