రాష్ట్రంలో ప్రభుత్వంపై, టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత మొదలైందని, ఇకపై క్షేత్రస్థాయిలో క్రియాశీల పోరాటాలు చేయాల్సి ఉందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వంపై, టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత మొదలైందని, ఇకపై క్షేత్రస్థాయిలో క్రియాశీల పోరాటాలు చేయాల్సి ఉందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మంగళవారం ఆయన మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షునిగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరున్నా ఇప్పుడు పెద్దగా తేడా ఏమీ ఉండదన్నారు. పీసీసీ అధ్యక్షుని సమర్థతపై ఇప్పుడే విశ్లేషించడం సరికాదని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై భవిష్యత్తులో చేసే పోరాటాలు, కార్యాచరణపై ఆధారపడి విశ్లేషించవచ్చని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి, అందరినీ కలుపుకుని, 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని నడిపించాలన్నారు.