కేసును సీబీఐకి అప్పగించాలి: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసుకు సంబంధించి చాలా అనుమానాలున్నాయని, రోజుకో కొత్త సమాచారం వస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ నయీమ్‌ను ఎక్కడో పట్టుకుని కాల్చి చంపినట్టుగా తెలిసిందన్నారు. అతడి ఇంటిలో దొరికిన రూ.2 కోట్ల కంటే డబ్బు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఫోన్లు వస్తున్నాయన్నారు. మహిళల అక్రమ రవాణా కేసును ఇంటర్‌పోల్‌తో కలసి విచారణ జరిపించాల్సి ఉంటుందన్నారు. ఈ కేసులో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పారిశ్రామిక వేత్తల పేర్లు వస్తున్నాయన్నారు. అందుకే నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.