![Jagga Reddy On Jeevan Reddy Issues](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/10/25/jaggareddy1.jpg.webp?itok=DL8Fbg1u)
హైదరాబాద్: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆవేదన మీడియాలో చూసి తన మనసుకు చాలా బాధగా అనిపించిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ వయసులో జీవన్‌రెడ్డికి ఈ ఆవేదన ఏంటో అని మనసు కలుక్కుమన్నది. జగ్గారెడ్డి అండగా ఉన్నాడు అని చెప్పడానికి... నా మనసులో మాటని మీడియా ద్వారా తెలియజేస్తున్నా. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. కానీ జీవన్ రెడ్డి నేను ఒంటరి అని అనుకోవద్దు.
సమయం వచ్చినప్పుడు జీవన్‌రెడ్డి వెంట జగ్గారెడ్డి ఉంటాడు. ఎప్పుడు జనంలో ఉండే ఆయన్ని జగిత్యాల ప్రజలు ఎందుకు ఒడగొట్టారో అర్థం కానీ పరిస్థితి. పార్టీని కానీ.. ప్రజలను కానీ తప్పుపట్టడం లేదు. మా టైం బాగోలేదు కాబట్టి.. ఎవరేం చేస్తారు అని సర్డుకుపోతున్నా. దీన్ని తొందరగా అధిష్టానం గుర్తించి జీవన్‌రెడ్డి సమస్యకు పరిష్కారం చూపాలని... సీఎం రేవంత్‌రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ని, ఖర్గేని, రాహుల్‌గాంధీని మీడియా ముఖంగా కోరుతున్నా’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి
Comments
Please login to add a commentAdd a comment