ప్రజలను పట్టించుకోని టీఆర్‌ఎస్ సర్కార్: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలకు విలువలేకుండా పోయిందని, నియంతల పాలన సాగుతున్నదని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత జానారెడ్డి, పార్టీ నేతలు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య,నర్సారెడ్డి, పాల్వాయి గో వర్ధన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మధుయా ష్కీ, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్ పాల్గొన్నారు.