
సాక్షి, జగిత్యాల: తిప‍్పనపేట గ్రామానికి చెందిన పంటపొలాలకు ఎస్‌ఆర్‌ఎస్‌పి నీళ‍్లు అందడంలేదని నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఎస్సారెస్పీ అధికారులకు నీటి విడుదలపై కార్యాచరణ లేదన్నారు. అలాగే చివరి ఆయకట్టుకు నీరందించే వరకు పోరాటం చేస్తామని హెచ‍్చరించారు.
అంతేగాక సింగూర్ నుంచి నీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, మిడ్ మానేరుకు 14 టీఎంసీల నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భారీ సంఖ‍్యలో హాజరైన రైతులు నీటిపారుదలశాఖ ఈఈ దరూర్ క్యాంపు కార్యాలయాన్ని ముట‍్టడించారు.
Comments
Please login to add a commentAdd a comment