సమస్యలను పరిష్కరించలేక వ్యక్తిగత విమర్శలా? | Bhattivikramarka fires on KTR | Sakshi
Sakshi News home page

సమస్యలను పరిష్కరించలేక వ్యక్తిగత విమర్శలా?

Published Wed, Nov 16 2016 3:24 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

సమస్యలను పరిష్కరించలేక వ్యక్తిగత విమర్శలా? - Sakshi

సమస్యలను పరిష్కరించలేక వ్యక్తిగత విమర్శలా?

మంత్రి కేటీఆర్‌పై భట్టి ఆగ్రహం

 సాక్షి, హైదరాబాద్: గ్రామీణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక ప్రతిపక్ష పార్టీ నేతల గడ్డం, పంచెకట్టు గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు.

గాంధీభవన్‌లో మంగళవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన పడకేసిందని, ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని, పాలకుల అసమర్థతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేటీఆర్ కళ్లుమూసుకుని, మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ప్రతిపక్షాలపై నోటికొచ్చినట్టు మాట్లాడటం మానుకుని, ప్రజల దగ్గరకుపోతే వాస్తవాలేమిటో కేటీఆర్‌కు తెలుస్తాయని భట్టి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement