
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన టీపీసీసీ లాజిస్టిక్స్ కమిటీ 24 గంటల పాటు గాంధీభవన్‌లో పని చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పా టైన తర్వాత తొలి సమావేశం బుధవారం గాంధీ భవన్‌లో జరిగింది. దీనికి భట్టితో పాటు కుసుమ కుమార్, కమిటీ కన్వీనర్ కుమార్‌రావు, సభ్యులు వినయ్‌కుమార్, కోదండరెడ్డి తదితరులు హాజర య్యారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడు తూ రెవెన్యూ, పోలీస్, న్యాయ, ఎన్నికల సంఘంతో పాటు ముఖ్యమైన ప్రభుత్వ యంత్రాంగంతో సమా చార సేకరణ, ఎన్నికల అంశాలకు సంబంధించిన సంప్రదింపులు ఈ కమిటీ జరుపుతుందని చెప్పారు. ఏఐసీసీ నుంచి వచ్చే సమాచారాన్ని సేకరించి జిల్లా పార్టీ అధ్యక్షులు, పోటీలో ఉన్న నేతలకు చేరవేస్తుం దని, వారితో సంప్రదింపులు జరిపి అవసరమైన సమాచారాన్ని అందిస్తారని చెప్పారు. ప్రతి 6 గంటలకు ఒక టీమ్ గాంధీభవన్‌లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment