
రేవంత్.. ఉచిత సలహాలొద్దు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఉచిత సలహాలేమీ తమకు అవసరం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై రేవంత్ విమర్శలు సరికాదన్నారు.
రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే పోలవరం అంశంలో ఏపీ సీఎం చంద్రబాబును ఒప్పించి, ఎత్తును తగ్గించాలన్నారు.