jeevanreddy
-
‘ఆయన పడే ఆవేదన చూసి మనసు కలుక్కుమన్నది’
హైదరాబాద్: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆవేదన మీడియాలో చూసి తన మనసుకు చాలా బాధగా అనిపించిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ వయసులో జీవన్‌రెడ్డికి ఈ ఆవేదన ఏంటో అని మనసు కలుక్కుమన్నది. జగ్గారెడ్డి అండగా ఉన్నాడు అని చెప్పడానికి... నా మనసులో మాటని మీడియా ద్వారా తెలియజేస్తున్నా. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. కానీ జీవన్ రెడ్డి నేను ఒంటరి అని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు జీవన్‌రెడ్డి వెంట జగ్గారెడ్డి ఉంటాడు. ఎప్పుడు జనంలో ఉండే ఆయన్ని జగిత్యాల ప్రజలు ఎందుకు ఒడగొట్టారో అర్థం కానీ పరిస్థితి. పార్టీని కానీ.. ప్రజలను కానీ తప్పుపట్టడం లేదు. మా టైం బాగోలేదు కాబట్టి.. ఎవరేం చేస్తారు అని సర్డుకుపోతున్నా. దీన్ని తొందరగా అధిష్టానం గుర్తించి జీవన్‌రెడ్డి సమస్యకు పరిష్కారం చూపాలని... సీఎం రేవంత్‌రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ని, ఖర్గేని, రాహుల్‌గాంధీని మీడియా ముఖంగా కోరుతున్నా’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి -
జీవన్‌రెడ్డి అలక.. స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్: జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి వ్యవహారంపై మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం(అక్టోబర్ 23) స్పందించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్‌పై సీరియస్‌గా ఉన్నామన్నారు. మర్డర్ ఎవరు చేసినా ఎవరు చేయించినా వదిలేది లేదన్నారు. జిల్లా ఎస్పీతో ఈ విషయమై ఇప్పటికే మాట్లాడామన్నారు. ‘జీవన్ రెడ్డితో ఇప్పటికే పీసీసీ చీఫ్ మాట్లాడారు. జీవన్‌రెడ్డితో నేను కూడా మాట్లాడుతా. జీవన్‌రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత.. ఆయన సేవలను మేము వినియోగించుకుంటాం. పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించం. చనిపోయిన గంగారెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. అందరితో సమన్యాయం చేసుకోని మాట్లాడాలని పీసీసీ చీఫ్ నాకు సూచించారు’అని శ్రీధర్‌బాబు తెలిపారు.ఇదీ చదవండి: అవమానాలు చాలు ఇకనైనా బతకనివ్వండి : జీవన్‌రెడ్డి -
జీవన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి,జగిత్యాల జిల్లా: తెలంగాణలో సీఎం రేవంత్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌తో జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. తన ప్రత్యర్థి బీఆర్ఎస్ ల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు సోమవారం ఆయన ఇంటికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే వారిద్దరినీ కాంగ్రెస్ శ్రేణులు, జీవన్‌రెడ్డి క్యాడర్ చుట్టుముట్టింది. జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై విప్స్ ఇద్దరినీ కార్యకర్తలంతా నిలదీశారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు ఫోన్ చేయనున్నట్లు సమాచారం. కాగా, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనను సంప్రదించకుండా తన నియోజకవర్గంలో మరో ప్రత్యర్థినేతను పార్టీలో ఎలా చేర్చుకుంటారని జీవన్‌రెడ్డి అలకబూనారు. అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు జీవన్‌రెడ్డి సిద్ధమయ్యారు. దీనిపై ఆయనను బుజ్జగించేందుకే పార్టీ తరపున ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్‌కుమార్‌లు జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్‌కుమార్ మీద జీవన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. -
సత్తా చాటాల్సిందే
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలో మంచి ఫలితం సాధించే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటోంది. మొదటి నుంచీ పట్టున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కేడర్‌ను కాపాడుకోవడం ద్వారా వీలైనన్ని ఎక్కువ ఓట్లు రాబట్టవచ్చని, టీఆర్ఎస్–బీజేపీల బంధాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓట్ల శాతాన్ని పెంచుకోవచ్చనే వ్యూహంతో ముందుకెళుతోంది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 30 శాతానికి తగ్గకుండా ఓట్లు వచ్చిన పరిస్థితుల్లో ఈసారి కూడా ఆ ఓట్లను నిలబెట్టుకోవాలని, టీఆర్ఎస్–బీజేపీల మధ్య ఓట్ల చీలికను ఆసరాగా చేసుకొని గెలుపు తీరం చేరుకోవాలని ఆశిస్తోంది. మూడంచెల వ్యూహం... ఉపఎన్నికను మూడంచెల వ్యూహంతో ఎదు ర్కోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణలో మండలాలు, గ్రామాలవారీగా పని విభజన చేసుకొని ముందుకెళ్లేలా వ్యూహం రూపొందించారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణను స్వయంగా చేపడుతూ మండలాలవారీగా ఇన్చార్జీలను, చీఫ్ కో–ఆర్డినేటర్లను నియమించారు. ఇందులో కమలాపూర్‌కు ఎమ్మెల్యే సీతక్క, జమ్మికుంటకు శ్రీధర్‌బాబు, హుజూరాబాద్ పట్టణ, మండలానికి జగ్గారెడ్డి, ఇల్లంతుకుంట మండలానికి వేం నరేందర్‌రెడ్డి, వీణవంక మండలానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలను నియమించారు. వారికి అనుబంధంగా మరో ఐదారుగురు నేతలను మండలాలవారీగా నియమించారు. వారి సమన్వయంతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో పని విభజన చేయనున్నారు. ప్రతి గ్రామానికి టీపీసీసీ స్థాయి నాయకుడిని ఇన్చార్జిగా నియమించాలని, నియోజకవర్గవ్యాప్తంగా పూర్తిస్థాయిలో పార్టీ అనుబంధ సంఘాలను రంగంలోకి దింపాలని ఆయన ఇప్పటికే ఆదేశించారు. గాంధీభవన్‌లో కీలక నేతల భేటీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు శనివారం గాంధీ భవన్లో సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, అజ్మతుల్లా హుస్సేన్‌లు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా రానున్న 20 రోజులపాటు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. స్టార్ క్యాంపెయినర్లు వీరే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ పక్షాన ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి. వేణుగోపాల్ ఈ పేర్లతో కూడిన లేఖను ఎన్ని కల సంఘానికి పంపినట్టు టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. మొత్తం 20 మందితో కూడిన ఈ జాబితాలో మాణిక్యం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, భట్టి, శ్రీనివాస కృష్ణన్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్, పొన్నాల, అజహరుద్దీన్, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ, నాయిని రాజేందర్‌రెడ్డి ఉన్నారు. -
రాజగోపాల్‌రెడ్డి మతి భ్రమించింది.. అందుకే..
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై మండిపడ్డారు. ‘రాజగోపాల్‌రెడ్డికి మతి భ్రమించింది.. పిచ్చాసుపత్రికి పంపాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జీవన్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సోనియా గాంధీ దృష్టిలో పడేందుకు రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో అతడి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసేవారని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడేది ప్రజలకు వినపడకుండా.. మమ్మల్ని సస్పెండ్ చేయాలంటూ పోడియం దగ్గరికి వెళ్లి గందరగోళం చేశారని, అసెంబ్లీని డైవర్ట్ చేసే విధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. సీఎం అభివృద్ధిపై మాట్లాడుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. తనపై మార్క్ ఫెడ్ విషయంలో అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతీసారి వార్ వన్ సైడ్ అవుతోందన్నారు. ‘కారు సారు కేసీఆరు’ అనే విధంగా ప్రజలు తీర్పు ఇస్తున్నారని అన్నారు. -
కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగారా లేదా?
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ కేంద్రాన్ని అడిగారో లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. తుమ్మిడిహెట్టి వద్ద రూ.లక్ష కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి రాజ్యసభలో ఎంపీ ఎం.ఎ.ఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా 2019 జూలై 1న సమాధానమిస్తూ.. 2016లో సీఎం కేసీఆర్ రాసిన లేఖ మినహా నిర్దేశిత రూపంలో తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని చెప్పారని ఆ లేఖలో గుర్తుచేశారు. టీఆర్ఎస్ నేతలేమో తాము అడిగినా బీజేపీ ఇవ్వడం లేదని చెబుతున్నారని, ఇందులో ఏది నిజమో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా అడిగి ఉంటే వాటిని బహిర్గతం చేసి రాజ్యసభలో అబద్ధం చెప్పిన కేంద్ర మంత్రికి సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు. -
అభివృద్ధి బాటలో ఆర్మూర్
సాక్షి, ఆర్మూర్: కాశ్మీర్–కన్యాకుమారిని కలిపే 44వ జాతీయ రహదారి, నిజామాబాద్–జగదల్పూర్ వరకు గల 63వ జాతీయ రహదారుల కూడలిగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం జిల్లాకు ఆయువు పట్టుగా ఉంది. ప్రధానంగా వ్యవసాయాధారితమైన ఆర్మూర్ ప్రాంతంలో ఇటీవల పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే మార్గంలో భాగంగా రైల్వే స్టేషన్ సైతం ఏర్పాటు కావడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి కొనసాగుతోంది. వ్యవసాయమే కాదు రాజకీయ చైతన్యం కూడా ఇక్కడ అధికంగానే ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యాపారం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న ఆర్మూర్‌లో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో నియోజకవర్గం అభివృద్ధికి మునుపెన్నడూ మంజూరు కానన్ని నిధులు మంజూరు చేయించారు. చేపట్టిన పనులు.. అక్షర క్రమంలోనే కాదు ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధిలోనూ ముందుంది. హేమాహేమీలైన నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఆర్మూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి గణాంకాల ప్రకారం రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మూడు దశాబ్దాల నుంచి నెరవేరని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కలను పూర్తి చేయించారు. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, ఆలూర్ బైపాస్‌రోడ్డు, నందిపేట బైపాస్ రోడ్డు, నందిపేట మండలం ఉమ్మెడ నుంచి పంచగవ్వకు గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం, ఆర్మూర్ పట్టణ ప్రజ లతాగునీటి అవసరాలు తీర్చడం కోసం మిషన్ భగీరథ పనులు చేపట్టడం ఆయన హయాంలో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా కొనసాగుతున్న జీవన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి చాకచక్యంగా నిధులు రాబట్టుకుంటూ జీవోల జీవన్రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. పరిష్కారం కాని సమస్యలు ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో తమ సర్వస్వాన్ని కోల్పోయిన భూనిర్వాసితులకు సమైక్య పాలనలో అందాల్సిన నష్ట పరిహారం పూర్తిగా అందలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా వీరి సమస్య పరిష్కారానికి నోచుకుంటుందని ఆశపడ్డ బాధితులకు మొండి చేయే ఎదురవుతోంది. మరో వైపు నియోజకవర్గం పరిధిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాలు కేటాయించినప్పటికీ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి కాలేదు. నియోజకవర్గ స్వరూపం.. ఆర్మూర్, వేల్పూర్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాలతో 1952కు పూర్వమే ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009 నియోజకవర్గ పునర్విభజన కంటే ముందు ఆర్మూర్ నియోజకవర్గంలో 12 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. నియోజకవర్గ పునర్విభజనలో ఆర్మూర్ నియోజకవర్గ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆర్మూర్ మండలంతో పాటు బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని నందిపేట్ మండలం, డిచ్పల్లి నియోజకవర్గ పరిధిలోని మాక్లూర్ మండలాలను కలిపి ఆర్మూర్ నియోజకవర్గంగా మార్చారు. ఆర్మూర్ మున్సిపాలిటీతో పాటు కేవలం మూడు మండలాలతో జిల్లాలోనే అతి చిన్న నియోజకవర్గంగా ఆర్మూర్ రూపాంతరం చెందింది. భౌగోళికంగా మూడు మండలాలు పక్కపక్కనే ఉన్నా మూడు మండలాల గ్రామాలను కలుపుతూ అనువైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఈ నియోజకవర్గం మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. మండలంలోని సుర్భిర్యాల్, కోమన్‌పల్లి, మగ్గిడి, ఖానాపూర్, అమ్దాపూర్, మంథని, దేగాం, ఆలూర్, మచ్చర్ల, మిర్ధాపల్లి, రాంపూర్లతో పాటు నందిపేట్ మండలంలోని నందిపేట్, అయిలాపూర్, వెల్మల్, కమ్ఠం, ఆంధ్రనగర్తో పాటు శివారు గ్రామాలు రైతు ఫారం, ఎన్టీఆర్ నగర్, జోదిపేట్, ఇంద్రనగర్, వెంకటేశ్వర కాలనీలు డిచ్పల్లి నియోజకవర్గం పరిధిలో ఉండేవి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి ఒకే విధంగా ఉండేది కాదు. నియోజకవర్గ పునర్విభజనలో మూడు నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాలను పూర్తి స్థాయిలో ఏకం చేయడం పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వివరాలు వేల్పూర్ మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన రైతు కుటుంబం వెంకట రాజన్న, రాజబాయి దంపతుల పెద్ద కుమారుడైన ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఎంఏ (రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ చదివారు. ఎమ్మెల్యేగా గెలిచినా తన చదువును కొనసాగిస్తూ ఇటీవల ఎల్ఎల్ఎం పరీక్షలు సైతం రాశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన తన మేనమామ, మాజీ ఎంపీపీ యాల్ల రాములు రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు సన్నిహితంగా ఉంటూ 2001 నుంచి ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. 2008 నాటి ఎర్రజొన్నల ఉద్యమంలో ఆయన ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎర్రజొన్న రైతులకు రావాల్సిన రూ.11 కోట్ల బకాయిలను ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు సైతం పెద్దపీఠ వేస్తున్నారు. 2014 పోల్ గ్రాఫ్ మొత్తం ఓటర్లు 1,82,790 పోలైన ఓట్లు 1,34,575 జీవన్‌రెడ్డి 66,712 సురేశ్‌రెడ్డి 53,251 మెజారిటీ 13,461 2018 ఓటర్ల జాబితా.. మొత్తం ఓటర్లు 1,70,732 పురుషులు 80,325 మహిళలు 90,402 ఇతరులు 5 పోలింగ్ కేంద్రాలు 211 ప్రభావితం చేసే కులాలు: మున్నూరుకాపు, ఖత్రి, గురడి కాపు, పద్మశాలి, ముస్లిం మైనారిటీలు -
జనం మధ్యనే జీవన్‌రెడ్డి సతీమణి
సాక్షి, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించగా టీఆర్ఎస్ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి వేదికపైకి వెల్లకుండా ప్రజల్లో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. -
ఎస్సారెస్పీ నీటి కోసం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధర్నా
సాక్షి, జగిత్యాల: తిప్పనపేట గ్రామానికి చెందిన పంటపొలాలకు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అందడంలేదని నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఎస్సారెస్పీ అధికారులకు నీటి విడుదలపై కార్యాచరణ లేదన్నారు. అలాగే చివరి ఆయకట్టుకు నీరందించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతేగాక సింగూర్ నుంచి నీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, మిడ్ మానేరుకు 14 టీఎంసీల నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో హాజరైన రైతులు నీటిపారుదలశాఖ ఈఈ దరూర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. -
రాజకీయ కోణంలోనే తెలుగు సభలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను భాషాభివృద్ధికోసం కాకుండా రాజకీయకోణంలో నిర్వహిస్తున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాసభలకోసం ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం తెలుగు భాష అమలుపై ఆచరణలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషను పెద్దగా పట్టించుకోరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడటంలో ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని జీవన్‌రెడ్డి కొనియాడారు. మావోయిస్టుల విధానమే తన విధానమన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎన్కౌంటర్లు చేయడం సరికాదన్నారు. ప్రజలకు ఒరిగేదేం లేదు..ప్రపంచ తెలుగు మహాసభలపై డీకే అరుణ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన గురించి గొప్పలు చెప్పించుకోవడానికే రూ. కోట్ల నిధులు వెచ్చించి ఈ మహాసభలు నిర్వహిస్తున్నారన్నారు. శుక్రవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణలో 4 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాటకు కట్టుబడే తెలంగాణ ఇచ్చారు సోనియా పార్టీ ఖ్యాతిని నిలబెట్టారు: సీఎల్పీనేత జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల హృదయ ఘోషను అర్థం చేసుకుని, ఇచ్చిన హామీకి కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ చేసిన ఉద్యమానికి భయపడి, విధిలేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్న మాటల్లో వాస్తవంలేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, గుండెకోతను అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని జానారెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 19 సంవత్సరాలపాటు సేవలందించిన సోనియా, పార్టీ ఖ్యాతిని నిలబెట్టారని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఢిల్లీ వెళుతున్నందున తాను ప్రపంచ తెలుగు సభలకు హాజరుకాలేక పోతున్నానని చెప్పారు. వ్యక్తిగత రాగద్వేషాలను, మనస్పర్థలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు మహాసభలకు అందరు కవులు, కళాకారులను ఆహ్వానించాలని జానారెడ్డి సూచించారు. అందెశ్రీ వంటివారిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. -
చలనమేది..
కరీంనగర్: రైతులు బలవన్మరణం చెందుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని టీకాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి అన్నారు. కేంద్రంపై ఆరోపణలు, ప్రచార ఆర్భాటాలకే ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు. ఆరోపణలతో కాలం వెళ్లదీయకుండా పంటల ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. లేకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సివుంటుందని అన్నారు. -
జీవన్‌రెడ్డి వర్సెస్ సీఎం కేసీఆర్
-
జీవన్‌రెడ్డి వర్సెస్ సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి, సీఎం కేసీఆర్ మధ్య వాడీవేడి సంవాదం జరిగింది. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడాన్ని స్వాగతిస్తూనే.. దీనిని కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణ ప్రభుత్వం ఎలా సాధించుకుంటుందని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడూల్డ్లో ఈ బిల్లును చేర్చి ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తారా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆ నమ్మకం ప్రభుత్వానికి ఉందా? అని సీఎం కేసీఆర్‌ను అడిగారు. దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ఈ బిల్లును కేంద్రం తొమ్మిదో షెడ్యూల్డ్‌లో చేరుస్తుందన్న నమ్మకముందని పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోయినా సుప్రీంకోర్టుకు వెళ్లి.. ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పారు. జీవన్‌రెడ్డి న్యాయవాది అయి ఉండి ఇలాంటి విషయాల్లో విమర్శలు చేయడం తగదన్నారు. దీనికి జీవన్‌రెడ్డి స్పందిస్తూ.. ఇంటింటికీ మంచినీళ్లను సరఫరా చేయకుంటే ఓట్లు అడుగబోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని, అదేవిధంగా ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించకుంటే ఓట్లు అడుగబోమని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పగలదా? అని ఆయన సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న ఆత్మవిశ్వాసం తమకుందన్నారు. తమ బిల్లును 9వ షెడ్యూల్డ్‌లో చేర్చకపోతే.. సుప్రీంకోర్టుకు వెళ్లి సాధించుకుంటామని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాలలో పరిమితికి మించి రిజర్వేషన్ అమలులో ఉందని, కొన్ని రాష్ట్రాలలో 80శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పే అందరికీ వర్తిస్తుందని చెప్పారు. ఈ విషయంలో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నించవద్దని, కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందాన విమర్శలు చేయవద్దని జీవన్‌రెడ్డికి హితవు పలికారు. -
'విమలక్క కార్యాలయాన్ని తెరిపించండి'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యాలయాన్ని సీజ్ చేయడం సమంజసంగా లేదని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం శాసనసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అరుణక్క కార్యాలయంలో నిషేధం ఉన్న ఎలాంటి సాహిత్యం దొరక్కపోయినా కార్యాలయాన్ని సీజ్ చేయడం తగదన్నారు. దానిని వెంటనే తెరిపించాలని కోరారు. -
కేసీఆర్.. మూర్ఖపు ఆలోచనలు మానుకో!
హైదరాబాద్: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ ప్రభుత్వం గొప్పలకు పోతుందని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూర్ఖపు ఆలోచనలు మానుకుని.. లౌకికవాదిగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి సూచించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ పథకం, అభయ హస్తం, షాదీ ముబారక్ సహా ఏ సంక్షేమ పథకానికీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. వాస్తు దోషం పేరుతో రాష్ట్ర సచివాలయాన్ని తొలగించి, కొత్త వాటిని నిర్మించడం వల్ల రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడుతుందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణ పక్షపాతి వైఎస్సార్
వైఎస్సార్ చొరవతోనే ప్రాజెక్ట్‌లరూపకల్పన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జగిత్యాల రూరల్: తెలంగాణకు సాగునీర ందించాలనే సంకల్పంతో ప్రాజెక్ట్‌ల రూపకల్పన చేసిన రాజశేఖరరెడ్డి రైతుపక్షపాతిగా నిలిచారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలోని తన నివాసగృహంలో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌తోకలిసి వైఎస్సార్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ప్రమాణస్వీకారం చేసి వ్యవసాయానికి 9గంటల ఉచితవిద్యుత్ ఇచ్చారని కొనియాడారు. పంటకు మద్దతు ధర కల్పించడం, రుణమాఫీ కల్పించి రైతుల్లో వ్యవసాయంపై నమ్మకం కలిగేలా చేశారన్నారు. వైఎస్సార్ భౌతికంగా దూరమైనా ప్రజలమదిలో ఇంకా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సంక్షేమపథకాలు దేశప్రతిష్టతను పెంపొందించాయన్నారు. నిరుపేద విద్యార్థులకు చదువు దూరంకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. 108 ద్వారా ఎంతో మందికి ప్రాణాలు కాపాడిన ఘనత వైఎస్సార్‌దేనని, 108కు వైఎస్సార్ అంబులెన్స్‌గా నామకరణం చేయాలని కోరారు. తెలంగాణలోని ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా తీసుకురావాలని ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎల్లంపల్లి నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందన్నారు. సారంగాపూర్ జెడ్పీటీసీ భూక్య సరళ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, వైస్ ఎంపీపీ గంగం మహేశ్, నాయకులు గర్వందుల నరేశ్‌గౌడ్, గోపి రాజేశ్, ముకేశ్‌ఖన్నా పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ‘న్యాక్’లో వద్దు
జగిత్యాల అర్బన్ : జగిత్యాల జిల్లా కలెక్టరెట్ కార్యాలయాన్ని న్యాక్ భవనంలో ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని, మరోసారి పరిశీలించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ శశాంకకు వినతిపత్రం అందజేశారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ న్యాక్ భవనం జగిత్యాలకు 10కిలోమీటర్ల దూరంలో ఉండడంతోపాటు రహదారి సౌకర్యం సరిగ్గా లేదన్నారు. అంతేకాకుండా న్యాక్ విద్యార్థులకు సైతం ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొన్నారు. ధరూర్ క్యాంపులో సుమారు 100 ఎకరాలు అందుబాటులో ఉందని, అక్కడ ఉన్న క్వాటర్స్‌లోనే కలెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుందని వివరించారు. ఎస్సారెస్పీ సర్కిల్ ఆఫీసులోనే 200 మంది వరకు విధులు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం మరోసారి ఆలోచించి కలెక్టర్ కార్యాలయాన్ని ఎస్సారెస్పీ క్వాటర్లలో ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, దామోదర్‌రావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఒప్పందం ‘మహా’ మోసం
కరీంనగర్ సిటీ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మహారాష్ట్రతో ఒప్పందమంటూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇప్పటికే మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందంటూ సంబరాలు చేసుకున్నారని గుర్తుచేశారు. మళ్లీ ఈనెల 23న మహారాష్ట్రతో ఒప్పందం అంటున్నాడని, అంటే ఇదివరకు చేసుకున్నది ఒప్పందం కాదా అని ప్రశ్నించారు. వారు ఆదివారం కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ 148 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ముందు నుంచి సుముఖంగానే ఉందన్నారు. ఇందులో కేసీఆర్ సాధించిన ఘనత ఏమిటని నిలదీశారు. తాము 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని కోరామన్నారు. మహారాష్ట్రతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందానికి ప్రయత్నించలేదని కేసీఆర్ అనడాన్ని ఖండించారు. 1975లోనే అప్పటి సీఎం జలగం వెంగళరావు మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకొన్నారని చెప్పారు. 2012 మే 5న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పవన్కుమార్బన్సల్ కార్యాలయంలో మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. వాస్తవాలను కప్పిపుచ్చడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నించడం బాధాకరమన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి నుంచి జైపూర్ మీదుగా సుందిళ్లకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావచ్చన్నారు. టీఆర్ఎస్ సర్కారు ఆ ప్రాజెక్టును రద్దు చేసి మేడిగడ్డ, అన్నారంలో వృథాగా బ్యారేజీలు నిర్మించడం వల్ల రూ.10వేల కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నారు. మిడ్‌మానేరు నుంచి నిజాంసాగర్‌కు కొత్తగా రిజర్వాయర్ నిర్మాణం, ముంపు లేకుండా నీళ్లు తరలించవచ్చన్నారు. మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్‌కు అక్కడినుంచి నిజాంసాగర్ నీటిని తరలించాలనుకోవడం మూర్ఖత్వమని, కేసీఆర్ భాషలో చెప్పాలంటే మెడమీద తలకాయున్నోడు ఈ పని చేయడని ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి నీళ్లతో ఎల్ఎండీని నింపే అవకాశమున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎల్ఎండీలో నాలుగు టీఎంసీ నీటిని సైతం సిద్దిపేటకు తాగునీటి కోసమే నిలువ ఉంచుతున్నార ని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్నారన్నారు. అసలు కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిందెక్కడ, తాము అడ్డుపడ్డదెక్కడని ప్రశ్నించారు. కేసీఆర్ ఇకనైనా వాస్తవ దృక్పథంతో ముందుకెళ్లాలని, ప్రతిపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని హితవు పలికారు. -
ప్రభుత్వ నిర్వాకంతోనే విద్యారంగం అస్తవ్యస్థం
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి కరీంనగర్ :ప్రభుత్వ నిర్వాకంతోనే విద్యారంగం అస్తవ్యస్థంగా మారిందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అధికారంలోకొచ్చి రెండేళ్లు గడుస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అర్అండ్బీ అతిథి గృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాసేలా వ్యవహరించడం దుర్మార్గమని, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా, సర్వీసు రూల్స్‌పై తేల్చకుండా ఉపాధ్యాయులపై మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలు విడ్డూరమని అభిప్రాయపడ్డారు. కేంద్రం నిధులను రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. కరువులో రైతులను ఆదుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చిన రూ.700 కోట్లను దారిమళ్లించిందని పేర్కొన్నారు. రుణమాఫీపై స్పష్టత కొరవడిందని, రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. -
రైల్వే లైన్‌ను పొడిగించాలి
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి జగిత్యాల రూరల్: నూతనంగా ఏర్పాటుచేస్తున్న మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్‌ను జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు పొడిగించాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు తానురాసిన లేఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గురువారం పంపించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం మనోహరాబాద్–సిద్దిపేట–సిరిసిల్ల–కొత్తపల్లికి రైల్వేలైన్ మంజూరు చేసిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని నుంచి కరీంనగర్ వరకు రైల్వేలైన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రతిపాదించిన మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్‌ను మనోహరబాద్, గజ్వేల్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్‌పేట, మంచిర్యాల వరకు కొనసాగిస్తే చాలా ఉపయోగం ఉంటుందన్నారు. దీంతో ఉత్తర భారతదేశాన్ని కలిపే రైలుకు ప్రత్యామ్నాయ రైల్వేలైన్ ఏర్పాటు చేసినట్లవుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలుగా మారనున్న జగిత్యాల, మంచిర్యాల రైల్వేలైన్‌తో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 7న మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేస్తున్నందున ముఖ్యమంత్రి చొరవ తీసుకుని రైల్వేలైన్ జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు పొడిగించేలా చూడాలని కోరారు. నిజామాబాద్ ఎంపీ కవిత, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్కు లేఖలు పంపినట్లు పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్ పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మందులు, వైద్యులు అందుబాటులో ఉండాలి జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో తుల ఉమ నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలన్న జీవన్‌రెడ్డి కరీంనగర్ సిటీ : సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యులు స్థానికంగా ఉండాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. విద్య, వైద్యంపై జెడ్పీ స్థాÄæూ సంఘం సమావేశాలు బుధవారం జెడ్పీ సమావేశమందిరంలో నిర్వహించారు. అధ్యక్షత వహించిన తుల ఉమ మాట్లాడుతూ... వైద్యులు స్థానికంగా ఉండడం లేదని, రోగులను మందులను బయట కొనుక్కోమంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తున్న వైద్యులు వారిని సొంత ఆస్పత్రులకు రమ్మంటూ వైద్యం అందిస్తున్నారని అన్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బందికి సెలవులు పెట్టకుండా రోగులకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. క్యాన్సర్, కిడ్నీ, గుండెసంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అవసరమైన మందులు అందించాలన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవనం పెచ్చులూడి రోగులు గాయపడిన సంఘటనలు పునరావతం కానీయరాదన్నారు. అలాంటి సమస్యలుంటే తమ దష్టికి తీసుకురావాలని, మరమ్మతులు చేయిస్తామని అన్నారు. జ్వరాలొస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు పోయే పరిస్థితే ఉండొద్దన్నారు. ఏఎన్ఎంల నియామకంలో వయోపరిమితి పాటించాలన్నారు. – మూడు వందల మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. వందశాతం అక్షరాస్యత సాధించేలా సంబంధిత అధికారులు ఇప్పటినుంచే అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. – జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ.. అక్కన్నపేటతోపాటు తొమ్మిది పీహెచ్‌సీలను ప్రారంభించాలన్నారు. ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్దం వేణు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇరవై మండలాల్లో వైద్యులు స్థానికంగా ఉండడం లేదన్నారు. కనీసం ఈ సీజన్లోనైనా అందుబాటులో ఉండేలా ఆదేశాలివ్వాలన్నారు. కోహెడ జెడ్పీటీసీ పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. తమ మండలానికి 108 వాహనాన్ని కేటాయించాలని కోరారు. నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించాలి ఎస్సారెస్పీ నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించాలని జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి సూచించారు. ఉదయం జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన వ్యవసాయ స్థాÄæూ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నీటి విడుదల షెడ్యూల్ ప్రకటిస్తే అందుకు అనుగుణంగా రైతులు నార్లు వేసుకొంటారన్నారు. రుణమాఫీకి, రుణ మంజూరుకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతున్నా బ్యాంకర్లు ఈ రెండింటికి ముడిపెడుతున్నారని అన్నారు. రుణాల మంజూరుపై ఈసారి బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ రైతుల పెట్టుబడికి ఉపయోగపడాలని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా జిల్లాకు రావాల్సిన రూ.36 కోట్లు రాలేదన్నారు. 2014లో నష్టపోయిన రైతులకు హార్టికల్చర్ ఇన్పుట్ సబ్సిడీ రూ.6 కోట్లు ఇంకెప్పుడిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటతో ఎరువుల అంచనాలు తలకిందులవుతాయని, పెరిగిన డిమాండ్ మేరకు అధికారులు ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. రోళ్లవాగును డీ–53 ద్వారా నింపితే సారంగాపూర్, ధర్మపురి ప్రాంత రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాయికల్ తదితర ప్రాంతాల్లో ఎండిపోయిన మామిడితోటలకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు గడువు ముగిసినా బ్యాంకర్లు రైతుల నుంచి ప్రీమియం వసూలు చేస్తున్నారన్నారు. అలాంటిదేమీ లేదని జేడీఏ చెప్పడంతో జీవన్‌రెడ్డి లీడ్‌బ్యాంక్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ అంశంపై మంత్రితో చర్చిస్తామని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ హామీ ఇచ్చారు. – మల్హర్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ భూసార పరీక్షలు చేసినా రిపోర్టులు ఇవ్వడం లేదన్నారు. ల్యాబ్‌లో సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది ఉందని జేడీఏ సమాధానం చెప్పడంతో.. ఎజెండాలో చేసినట్లు ఎందుకు చూపించారని ఆయన నిలదీశారు. మాచారంలో 16 మందికి డ్రిప్ ఏర్పాటు చేయలేదన్నారు. తమ ప్రాంతంలో రైతులు మిర్చి పంటను అధికంగా పండిస్తున్నారని, వారికి మార్కెటింVŠ సౌకర్యం కల్పించాలని కోరారు. యంత్రాలతో ఆరపెడితే 24 గంటల్లో విక్రయించుకోవచ్చని, లేదంటే 12 నుంచి 14 రోజుల సమయం పడుతుందన్నారు. – వ్యవసాయం చేయని పట్టా భూములను సర్వే చేసి వాటిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధికారులకు సూచించారు. – సాయంత్రం స్త్రీ శిశు సంక్షేమ స్థాÄæూ సంఘం సమావేశం కమిటీ చైర్పర్సన్ కందుల సంద్యారాణి అధ్యక్షతన జరిగింది. జెడ్పీటీసీ శోభ మాట్లాడుతూ కందిపప్పు నాణ్యత లేదని, కోడిగుడ్లు చిన్నవిగా ఉంటున్నాయని, గ్యాస్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పిల్లలు రావడం లేదన్నారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఇద్దరు ముగ్గురున్న కేంద్రాలను మూసివేయాలన్నారు. బాలసంరక్షణా కేంద్రాలు, అనాథాశ్రమాలకు అనుమతుల్లో నిబంధనలు అమలు చేయాలన్నారు. – ఈ సమావేశాల్లో జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం జరగాల్సి ఉండగా, సభ్యులు రాకపోవడంతో కోరం లేక ఎదురుచూడాల్సి వచ్చింది. 11 గంటలకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రాగా, మరో 12 నిమిషాలకు ఇద్దరు సభ్యులు రావడంతో సమావేశాన్ని ప్రారంభించారు. -
123 జీవో రద్దుతోనైనా కళ్లు తెరవాలి
ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జగిత్యాల రూరల్: జీవో 123 రద్దుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ చట్టం ద్వారా పరిహారం చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం 123 జీవో ద్వారా ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతోనే హైకోర్టు జీవో 123ని రద్దు చేసిందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మెరుగైన వసతులు కల్పించాలని చట్టంలో ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణి, రాజరిక పాలన తలపించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రాజ్టెల నిర్మాణానికి, పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. ముంపు నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు పోరాడుతున్నాయని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇన్నిసార్లు కోర్టు మందలించిన దాఖలు లేవని, కోర్టు తీర్పు చెంపపెట్టు కావాలన్నారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్ పాల్గొన్నారు. -
రుణమాఫీ ఒకేసారి చేయాలి: జీవన్ రెడ్డి
కరీంనగర్: కరువుతో అల్లాడుతున్న రైతుల రుణమాఫీ ఒకేసారి చేయాలని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి అన్నారు. బ్యాంకర్స్‌తో సీఎం కేసీఆర్ సమావేశం కావాలని కోరారు. మద్యం పై వచ్చే రూ.12 వేల కోట్ల ఆదాయం రుణమాఫీకి కేటాయించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే కాదు..రాష్ట్రానికి కూడా సీఎంలా వ్యవహరించాలని ఎద్దేవా చేశారు. -
కేసీఆర్ ఫాంహౌస్ భూమి ఎకరా 10 లక్షలకు ఇస్తారా?
హైదరాబాద్: సీఎం కేసీఆర్ తన ఫాం హౌస్ భూమిని ఎకరా రూ.10 లక్షలకు ఇస్తారా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగితే ప్రాజెక్టులను తాము అడ్డుకుంటున్నట్లు మంత్రి హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో 123 ద్వారా నిర్వాసితులకు న్యాయం జరగదు, ఆ జీవోలో నష్టపరిహారం, పునరావాసం అంశాలు లేవని ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అమలుచేసి భూ నిర్వాసితులకు నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షలే ఇస్తామనడం అన్యాయమన్నారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి, భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చే విధానాన్ని ఖరారు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సూచించారు. -
మంత్రి చెప్పడం వల్లే వాకౌట్: జీవన్ రెడ్డి
హైదరాబాద్: పోలీసుల వైఫల్యం వల్లే వీణవంక ఘటన జరిగిందని కాంగ్రెస్ సీనీయర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలలో వీణవంక ఘటనపై ఆయన మాట్లాడారు. బాధితురాలు ఫిర్యాదుచేసినా పోలీసులు స్పందించలేదని గుర్తచేశారు. నిందితుల్లో ఒకరిని మైనర్ గా చూపడం, కేసును పోలీసులు నీరు గారుస్తున్నారనడానికి నిదర్శనమని తెలుస్తోందని వ్యాఖ్యానించారు. నిందితులకు పోలీసులు అండగా నిలుస్తున్నారని, సభలో మంత్రి చేసిన ప్రకటనలో స్పష్టమైందన్నారు. మంత్రి ప్రకటనపై వివరణ అడగటానికి వీల్లేదని మరో మంత్రి హరీష్ రావు చెప్పడం వల్లే తమ పార్టీ నేతలు వాకౌట్ చేశామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ ట్రెయినింగ్ శిక్షణకు వెళ్తున్న దళిత యువతిపై తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కొంతకాలం కిందట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.