
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మండిపడ్డారు. ‘రాజగోపాల్‌రెడ్డికి మతి భ్రమించింది.. పిచ్చాసుపత్రికి పంపాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జీవన్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సోనియా గాంధీ దృష్టిలో పడేందుకు రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో అతడి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసేవారని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడేది ప్రజలకు వినపడకుండా.. మమ్మల్ని సస్పెండ్ చేయాలంటూ పోడియం దగ్గరికి వెళ్లి గందరగోళం చేశారని, అసెంబ్లీని డైవర్ట్ చేసే విధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. సీఎం అభివృద్ధిపై మాట్లాడుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. తనపై మార్క్ ఫెడ్ విషయంలో అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతీసారి వార్ వన్ సైడ్ అవుతోందన్నారు. ‘కారు సారు కేసీఆరు’ అనే విధంగా ప్రజలు తీర్పు ఇస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment