Jaggareddy
-
బీజేపీపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమే లేదన్నారు. పొరపాటున బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో జగ్గారెడ్డి ఆదివారం(జనవరి26) మీడియాతో మాట్లాడారు. ‘ఈ దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇంధిరమ్మ ఇల్లు కనిపిస్తుంది. ఏ ముసలి అవ్వ, ముసలి తాతను అడిగినా ఇంధిరమ్మ ఇళ్లలోనే ఉంటుంన్నాం అని చెప్తారు. ఇంధిరమ్మను చూసేందుకు మారుమూల గ్రామాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చేవారు. ఉనికి కోసమే బండి సంజయ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఇంధిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వమని సంజయ్ బెదిరిస్తున్నారు. బండి సంజయ్ నీ ఊరికే వస్తా.. ఇంధిరమ్మ గురించి ఓ ముసలమ్మను అడుగుదాం.. ఏం చెప్తదో చూద్దాం. స్వాతంత్ర్య ఉధ్యమంలో నిండు గర్బినిగా ఉండగా ఇందిరమ్మ జైలుకు వెళ్లారు. విలువలతో కూడిన రాజకీయం బీజేపీ చేయడం లేదు. అటల్ బీహారీ వాజ్‌పేయి,ఎల్కే అద్వానీ గురించి మేము ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. ఇంధిరా గాంధీ చరిత్ర ఎంత చెప్పినా తక్కువే. రాజ్యాంగాన్ని నిర్మించే భాధ్యత అంబేద్కర్‌కు అప్పగించింది నెహ్రూయే. ఇంధిరాగాంధీని విమర్శించడం బండి సంజయ్ వయస్సుకు తగదు. బండి సంజయ్ క్షమాపణ చెప్పి..ఈ వివాదానికి స్వస్తి పలకాలి’అని జగ్గారెడ్డి కోరారు. -
బండి సంజయ్‌పై జగ్గారెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై చేసిన వ్యాఖ్యలకుగాను కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విషయమై జగ్గారెడ్డి శనివారం(జనవరి25) మీడియాతో మాట్లాడారు.‘బండి సంజయ్‌కి రాజకీయ అనుభవం లేకుండానే మినిస్టర్ పోస్ట్ వచ్చింది. బండి సంజయ్‌కి అనుభవం లేదు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడుతా అంటే కుదరదు. కొందరు నేతలు న్యూస్ బ్రేకింగ్ కోసం మాట్లాడుతున్నారు. బండి సంజయ్ బ్రేకింగ్ లీడర్.. ఆయన మాట్లాడితే తలా తోక ఉండదు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వారి ఫోటోనే ఉంటది. మోదీ ఫోటో పెట్టకపోతే పైసలు ఇయ్యరా.బండి సంజయ్ తెలంగాణ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బియ్యానికి పైసలు ఇయ్యమని బండి సంజయ్ ఎలా అంటారు. ఇళ్ళ కు నిధులు ఇవ్వమని బెదిరిస్తారా...ఇంత డైరెక్ట్ గా బెదిరింపులా నిధులు ఏమైనా సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తున్నారా..తెలంగాణ ప్రజలకే కదా. మోదీకి గులాం చేస్తేనే నిధులు ఇస్తారా. బండి సంజయ్ వాఖ్యలను కిషన్ రెడ్డి సమర్దిస్తారా’చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. -
‘ఆయన పడే ఆవేదన చూసి మనసు కలుక్కుమన్నది’
హైదరాబాద్: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆవేదన మీడియాలో చూసి తన మనసుకు చాలా బాధగా అనిపించిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ వయసులో జీవన్‌రెడ్డికి ఈ ఆవేదన ఏంటో అని మనసు కలుక్కుమన్నది. జగ్గారెడ్డి అండగా ఉన్నాడు అని చెప్పడానికి... నా మనసులో మాటని మీడియా ద్వారా తెలియజేస్తున్నా. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. కానీ జీవన్ రెడ్డి నేను ఒంటరి అని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు జీవన్‌రెడ్డి వెంట జగ్గారెడ్డి ఉంటాడు. ఎప్పుడు జనంలో ఉండే ఆయన్ని జగిత్యాల ప్రజలు ఎందుకు ఒడగొట్టారో అర్థం కానీ పరిస్థితి. పార్టీని కానీ.. ప్రజలను కానీ తప్పుపట్టడం లేదు. మా టైం బాగోలేదు కాబట్టి.. ఎవరేం చేస్తారు అని సర్డుకుపోతున్నా. దీన్ని తొందరగా అధిష్టానం గుర్తించి జీవన్‌రెడ్డి సమస్యకు పరిష్కారం చూపాలని... సీఎం రేవంత్‌రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ని, ఖర్గేని, రాహుల్‌గాంధీని మీడియా ముఖంగా కోరుతున్నా’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి -
తెలంగాణలో బాబు రాజకీయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుపెట్టి బీజేపీ రాజకీయం ప్రారంభించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆడిన విధంగానే ఇక్కడ బీజేపీతో కలిసి నాలుగు స్తంభాలాట ఆడాలనేది చంద్రబాబు వ్యూహమని, ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని నిర్వీర్యం చేయలేరని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు బి.లింగం యాదవ్, గజ్జి భాస్కర్లతో కలసి ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు హైదరాబాద్ ఎన్నోసార్లు వచ్చి వెళ్లారని, అయినా ఎవరికీ తెలిసేది కాదని, ఇప్పుడు విభజన సమస్యల పేరుతో మళ్లీ హైదరాబాద్‌లో బాబు ప్రవేశించారని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి బీజేపీ వేస్తున్న ఎత్తుగడలో చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ డైరెక్షన్లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబు వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా సమరి్థంచారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అని, హైటెక్‌సిటీకి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలోనే పునాదులు పడ్డాయని, ఇప్పుడు చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చేసిన అభివద్ధినే బాబు, కేసీఆర్ కొనసాగించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాను నామినేటెడ్ పదవులు ఆశించే వాడిని కాదని స్పష్టం చేశారు. రాజుయుద్ధం చేసి గెలిచినట్టు సంగారెడ్డి రాజ్యానికి మళ్లీ ప్రజలు గెలిపించి తనను రాజును చేస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
ఐటీఐఆర్ ఇచ్చే వరకుమాట్లాడుతూనే ఉంటా
సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రాష్ట్రానికి రావలసిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆగిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి ఐదు రోజుల క్రితం మాట్లాడానని అన్నారు. యువతకు ఉద్యోగాలు దొరికే అంశం కాబట్టి ఐటీఐఆర్ ప్రాజె క్టును మంజూరు చేసేంత వరకు తాను కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటానని, ఇలా ఐదు రోజులకు ఒకసారి దీనిమీద మాట్లాడతానని తేల్చిచెప్పారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఐటీఐఆర్‌కు అనుమతి ఇవ్వడమే కాక, 50 వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పెట్టాల ని నిర్ణయించిందని, తద్వారా 60 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసిందని వివరించారు. మోదీ ప్రధాని అయ్యాక దానిని రద్దు చేశారని అన్నారు. మోదీ ఆ ప్రాజెక్టును రద్దు చేయకపోయి ఉంటే పదేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉంటే.. తామే ఐటీఐఆర్ తెచ్చే వాళ్ళమని పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లను కలిసి వినతిపత్రం సమర్పిస్తానని, రద్దు చేసిన ఐటీఐఆర్ మళ్లీ తెమ్మని అడుగుతానని అన్నారు. ఎంపీ రఘునందన్‌రావు తనకు ఐటీఐఆర్ గురించి అ ఆ లు కూడా తెలియవని అన్నారని, విద్యాపరంగా తాను వీక్ అని ఒప్పుకుంటున్నట్లు చెప్పారు. అయితే, రఘునందన్‌కు ఆర్ఎస్ఎస్ శాఖల గురించి, జగ్గారెడ్డి గురించి తెలియదని, కిషన్‌రెడ్డి, దత్తా త్రేయలను అడిగితే చెపుతారని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్‌ను బీజేపీ రద్దు చేసింది
సాక్షి, హైదరాబాద్: గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టును మంజూరు చేస్తే, బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలివ్వాలని అప్పట్లో తమ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టును ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. శుక్రవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మెట్టుసాయికుమార్, కోట్ల శ్రీనివాస్‌లతో కలసి ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలకు దేవుడి పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం తప్ప బతుకుతెరువు కోసం ఉద్యోగాలు ఇప్పించడం తెలియదని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో రాష్ట్ర యువతకు 15 లక్షల ఉద్యోగ అవకాశాలు దక్కేవని, కానీ ఆ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడంతో లక్షల కుటుంబాలు ఉద్యోగాలకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గడ్డ సేఫ్టీకి అడ్డా అని, అందుకే ఐటీఐఆర్‌ను సోనియాగాంధీ మంజూరు చేశారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు హైదరాబాద్ గడ్డపై ఐటీఐఆర్‌తో అడుగుపెట్టి ఉంటే ప్రజలు సంతోíÙంచే వారన్నారు. ఇప్పుడు కూడా ఐటీఐఆర్ ప్రాజెక్టును మళ్లీ తీసుకురావాల్సిన బాధ్యత ఆ ఇద్దరిదేనని, వారికి ఎప్పటికప్పుడు ఐటీఐఆర్ గురించి గుర్తుచేస్తుంటామని చెప్పారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అంశం తన పరిధిలోనిది కాదని, శాసనసభ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనన్నారు. -
ఆ ముగ్గురి చేరిక నిలిపివేత!
ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరేళ్లపాటు పార్టీ బహిష్కరణకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్‌ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్‌రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.ఇటీవల జగ్గారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈ ముగ్గురు ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌రెడ్డిని కూడా కలిశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈ ముగ్గురు నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవద్దంటూ కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ దహనం చేయడంతో పాటు నోటికి నల్లగుడ్డలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను గమనించిన పార్టీ నాయకత్వం వారి చేరికలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో కంది వర్గీయుల పోరాటం ఫలించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఆదేశాల మేరకు ఆ నాయకుల చేరికలను నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీమెంబర్ జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాయకత్వంతో చర్చించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు వారి చేరిక నిలిపివేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు.ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు.. -
పీకే మాటలకు విలువే లేదు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రశాంత్‌కిషోర్ (పీకే) మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, బతుకు దెరువు కోసం సర్వే సంస్థ పేరుతో రోజుకో మాట మాట్లాడుతాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. గాం«దీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల పీకే సర్వేల పేరిట చెపుతున్న జోస్యాలను కొట్టిపారేశారు. పీకే మాటలకు విలువ లేదని తేల్చి చెప్పారు. దేశంలో గెలిచేది బీజేపీ అని ఓసారి, ఇంకోసారి కాంగ్రెస్ అని అంటాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పాడని, కానీ కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. పీకే సర్వేలకు, మాటలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పారీ్టకి 12 నుంచి 14 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ పాలనకు వంద మార్కులు రేవంత్ పాలనకు వంద మార్కులు వేస్తున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటే బాగుంటుందనే రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో కింగ్, కింగ్ మేకర్ రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. కరువు కాంగ్రెస్‌తో వచి్చందని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు వర్షాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలుసుకునే తెలివి లేదా అని విమర్శించారు. కేసీఆర్ ఇంకా ఓటమి ఫ్ర్రస్టేషన్లోనే ఉన్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఏ విషయంపైనా కనీస అవగాహన ఉండదని విమర్శించారు. బీజేపీ బౌండరీలో మంద కృష్ణ రాజకీయాలు బీజేపీ బౌండరీలో ఉండి మంద కృష్ణ మాదిగ రాజకీయాలు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. న్యూట్రల్‌గా ఉంటే ఆయన ఏం అడిగినా సమాధానం చెప్పేవాళ్లమన్నారు. బీజేపీ తెలంగాణలో మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయమని గానీ కేంద్ర మంత్రిని చేయాలని గానీ మంద కృష్ణ అడిగారా అని ప్రశ్నించారు. బంగారు లక్ష్మణ్‌ని నవ్వులపాలు చేసినప్పుడు మంద కృష్ణ కనీసం స్పందించలేదని గుర్తు చేశారు.పార్టీ ఫిరాయింపులపై తాను మాట్లాడలేనని, ఎందుకంటే తానే పార్టీలు మారి వచ్చానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
‘కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు’
సాక్షి, హైదరాబాద్: తాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) పదవి అడగడం కొత్త కాదని.. అవకాశం వచ్చిన ప్రతి సారి తాను అడుగుతానని కాంగ్రెస్ నేత జాగ్గారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పీసీసీ అవకాశం ఇస్తే ఓకే. రెడ్డిలలో ఎవరికైనా అవకాశం ఇస్తే ఆ పోటీ పడే లిస్ట్‌లో నేను ఉంటాను. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు అడ్డదారులు తొక్కలేదు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ. రాజ్యాంగం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. విషయ అవగాహన లేని మంత్రి కిషన్ రెడ్డి. ఆర్థిక వనరుల సమీకరణ, బతుకు తెరువు కోసం పీకే సర్వే సంస్థ ఏర్పాటు చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు. మాదిగలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. దామోదర రాజనర్సింహకు, మీరా కుమార్‌కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి లాభం చేకూర్చేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారు. వర్షాకాలంలో వర్షాలు పడుతాయి. ఎండ కాలంలో వర్షాలు పడవు. కనీసం బుద్ధి లేకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఒక కాంగ్రెస్ అభిమానిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఆయన రాజే. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. మా వంద రోజుల పాలన గురించి మమ్మలని అడగకండి. ఆర్టీసి బస్సులలో ప్రయాణం చేసే మహిళలను అడగండి వాళ్ళు చెపుతారు. ఫిరాయింపుల మీద నేను మాట్లాడలేను. నేను కూడా రెండు సార్లు పార్టీ మారాను. పదవుల కోసం నేను కక్కుర్తి పడను’అని జగ్గారెడ్డి అన్నాఉ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ ఉందని, రాజ పూజ్యం 16, అవమానం 2 ఉందని తెలపారు. -
మేడిగడ్డనో... బొందల గడ్డనో తేల్చాలి
సాక్షి, హైదరాబాద్: అది మేడిగడ్డనో, బొందలగడ్డనో ముందు కేసీఆర్ తేల్చాలని, ఆ తర్వాతే బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్లాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి స్పష్టం చేశారు.మేడిగడ్డలో పిల్లర్లు కుంగింది నిజం కాదా అని ప్రశ్నించారు. బుధవారం గాందీభవన్‌లో టీపీసీసీ ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ నేతలు కోట్ల శ్రీనివాస్, చరణ్‌కౌశిక్ యాదవ్‌తో కలిసి జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏం పీకడానికి మేడిగడ్డ వెళుతున్నారంటూ నల్లగొండ సభలో కేసీఆర్ ప్రశ్నించారని గుర్తు చేసిన జగ్గారెడ్డి.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ చేసిన అవినీతిని పీకడానికి, కట్టిన డబ్బు సంచులు పీకడానికి వెళ్లామని బదులిచ్చారు. బీఆర్ఎస్ నేతలు ముందుగా మంచి బుద్ధి తెచ్చుకోవాలని, మీరు ఒకటి అంటే మా కార్యకర్తలు వంద అంటారన్న విషయం మర్చిపోద్దని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌నుద్దేశించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, ఆయన వెంటనే క్షమాపణలు చెపితే వివాదం ఇంతటితో ముగిసిపోతుందన్నారు. బాల్కసుమన్ చిన్నపిలగాడు.. కడియం గాలిపటం మాదిరి బాల్కసుమన్ చిన్నపిలగాడని, పిలగాడు పిలగాడి తీరులోనే ఉండాలని జగ్గారెడ్డి హితవు పలికారు. కడియం శ్రీహరికి రాజకీయ జ్ఞానం లేదని గాలిపటం లాంటి వాడని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీ అధినేతల లైన్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని, అది కూడా తెలియని కడియం శ్రీహరి తన వద్దకు వస్తే క్లాసులు చెపుతానని వ్యాఖ్యానించారు. తన టైం బాగాలేక సంగారెడ్డిలో ఓడిపోయాయని, ఐదేళ్లు రెస్ట్ ఇచ్చినందుకు సంగారెడ్డి ప్రజలకు కృతజ్ఞతలని చెప్పిన జగ్గారెడ్డి తాను మెదక్ ఎంపీగా పోటీ చేయడం లేదని, ఈ అంశంలోకి మరోమారు తనను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. -
అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణపై ప్రేమతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించలేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేవలం రాజకీయం కోసమే పెట్టాడని మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నా ధైర్యం చూసి.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా కాకుండా బీఆర్ఎస్, బీజేపీ పనిచేస్తుంది. రాష్ట్రంలో 14 సీట్లు గెలవడమే మా టార్గెట్. దాన్ని అడ్డుకోడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. ..లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పుడు బండి సంజయ్.. కవిత అరెస్ట్ అవుతుందని చెప్పిండు ఏమైంది. ఇప్పుడు కవితకు నోటీసుల విషయం కూడా అంతా డ్రామానే. అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరాను. గాంధీ కుటుంబంపై ప్రేమతోనే కాంగ్రెస్‌లో చేరాను. రాహుల్ అంటే నాకు పిచ్చి.. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. రాహుల్‌ను ప్రధానమంత్రి చేయడం కోసం నిర్విరామంగా పనిచేస్తా’ అని జగ్గారెడ్డి తెలిపారు. -
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలపై విచారణ జరపాలని ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిసారీ చేసింది కాంగ్రెస్ నేతలయితే, కేసీఆర్ కుటుంబం సెంటిమెంట్‌ను వాడుకుని రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌లతో కలిసి ఆయన మాట్లాడుతూ, హెచ్ఎండీఏలో ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ పట్టుకుంటే పెద్దోళ్లు బయటకు వస్తున్నారని అన్నారు. ఈ శాఖను కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నిర్వహించిన నేపథ్యంలో ఈ అవినీతిలో ఎవరెవరు ఉన్నారన్నది బట్టబయలు చేయాలని కోరారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన చరిత్ర తమదని, తెలంగాణ రైతాంగానికి కూడా రుణమాఫీ చేస్తామని, రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. నాడు పోపో అంటే... నేడు రా.. రా అంటున్నారు: జగ్గారెడ్డి ధరణి పోర్టల్ లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, రైతులకు ఉపయోగపడని ధరణిని రద్దు చేయాలని రాహుల్‌గాం«దీనే చెప్పారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్ల తర్వాత అసెంబ్లీలో మూడున్నర గంటలపాటు చర్చ జరిగిందని, అసెంబ్లీలో ఏం జరుగుతోందన్నది తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోందన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిని పోపో అని నోరు మూసేవారని, ఇప్పుడు సీఎం రేవంత్ మాత్రం రా..రా.. అంటున్నా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారం ఇవ్వకపోతే కేసీఆర్ అసెంబ్లీకి రాడా అని ప్రశ్నించారు. ప్రజలిచ్చిన తీర్పును కేసీఆర్ అవమానపరుస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. -
సీఎం రేవంత్‌తో జగ్గారెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి వెళ్లిన జగ్గారెడ్డి 20 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య రాజకీయ అంశాలపైనే చర్చ జరిగిందని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవితో పాటు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల పోటీ, నెల రోజుల కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన కార్యక్రమం తదితర అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. -
పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి
సాక్షి,హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని, రాహుల్ గాందీని ప్రధాన మంత్రిని చేయాలని టీపీసీసీ నేతలు పిలుపునిచ్చారు. గురువారం గాంధీ భవన్లో 139వ అఖిల భారత జాతీ య కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సేవా దళ్ వందేళ్ల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, పార్టీ ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ జెండాను మహేశ్‌కుమార్‌గౌడ్ ఆవిష్కరించగా.. సేవాదళ్ ర్యాలీని జగ్గారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మా ట్లాడుతూ, 1885లో బొంబాయిలో 72 మందితో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ.. నేడు 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిందన్నారు. స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఒకవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం, మరోవైపు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసిన సేవలను ప్రజలు మరవలేరన్నారు. సోనియా గాం«దీ, పీవీ, మన్మోహన్సింగ్ లాంటి వారు దేశం కోసం నిరంతరం శ్రమించారన్నారు. మంత్రి జూపల్లి శుభాకాంక్షలు భారత్.. ప్రపంచంలో సగర్వంగా నిలబడిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్లెనని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. మతతత్వ శక్తుల చేతిలో దేశం బందీగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి : మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి కావాలో అందరివాడుగా పేరొంది నిత్యం అందుబాటులో ఉంటున్న చింతా ప్రభాకర్ కావాలో నియోజకవర్గ ప్రజలు తెల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి, జహీరాబాద్‌లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఎన్నికల బూత్ కమిటీల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గతంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న జగ్గారెడ్డి గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఐదు సార్లు అయినా సంగారెడ్డికి రాకుండా ముఖం చాటేశారన్నారు. ఎన్నికల హామీల్లో గల్లికో ఏటీఎం, ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం అని చెప్పి ఇంతవరకు కనిపించకుండా పోయారన్నారు. తిరిగి డ్రామాలు చేయడానికి కల్లబొల్లి మాటలతో వస్తాడు! జాగ్రత్తగా ఉండాలని హితవుపలికారు. ముఖ్యనాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ మౌనం వీడి, మొహమాటం పక్కన పెట్టి రంగంలో దిగితే జగ్గారెడ్డి గాల్లో కలిసి పోతారన్నారు. ఇటీవల పట్టణంలో జరిగిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే బహిరంగ సభలో ఉన్న దాని కంటే ఎక్కువ మంది కేవలం ముఖ్యకార్యకర్తల ఈ మీటింగ్‌లోనే ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసుకున్న జగ్గారెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తెలంగాణ వస్తే సంగారెడ్డిని కర్ణాటకలో కలపాలని చెప్పిన ఆయనకు సంగారెడ్డి ప్రజల ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉండగా.. రేవంత్ లాంటి రాంగ్ లీడర్లకు మద్దతు ఇవ్వొదని ఉద్ఘాటించారు. మూడోసారి సైతం కేసీఆర్ సీఎం అవుతారన్నారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ సైతం 50 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు. నాయకులు బాగా పని చేయాలి! ఈసారి కార్యకర్తలు, నాయకులు బాగా పని చేసి చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే సంగారెడ్డిని మరింత అభివృద్ధి చేస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఆయనకు అనారోగ్యంగా ఉన్న విశ్రాంతి లేకుండా ప్రజల కోసం అహర్నిశలు పనిచేసిన మంచి నాయకుడన్నారు. కాంగ్రెస్ చెప్పే మాయమాటలను నమ్మి మోసపోతే గోసపడేది ప్రజలేనన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. బీజేపీ డకౌటయితే కాంగ్రెస్ ఇట్ వికెట్ గా నిలిచిపోతుందని చెప్పారు. సంగారెడ్డికి రూ. 570 కోట్లతో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల తీసుకువచ్చామని స్పష్టం చేశారు. రూ.70 కోట్లతో సంగారెడ్డిని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. అనంతరం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజలే నా బలం నా బలగం అన్నారు. తామే అభ్యర్థిగా భావించి తనను గెలిపించాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యం.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పార్టీకి 75 పైగా సీట్లు వస్తాయని, అన్నీ సర్వేలు చెబుతున్నాయన్నారు. జిల్లాలో ఉన్న పదికి పది సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అవి గెలిపించుకుని కేసీఆర్‌కు కానుకగా ఇద్దామన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కరెంట్ కట్ అవుతుందన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే 5 గంటల కరెంట్ ఇస్తామని ఇటీవల తాండూర్ సభలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారని, తెలంగాణలో 24 గంటల సరఫరా ఉందన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. రైతు బంధు బంద్ చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు అడ్డా కూలీలని, బీరుబిర్యానీలకు అమ్ముడుపోతారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అవమానపరిచారన్నారు. ఆ పార్టీ నాయకులకు ఎంత గర్వమో ప్రజలు ఆలోచించాలన్నారు. సమావేశాల్లో ఎంపీ.బీబీపాటిల్, టీఎస్ ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ పట్నం మాణిక్యం, డీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, నాయకులు డాక్టర్ శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, విజేందర్‌రెడ్డి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్ దేవిప్రసాద్, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కోడ్ ఉల్లంఘనలపై కొరడా.. డీజేలు, పోస్టర్లున్న వాహనాలు సీజ్! -
సంగారెడ్డి కాంగ్రెస్ తొలి జాబితాలో ఈ ముగ్గురు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని ము గ్గురు నేతలకు చోటు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జాబితాలో అందోల్ నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ పేరు కూడా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఉండే అవశాలున్నాయి. అందోల్ టిక్కెట్ కోసం దామోదర రాజనర్సింహతోపాటు ఆయన కూతురు త్రిష మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి జగ్గారెడ్డితో పాటు మరో నలుగురు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, జగ్గారెడ్డి పేరు తొలిజాబితాలో చోటు దక్కనుంది. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో చంద్రశేఖర్‌తో పాటు స్థానికంగా ఉండే ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ టిక్కెట్ హామీతోనే చంద్రశేఖర్ పార్టీలో చేరడంతో తొలిజాబితాలోనే ఆయన పేరు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసే ప్రక్రియను ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చేపట్టింది. ఆయా నియోజకవర్గాల టికెట్ల కోసం గతనెల 25 వరకు అందిన దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో టికెట్లు ఎవరికి దక్కుతాయోనని ఆసక్తి నెలకొంది. ఆ రెండు చోట్ల పీటముడి.. పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల విషయంలో పీటముడి నెలకొంది. పటాన్చెరువు నియోజకవర్గం టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్ ఆశిస్తున్నారు. తొలి జాబితాలోనే తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు కాటా శ్రీనివాస్‌గౌడ్ కూడా ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు గాలి అనిల్ కూడా నర్సాపూర్ టికెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ గాలి అనిల్‌కు నర్సాపూర్ టికెట్ ఖరారైతే పటాన్చెరు టికెట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పటాన్చెరులో కాటా తోపాటు శశికళాయాదవ్‌రెడ్డి, ఎం.సప్పాన్దేవ్.. ఇలా మొ త్తం తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. నర్సాపూర్ నియోజకవర్గానికి గాలి అనిల్‌తో పాటు, ఆవుల రాజిరెడ్డి, శివన్నగారి ఆంజనేయులుగౌడ్, రవీందర్‌రెడ్డి తదితరులు ఆశిస్తున్నారు. మలిజాబితాలో.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి మధ్య పంచాయితీ తేలితే ఇక్కడి అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మెదక్‌లో నియోజకవర్గానికి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, చౌదరి సుప్రభాత్రావు, మ్యాడం బాలకృష్ణలతో కలిసి ఏకంగా 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ కొత్త నాయకుడు పార్టీలో చేరే అవకాశాలుండటంతో మెదక్ అభ్యర్థిత్వం తొలిజాబితాలో ఉండే అవకాశం లేదు. ఆ నాలుగు చోట్ల.. దుబ్బాక టికెట్ కోసం చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడ కత్తి కార్తీకగౌడ్, శ్రావణ్‌కుమార్‌రెడ్డి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వారికే సాధారణ ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వాలనే పార్టీ నిబంధన ఉన్నందున తనకే టికెట్ తనకే దక్కుతుందని శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ద్వారా శ్రావణ్‌కుమార్‌రెడ్డి ప్రయ త్నాలు చేస్తున్నారు. సిద్దిపేట టిక్కెట్ కోసం ఏకంగా 15 మంది దరఖాస్తు చేసుకోగా, గజ్వేల్ టికెట్‌కూ పోటాపోటీ నెలకొంది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పోటీ చేసే అభ్యర్థి కావడంతో కాంగ్రెస్ ఆచీతూచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో తొలి జాబితాలో మూడు పేర్లు మాత్రమే ఉండే అవకాశాలున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
TS Election 2023: కాంగ్రెస్‌లో సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి..! కానీ ఇప్పుడు..?
సంగారెడ్డి: కాంగ్రెస్‌లో సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అన్నట్లుగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి మారింది ఈ అసెంబ్లీ స్థానం టికెట్ కోసం పోటాపోటీ నెలకొంది. తనకు ఎదురు లేదనుకున్న చోట తొలిసారిగా నలుగురు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఉపముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు దామోదర రాజనర్సింహ ప్రధాన అనుచరుడు, మరికొందరు, జగ్గారెడ్డి తరపున ఆయన సతీమణి నిర్మలా దరఖాస్తు చేసుకున్నారు. అయితే టీడీపీలో వివిధ పోస్టుల్లో పనిచేసిన సంగమేశ్వర్, రాజనర్సింహ వెంటే ఉంటున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనూ పేరు తెరపైకి రాగా కేటాయించాలని దామోదర సూచించినట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు ఈ విషయమై ఆసక్తికరంగా మారింది. తొలిసారిగా.. తొలిసారిగా సంగారెడ్డి టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై అసమ్మతి గళం వినిపించి, పలుమార్లు మంత్రి కేటీఆర్‌ను కలవడంతో గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమైందనే అభిప్రాయం కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమైంది. పార్టీలో చేర్చుకోవద్దని, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గానికి చెందిన గులాబీ శ్రేణులంతా సమావేశమయ్యారు. హైదరాబాద్ వెళ్లి మంత్రి హరీశ్‌రావునూ కలిశారు. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ప్రభాకర్‌కే దక్కింది. దీంతో జగ్గన్న అధికార పార్టీలోకి చేరుతున్నారనే ప్రచారానికి తెరపడింది. తాను పార్టీ మారడం లేదని, రాహుల్‌గాంధీతోనే రాజకీయ ప్రయాణం ఉంటుందని వివరణ ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు నాయకులు దరఖాస్తు చేసుకోవడం పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్ వర్గం నుంచి కూడా.. పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొత్తిరెడ్డిపల్లికి చెందిన పొన్న శంకర్‌రెడ్డి అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలను ప్రత్యేకంగా చేస్తుంటారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వర్గానికి చెందిన అనుచరుడిగా పేరుంది. ఇప్పుడు ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నారు. మరో ఇద్దరు.. జిల్లా కేంద్రానికి చెందిన అడ్వొకేట్ ఎంఏ ముఖీం, తెలంగాణ జనసమితి (టీజేఎస్) నాయకుడు తుల్జారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ముఖీం.. మనబీన్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా టీజేఎస్ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేదా విలీనమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. -
'పార్టీ మారడం లేదు.. ఇలాంటి పుకార్లలో టీడీపీ దిట్ట..'
హైదరాబాద్: తాను పార్టీ మారడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తాను పార్టీ మారతానని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని చెప్పారు. ఏడాదిగా ఈ దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇంత శాడిజం ఎంటో తనకు అర్థం కావట్లేదని అన్నారు. బీఆర్ఎస్తో కొట్లాడి గెలిచానని చెప్పారు. తాను పార్టీ మారతానని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా కల్చర్ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ అయిందని పేర్కొన్నారు. దీన్ని వాడటంలో టీడీపీ దిట్ట అని ఆరోపించారు. టీడీపీ కల్చర్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించిందని అన్నారు. ఇదీ చదవండి: Bholakpur Scrap Godown Blast: బోలక్‌పూర్‌లో పేలుడు.. -
సంగారెడ్డి: బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి!
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత ఆసక్తిని రేపే నియోజకవర్గం ఇది. ఇక్కడి ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక.. బీఆర్ఎస్ రెండు సార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి అధికారంలోకి వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ పట్టు సాధించేనా? కాంగ్రెస్‌లో స్ట్రాంగ్ లీడర్‌గా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(అలియాస్ జగ్గారెడ్డి) 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండ తన సొంత క్యాడర్‌తో దూసుకుపోయాడు. 2004లో ఆయన తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. ఆ తర్వాత 2009, 2018లో మాత్రం కాంగ్రెస్ తరఫున గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు వరకు కాంగ్రెస్ సంగారెడ్డి అడ్డాగా ఉండేది. కానీ 2014 ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారింది. అక్కడ గులాబీ జెండ ఎగరింది. దాంతో సంగారెడ్డిలో కాంగ్రెస్ వీక్ అయ్యి బీఆర్ఎస్ బలపడినట్లు అనిపించింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుపొందడంతో సంగారెడ్డిపై మళ్లీ హస్తం పట్టు సాధించింది. ఇక తాజా పరిణామాలు ప్రకారం.. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో రాబోయే సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలిక సంగారెడ్డిలో ఉత్కంఠత నెలకొంది. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : మహబూబ్ చెరువు, మంజీర డ్యామ్ రాజకీయానికి అంశాలు బీఆర్ఎస్లో అయోమయం కార్ ఓవర్ లోడ్ అధిక పోటీలో బిఆర్ఎస్ నాయకులు MLA జగ్గారెడ్డి బిఆర్ఎస్లోఇక వెళ్ళే సూచనలు ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: రియల్ వ్యాపారం హైదరాబాద్‌కి దగ్గర ఉన్నా నియోజక వర్గంలో మౌలిక వసతుల విషయంలో పెద్దగా అభివృద్ధి లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు బీఆర్ఎస్ చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే) కాంగ్రెస్ జగ్గారెడ్డి బిజేపి రాజేశ్వర్ రావు దేశ్ పాండే (బిజేపి నియోజక వర్గ ఇంచార్జ్) శివరాజ్ పాటిల్ నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : నదులు : మంజీర నది ఆలయాలు : వైకుంట పురం ఆలయం / ఇస్మాయిల్ ఖాన్ పేట భవానీ మాత ఆలయం -
ఈటలతో కేటీఆర్ ఆప్యాయ పలకరింపు.. అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మంత్రి కేటీఆర్ అప్యాయంగా పలకరించారు. ఈటల సీటు వద్దకు వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. నేతలు ఒకరినొకరు హత్తుకున్నారు. దాదాపు పది నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. అదే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డీతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. పలు అభివృద్ది పనుల కోసం కేటీఆర్ చాంబర్లో మంత్రికి సంగారెడ్డి ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. జగ్గారెడ్డిని చూడగానే పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లా అన్న అంటూ కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. అప్పటికే జగ్గారెడ్డితో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉండగా.. మీ ఇద్దరి దోస్తాన్ ఎక్కడ కుదిరిందని కేటీఆర్ అడిగారు. మాది ఒకే మంచం, ఒకే కంచం అంటూ మామిళ్ల బదులివ్వగా.. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తవా అని కేటీఆర్ ప్రశ్నించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తానని.. మన దగ్గరకు (బీఆర్ఎస్లోకి) పట్టుకొస్తానని మామిళ్ల రాజేందర్ నవ్వుతూ చెప్పారు. ఈ సంభాషణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. చదవండి: 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం -
సంగారెడ్డి నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?
సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్ నేత తూర్పు జయప్రకాస్ రెడ్డి మూడోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌పై 2589 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. జగ్గారెడ్డి 2004లో టిఆర్ఎస్ పక్షాన గెలిచి కాంగ్రెస్ ఐలో చేరారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి విప్ అయ్యారు. తదుపరి మెదక్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలో బిజెపి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ ఐ లోకి వచ్చి అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. జగ్గారెడ్డికి 76572 ఓట్లు రాగా, చింతా ప్రభాకర్‌కు 73983 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన రాజేశ్వరరావు దేశ్ పాండేకి 7600 పైగా ఓట్లు వచ్చాయి. రెడ్డి వర్గానికి చెందిన నేత జగ్గారెడ్డి. సంగారెడ్డిలో పదకుండు సార్లు రెడ్డి నేతలు గెలుపొందగా, రెండుసార్లు బిసి నేతలు విజయం సాధించారు. ఒకసారి ఎస్.సి, మరోసారి బ్రాహ్మణ నేత గెలు పొందారు. ఇక్కడ మొత్తం కాంగ్రెస్, కాంగ్రెస్‌లు కలిసి ఆరుసార్లు గెలిస్తే, టిడిపి ఒకసారి, రెండుసార్లు టిఆర్ఎస్ గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్లు గెలవడం విశేషం. సంగారెడ్డిలో అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన ఘనత పి.రామచంద్రారెడ్డికి దక్కింది. ఈయన 1989లో కొంతకాలం స్పీకర్‌గాను, మరికొంత కాలం నేదురుమల్లి క్యాబినెట్లో మంత్రిగాను పనిచేసారు. 2004లో ఈయన బిజెపి తరుపున లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కాంగ్రెస్ బలం, బలహీనతలను ఠాక్రేకు వివరించా: జగ్గారెడ్డి
-
కాంగ్రెస్‌పై కోమటిరెడ్డి కామెంట్స్.. జగ్గారెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్ తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పందిస్తూ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్తో పొత్తకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కాంగ్రెస్‌లో ముఖ్య నాయకుడు.. పార్టీలో కోవర్డులు ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్టార్లు, సూపర్ స్టార్లు ఇలా మాట్లాడుతుంటే ఎవరికీ ఏమీ చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్. బీజేపీకి మాపై ఆరోపణలు చేస్తే అర్హత లేదు. కేంద్రం తెచ్చిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్తోనే కాంగ్రెస్ పోరాటం అని స్పష్టం చేశారు. మరోవైపు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మల్లు రవి కూడా స్పందించారు. మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుందనడం హాస్యాస్పదం. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తాం. గతంలో కోమటిరెడ్డికి షోకాజ్‌నోటీసులు ఇస్తే చెత్తబుట్టలో వేశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు కాంగ్రెస్‌కు నష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌కు నష్టం చేసేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కేడర్‌ను గందరగోళంలో పడేశాయి. పార్టీని రక్షించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా తప్పుపట్టారు. అటు టీపీసీసీ రేవంత్ రెడ్డి వర్గం కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. -
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
తెలంగాణాలో కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి : జగ్గారెడ్డి
-
వీర్ సావర్కర్ పై రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో తప్పులేదు : జగ్గారెడ్డి
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులకు బాధ్యులు ఎవరు ??
-
జగ్గారెడ్డిని ఈడ్చుకెళ్తున్న పోలీసులు
-
కేసీఆర్ మాటన్నీ హాస్యాస్పదమే: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
-
అధిష్టానం ‘అలయ్ బలయ్’!
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధిష్టానం అల్లంత దూరమనే భావన తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు దూరమవుతోందా? తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దగ్గరవుతున్నారా? గత మూడు రోజులుగా ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణ నేతలు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రత్యేకంగా మకాం వేసి మరీ అధిష్టానం పెద్దలను కలుస్తుండడం, వీహెచ్, జగ్గారెడ్డి తదితర నాయకులకు ఢిల్లీ అగ్రనేతలు వరుసగా అపాయింట్మెంట్లు ఇస్తుండడం, త్వరలో రాష్ట్రానికి రానున్న రాహుల్‌గాంధీ పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరుస భేటీలు తెలంగాణలో పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను గతంలో ఎన్నడూ లేనివిధంగా 40 మంది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం కావడంతో భేటీల పరంపర మొదలయింది. అంతకుముందే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సమావేశమయ్యారు. రాహుల్‌తో సమావేశం ముగిసిన మరుసటి రోజే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డిలు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌ను జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. ఈలోపే రాహుల్‌గాంధీ కూడా జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కూడా కలిసేందుకు అంగీకరించారు. కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు జగ్గారెడ్డి.. తన భార్య, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమారుడు భరత్‌సాయిరెడ్డి, కుమార్తె జయారెడ్డిలతో కలిసి వెళ్లి రాహుల్‌ను కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇక మహేశ్‌కుమార్‌గౌడ్ తన కుమారుడు, లా విద్యార్థి ప్రణవ్గౌడ్ను వెంటబెట్టుకుని రాహుల్‌ను కలిశారు. ఇద్దరు నేతలు రాహుల్‌ను కలిసినప్పుడు కూడా రాజకీయ అంశాల కంటే పిల్లల చదువులు, కుటుంబ అంశాలపైనే రాహుల్ మాట్లాడినట్టు సమాచారం. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి కూడా రాహుల్‌తో భేటీ అయ్యారు. రాహుల్‌తో భేటీ తర్వాత జగ్గారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నియోజకవర్గ నేతలను కూడా ఢిల్లీకి తీసుకువచ్చి రాహుల్‌ను కలిసి ఫొటోలు దిగేలా ప్రయత్నం చేస్తానని చెప్పడం గమనార్హం. గతానికి భిన్నంగా.. కాంగ్రెస్ పెద్దలను ఢిల్లీ వెళ్లి కలవడం ఎంత కష్టమో.. రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా అంతే కష్టమనే భావన రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఉంది. రాహుల్ లేదా సోనియా లేదా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఎవరు వచ్చినా కీలక నాయకులు మినహా ఎవరికీ వారిని కలిసే అవకాశముండేది కాదు. పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు కూడా కాంగ్రెస్ పెద్దలను కలవడం ఓ టాస్క్లాగానే ఉండేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈనెలాఖరులో రాష్ట్రానికి రానున్న రాహుల్ రెండ్రోజులు ఇక్కడే ఉంటారని, ఒకరోజు బహిరంగ సభకు హాజరు కానుండగా, మరోరోజు రాష్ట్రానికి చెందిన అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నేతలందరినీ కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక సంస్థలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న నాయకులు, సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన వారితో కూడా రాహుల్‌తో కలిపించాలనే భావనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అందని ద్రాక్షలు కాదు..! ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అందని ద్రాక్షలేమీ కాదని, అందరితో కలివిడిగా ఉంటారనే భావనను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లాలనేది రేవంత్‌రెడ్డి యోచనగా కనిపిస్తోంది. ఆ భావన కలిగించడం ద్వారా జరగబోయే ఎన్నికల్లో మరింత క్రియాశీలంగా కేడర్ పనిచేస్తుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. -
ఉగాది వేడుకల్లో జగ్గారెడ్డి సందడి
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణంలోని రామ మందిరంలో శనివారం జరిగిన ఉగాది ఉత్సవాల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. ఉగాది సందర్భంగా ఈ మందిరంలో వినూత్న ఆచారం కొనసాగుతోంది. భక్తుల పైకి ప్యాలాల లడ్డూలు (ప్రసాదం) విసురుతూ వందలాది మంది భక్తులకు అందిస్తారు. 40 ఏళ్లుగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్యాలాల లడ్డూలు విసిరే కార్యక్రమం కొనసాగుతోంది. మొదట లడ్డూలకు పూజ చేసిన అనంతరం భజన చేస్తూ లడ్డూలను ఊరేగించారు. ఈ ఊరేగింపులో ఎమ్మెల్యే డోలక్ వాయిస్తూ పాటలు పాడుతూ భక్తులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆలయంపై నుంచి ఆయన భక్తులపైకి లడ్డూలు విసిరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ భద్రాచలంలో శ్రీరాముని కల్యాణం, తలంబ్రాలు అయ్యాక ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. -
జగ్గారెడ్డికి షాక్.. ఆ బాధ్యతల నుంచి తొలగింపు.. కారణం..?
-
ముగిసిన కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పలువురు భేటీ అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం సీనియర్‌నేత వీ. హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో జరిగిన పరిణామాలపై చర్చించామని, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై మాట్లాడినట్లు తెలిపారు. అధిష్టానం దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తామని అన్నారు. మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో సంస్థాగతమైన మార్పులు జరగాలని వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరారని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం రావాలని దానిపై చర్చించామని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న వారు.. పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని అన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు సమావేశంలో బయట జరుగుతున్న ఊహాగానాలు ఏమి లేవని, ఆదివారం సోనియా గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంపై చర్చించామని పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని చర్చించామని తెలిపారు. ఆ కుటుంబం అడుగుజాడల్లో కార్యకర్తలు నడుస్తారని అన్నారు. పార్టీతో కొన్ని ఏళ్లుగా అనుబంధంగా కొనసాగుతున్న నేతలుగా చర్చించుకున్నామని చెప్పారు. ఢిల్లీ సమావేశం పైనే చర్చించామని, వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్‌కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పని చేయాలనే దానిపై మాట్లాడినట్లు తెలిపారు. -
Sakshi Cartoon: ఆమె 2024 ఎన్నికల దాకా బిజీనట సార్!
ఆమె 2024 ఎన్నికల దాకా బిజీనట సార్! -
జగ్గారెడ్డితో భట్టిభేటీ..రాజీనామా అంశంపై చర్చ
-
Sakshi Cartoon: జగ్గారెడ్డి వ్యవహారం టీకప్పులో తుఫాన్
-
నా రాజీనామాకు కారణాలివే: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగిందని, చదువు కంటే రాజకీయలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అలాగే ప్రజలు తనకు ఇచ్చిన ఆశీర్వాదంతో రాజకీయాల్లో ఇక్కడివరకు వచ్చానని తెలిపారు. ప్రతిదీ తాను రాజకీయాలతో చూడనని, ప్రజలకు సేవ చేయడం అంటే ఇష్టమని పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తన స్వభావమని అన్నారు. ఆయన శనివారం మీడియతో మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీలో అయినా లొసుగులు, అంతర్గత కలహాలు ఉంటాయని పేర్కొన్నారు. తాను కరెక్టుగా ఉన్నా కాబట్టే.. నిజమైన ప్రశ్నలు అడుగుతున్నానని అన్నారు. ఒక వ్యక్తి వ్యవస్థకు నష్టం చేస్తుంటే.. నష్టం చేస్తున్నారని చెబుతానని తెలిపారు. ఎవరకీ భయపడేది, జంకేది లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాను ముక్కుసూటిగా మాట్లాడుతానని, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలనే లైన్ తీసుకున్నానని స్పష్టంచేశారు. వ్యక్తులు కాదు, వ్యవస్థలు ముఖ్యమని, తాను పార్టీలో ఉండి, ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని, తన తీరువల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చని తెలిపారు. ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే నిక్కచ్చిగా మాట్లాడినట్లు గుర్తుచేశారు. జగ్గారెడ్డి వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగ్గారెడ్డి పార్టీకి నష్టం చేస్తున్నారనే అపవాదు తనకు ఇష్టం లేదని అన్నారు. తాను పోవాలనుకుంటే ఏ పార్టీలోకైనా వెళ్లగలనని జగ్గారెడ్డి తెలిపారు. -
జగ్గారెడ్డి అలక టీ కప్పులో తుఫాన్: రేవంత్‌రెడ్డి
ములుగు జిల్లా: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారన్న విషయంపై తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మేడారం సమ్మక్క సారలమ్మను శనివారం దర్శించుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి విషయం టీ కప్పులో తుఫాన్ లాంటిదని అన్నారు. భేదాభిప్రాయాలే తప్ప విభేదాలు కావుని స్పష్టం చేశారు. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలో బేధాభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది భిన్నత్వంలో ఏకత్వమని, ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువని, అన్ని పరిస్థితులు సర్థుకుంటాయని పేర్కొన్నారు. పోలీసులపై మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, ఆవేశంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. -
నాపై కోవర్టు ముద్ర వేశారు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ పార్టీ వీడనున్నట్లు ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి శనివారం ఓ లేఖ రాశారు. త్వరలో పార్టీ పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మూడు పేజీల లేఖను విడుదల చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాసిన లేఖలోని అంశాలు.. ► ‘నేను పార్టీ వీడినా గాంధీ కుటుంబంపై గౌరవంతో ఉంటాను. కానీ, ఈ ప్రకటన విడుదల చేసిన నాటి నుంచి కాంగ్రెస్ గుంపులో ఉండను. ► త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ► కాంగ్రెస్‌లో సడన్‌గా వచ్చి లాబీయింగ్ చేసి ఎవరైనా పీసీసీ కావొచ్చు. ► సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా ముద్రవేస్తున్నారు. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ► గతంలో కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ఉన్నా హుందాగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదు. ► కాంగ్రెస్‌లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తా. పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలి. ► 2017లో ఎవ్వరు అధినేత రాహుల్ గాంధీ సభ పెట్టమంటే.. సభ పెట్టడానికి ముందుకు రాకుంటే నేను సభ నిర్వహించాను. ఆ సభ నుంచి పార్టీ రాష్ట్రంలో బలపడింది. పార్టీ కోసం కష్టపడినా నేనా కోవర్టుని.. సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతలు కోవర్టులా?. ► ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుండి ఎవ్వరు అభ్యర్థులు పేట్టకుంటే నేను మెదక్ జిల్లా నుంచి అభ్యర్థిని పెట్టి, రూ. కోట్లు ఖర్చు పెట్టి పార్టీకి ఒక్క ఓటు తగ్గకుండా పార్టీ పరువు నిలిపాను. ► పార్టీ సీనియర్లు ఎవ్వరు కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారు. ఎవరు కోవర్టులు.. అభ్యర్థిని పెట్టినవాళ్లా? లేక పెట్టని వాళ్లా?. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్లను మూడువేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్లు కోవర్టులా? నేనా?. ► గాంధీ కుటుంబంపై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది నేను. మరి పార్టీలో పదవులు అనుభవిస్తున్నవాళ్లు, స్పందించకుండా మౌనంగా ఉన్నవాళ్లు కోవర్టులా? లేక నేనా? అనేది అధిష్టానం గుర్తించాలి’ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. -
మాణిక్యం ఠాగూర్ ముఖం చాటేశారా.?
-
ఫస్ట్ రేవంత్ రెడ్డిని పిలవండి.. తర్వాత నేనొస్తా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి రాసిన లేఖపై మీడియా ముఖంగానే వివరణ ఇచ్చానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఆ లేఖ ఎలా లీక్ అయిందో తనకు తెలియదని.. ఇది మీడియాలో కూడా వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘిచినట్టు భావించి.. తర్వలోనే కమిటీ ముందుకు పిలుస్తామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లేఖపై ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, లేదా మీరు (చిన్నారెడ్డి) మీడియాలో వచ్చిన వార్తలను చూసి సుమోటోగా కంప్లైంట్ తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఈ విషయం ఎందుకు మీడియా ముందు చెప్పలేదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లి పెద్దపల్లి అభ్యర్థిని పార్టీలో చర్చించకుండా, పార్టీలైన్ దాటి డిక్లేర్ చేస్తే పీసీసీపై క్రమశిక్షణ కమిటీలోకి రాదా? అని నిలదీశారు. సొంత ఉమ్మడి జిలాల్లో ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు చెప్పకుండా కార్యక్రమం డిక్లేర్ చేసివస్తున్నానని ప్రకటిస్తే క్రమశిక్షణ కమిటలీ రాదా? అని ప్రశ్నించారు. వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి, తాను భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నట్లు వార్తలో చూశాను. దీనిపై తనకు సమాచారం ఇవ్వలేదు మరి అది క్రమశిక్షణ కమిటీకి రాదా? అని అన్నారు. క్రమశిక్షణ పాటించని పీసీసీని క్రమశిక్షణలో తీసుకోవాలని చిన్నారెడ్డికి తెలీదా? అని సూటిగా ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటీ ముందు ఫస్ట్ రేవంత్‌రెడ్డిని పిలిచి తర్వాత తనను పిలిస్తే..తప్పకుండా హాజరవుతానని అన్నారు. చిన్నారెడ్డి మీడియా ముందు వచ్చి మాట్లాడారు కాబట్టే.. తాను క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డికి మీడియా ద్వారా జవాబు ఇస్తున్నానని చెప్పారు. -
కాంగ్రెస్‌లో హుజూరాబాద్ చిచ్చు: ‘బల్మూర్ వెంకట్‌ని బలి పశువు చేశారు’
సాక్షి, హైదరాబాద్: ఉత్కంఠభరితంగా సాగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేశాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయే పరిస్థితికి దిగజారింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ సీనియర్లు. హుజూరాబాద్‌లో గెలుపు కోసం రేవంత్ శ్రమించలేదని మండిపడుతున్నారు. (చదవండి: దక్షిణ తెలంగాణకు మరణశాసనం: రేవంత్ ) ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్ ఎన్నికలను ఎవరూ పట్టించుకోలేదు. క్యాడర్ ఉన్నా ఓటు వేయించుకోలేకపోయాము. వాస్తవ పరిస్థితిని హైకమాండ్‌కు తెలియజేస్తాను’’ అన్నారు. (చదవండి: గాంధీభవన్‌లోకి గాడ్సేలు.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు) మరో సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌లో బల్మూర్ వెంకట్‌ని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క బలి పశువును చేశారు. డిపాజిట్ వస్తే రేవంత్ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారా. ఇలాంటి ప్రచారానికి రేవంత్ మనుషులు సిద్ధంగా ఉన్నారు’’ అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బహిరంగ సభలతో ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు. చదవండి: రేవంత్.. హుజూరాబాద్ ఎందుకు వెళ్లడం లేదు? -
కేసీఆర్ 2 రాష్ట్రాలను కలుపుతా అంటే నేను మద్దతు ఇస్తా: జగ్గారెడ్డి
-
కేసీఆర్ 2 రాష్ట్రాలను కలుపుతా అంటే నేను మద్దతు ఇస్తా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తాను మద్దతిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి చెప్పారు. మొదటి నుంచీ తాను సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నానని, తెలంగాణ ఉద్యమ సమయంలోనే తన స్టాండ్ చెబితే తెలంగాణ ద్రోహి అన్నారని, మరి ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడిన జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది కేసీఆరేనని, అందులో ఎలాంటి అనుమానం లేదన్న జగ్గారెడ్డి టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ అయోమయానికి దారితీసే విధంగా ఉన్నాయన్నారు. ఆయన మాటల వెనుక నిగూఢార్థం ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని మొదటి నుంచి కోరుకున్న పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ గోడ మీద పిల్లిలా ఎటు వీలుంటే అటు మాట్లాడుతుందని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భంలో అనివార్య పరిస్థితుల్లో అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వక తప్పలేదని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారని, ఆత్మబలిదానాలు చేసుకున్న వారు కోరుకున్నట్టు తెలంగాణ లేదని అన్నారు. సమైక్య రాష్ట్రమంటూ రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కొత్త డ్రామా మొదలు పెట్టాయని, కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనించాలని కోరారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, తన అభిప్రాయాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నారని ఆయన అభిప్రాయానికి, తన వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను గతంలో కూడా రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పలేదని, పార్టీకి, పార్టీ ఇన్చార్జికి మాత్రమే చెప్పానని, అలాంటి సందర్భం కూడా రాదని అన్నారు. -
డబ్బుల్లేక ప్రచారానికి వెళ్లలేదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి తాను ఎందుకు వెళ్లలేదన్న అంశంపై సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తనదైన శైలిలో బదులి చ్చారు. తాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కరీంనగర్ పార్లమెంటు ఇన్చార్జిగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరపున ప్రచారానికి వెళ్లలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. అందుకు కారణం తన దగ్గ ర డబ్బులు లేకపోవడమేనని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు చెరో రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, డబ్బులు లేకుండా తాను వెళ్లి అక్కడ ఏం చేయలేను కనుకనే ప్రచారానికి వెళ్లలేకపోయానని జగ్గారెడ్డి తెలిపారు. -
సత్తా చాటాల్సిందే
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలో మంచి ఫలితం సాధించే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటోంది. మొదటి నుంచీ పట్టున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కేడర్‌ను కాపాడుకోవడం ద్వారా వీలైనన్ని ఎక్కువ ఓట్లు రాబట్టవచ్చని, టీఆర్ఎస్–బీజేపీల బంధాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓట్ల శాతాన్ని పెంచుకోవచ్చనే వ్యూహంతో ముందుకెళుతోంది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 30 శాతానికి తగ్గకుండా ఓట్లు వచ్చిన పరిస్థితుల్లో ఈసారి కూడా ఆ ఓట్లను నిలబెట్టుకోవాలని, టీఆర్ఎస్–బీజేపీల మధ్య ఓట్ల చీలికను ఆసరాగా చేసుకొని గెలుపు తీరం చేరుకోవాలని ఆశిస్తోంది. మూడంచెల వ్యూహం... ఉపఎన్నికను మూడంచెల వ్యూహంతో ఎదు ర్కోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణలో మండలాలు, గ్రామాలవారీగా పని విభజన చేసుకొని ముందుకెళ్లేలా వ్యూహం రూపొందించారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణను స్వయంగా చేపడుతూ మండలాలవారీగా ఇన్చార్జీలను, చీఫ్ కో–ఆర్డినేటర్లను నియమించారు. ఇందులో కమలాపూర్‌కు ఎమ్మెల్యే సీతక్క, జమ్మికుంటకు శ్రీధర్‌బాబు, హుజూరాబాద్ పట్టణ, మండలానికి జగ్గారెడ్డి, ఇల్లంతుకుంట మండలానికి వేం నరేందర్‌రెడ్డి, వీణవంక మండలానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలను నియమించారు. వారికి అనుబంధంగా మరో ఐదారుగురు నేతలను మండలాలవారీగా నియమించారు. వారి సమన్వయంతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో పని విభజన చేయనున్నారు. ప్రతి గ్రామానికి టీపీసీసీ స్థాయి నాయకుడిని ఇన్చార్జిగా నియమించాలని, నియోజకవర్గవ్యాప్తంగా పూర్తిస్థాయిలో పార్టీ అనుబంధ సంఘాలను రంగంలోకి దింపాలని ఆయన ఇప్పటికే ఆదేశించారు. గాంధీభవన్‌లో కీలక నేతల భేటీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు శనివారం గాంధీ భవన్లో సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, అజ్మతుల్లా హుస్సేన్‌లు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా రానున్న 20 రోజులపాటు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. స్టార్ క్యాంపెయినర్లు వీరే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ పక్షాన ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి. వేణుగోపాల్ ఈ పేర్లతో కూడిన లేఖను ఎన్ని కల సంఘానికి పంపినట్టు టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. మొత్తం 20 మందితో కూడిన ఈ జాబితాలో మాణిక్యం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, భట్టి, శ్రీనివాస కృష్ణన్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్, పొన్నాల, అజహరుద్దీన్, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ, నాయిని రాజేందర్‌రెడ్డి ఉన్నారు. -
గుర్రపు బండిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్‌బంద్‌లో భాగంగా సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాంధీభవన్ నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండి ఎక్కి వచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క ఇందులో పాల్గొన్నారు. అయితే అసెంబ్లీ ముందుకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. గుర్రపుబండిలో అసెంబ్లీలోనికి వెళ్లేందుకు వీల్లేదనడంతో కాంగ్రెస్ నేతలు వాగ్వివాదానికి దిగారు. అసెంబ్లీ సమావేశాలకు ఎలా హాజరు కావాలన్నది తమ ఇష్టమని, తమను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో భట్టి సహా నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కారణంగా సోమవారం జరిగిన అసెంబ్లీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొనలేకపోయారు. స్పీకర్, చైర్మన్ సమాధానం చెప్పాలి: భట్టి పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీకి ఎలా వెళ్లాలనేది సభ్యుల ఇష్టమని, తాము అసెంబ్లీకి హాజరు కాకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని భట్టి అన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా వెళ్లినా తమను అరెస్టు చేసిన విధానంపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కుల తీర్మానం ఇస్తాం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ ఆమోదిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్న దానిపై వివరణ ఇవ్వాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సభకు హాజరుకానివ్వకుండా తమ హక్కులను కాలరాసినందుకు అసెంబ్లీలో, మండలిలో హక్కుల తీర్మానం పెడతామని చెప్పారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎలా రావాలన్న దానిపై నిబంధనలు ఏమైనా ఉన్నాయేమో స్పీకర్, చైర్మన్లు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని జగ్గారెడ్డి విమర్శించారు. సీతక్క మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే, ప్రజలతో కలిసి పోరాడాల్సిన కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు. -
ఇది పార్టీనా.... ప్రైవేట్ కంపెనీనా?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సీఎల్పీ భేటీలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలపై జరిగిన చర్చలో జగ్గారెడ్డి చాలా ఆవేశంగా మాట్లాడారు. ఇది కాంగ్రెస్ పార్టీనా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా?.. అని ప్రశ్నించారు. పార్టీలో చర్చించకుండానే గజ్వేల్ సభలో నిరుద్యోగ సమస్యపై రెండు నెలల కార్యాచరణను రేవంత్ ఎలా ప్రకటిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తనకు కూడా సమాచారం లేకుండా సంగారెడ్డి జిల్లాకు టీపీసీసీ అధ్యక్షుడు వెళ్లారని, జహీరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లి గీతారెడ్డికి సమాచారం ఇవ్వలేదన్నారు. పార్టీలో ప్రొటోకాల్ పాటించడం లేదని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనకు కూడా సమాచారం ఇవ్వలేదంటే రేవంత్‌తో తనకు వివాదాలున్నాయని చెప్పాలనుకుంటున్నాడా అని ప్రశ్నించారు. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు కాకముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యేను అయ్యానని అన్న జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌లో ఏ ఒక్కరూ హీరో కాలేరన్న విషయాన్ని గమనించాలని చెప్పారు. అవమానపరుస్తున్నారు... అనంతరం మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. పార్టీకి విధేయుడిగా ఉంటూ పనిచేస్తుంటే అవమానాలపాలు చేస్తున్నారని, ఏదైనా మాట్లాడితే టీఆర్ఎస్ మనుషులని ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను టీఆర్ఎస్లోకి వెళ్లాలనుకుంటే ఉన్న అడ్డు ఎవరో చెప్పాలన్న జగ్గారెడ్డి.. గజ్వేల్ సభలో కనీసం తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. తనకూ రాష్ట్రంలో అభిమానులున్నారని, 2 లక్షల మందితో సభ పెట్టగలనని చెప్పారు. పార్టీలో మాట్లాడే అవకాశం లేదు కాబట్టే మీడియాతో మాట్లాడాల్సి వస్తోందని జగ్గారెడ్డి వెల్లడించారు. ధీటుగా స్పందించాలని పిలుపు.. అంతటితో ఆగని జగ్గారెడ్డి శుక్రవారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో రేవంత్ అభిమానులు అసభ్య పదాలు వాడితే తన అభిమానులు కూడా దీటుగా స్పందించాలని ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి అభిమానులు ఎలాంటి కౌంటర్ ఇస్తే అలాంటి కౌంటర్ ఇవ్వాలని, తనను తిట్టిన వారి చిరునామాలు సేకరించాలని సూచించారు. తన పిలుపును ఈజీగా తీసుకోవద్దని జగ్గారెడ్డి పేర్కొనడాన్ని చూస్తే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో అమీతుమీ తేల్చుకునేందుకే ఆయన సిద్ధపడ్డారని అర్థమవుతోందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. -
Jagga Reddy: కాంగ్రెస్‌లో సింగిల్ హీరో కుదరదు..
హైదరాబాద్: కాంగ్రెస్‌లో సింగిల్ హీరో కుదరదు.. ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది పార్టీనా లేదా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో చర్చించకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేయడమేంటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో అందరూ ఒకటే.. ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డికి పీసీసీ వస్తే .. నాకు సమాచారం ఇవ్వరా.. ఈ మాత్రం ప్రోటోకాల్ కూడా తెల్వదా అని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డికి , రేవంత్ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు రేవంత్ పరోక్షంగా చెబుతున్నారా.. అని విమర్షించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందు.. తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాగా, సీఎల్పీ కార్యాలయంలో మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ సభాపక్షం సమావేశంకానున్న నేపథ్యంలో ప్రస్తుత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఏల్పీ నేత భట్టి విక్రమార్క ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఇప్పటికే సీఎప్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మీడియా పాయింట్ వద్ద.. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు.. పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా నాపై అసత్యప్రచారాలు చేస్తారా.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేను.. తనకు మాట్లాడటానికి అవకాశం ఎందుకు ఇవ్వలేదని గీతారెడ్డిని ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడి మేరకు ఇలా ప్రవర్తించారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ మారాలంటే నాకు అడ్డు చెప్పేవారు ఎవరని అన్నారు. కాగా, ఎథిక్స్‌కి కట్టుబడి.. తాను కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు సరైన గౌరవంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గ్రామస్థాయిలో వెళ్లి పనిచేయాలని అన్నారు. ఈ రాష్ట్రంలో నాకు అభిమానులున్నారు. కావాలంటే పార్టీ సపోర్ట్ లేకుండా 2 లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. తప్పని పరిస్థితిలో మీడియా ముందు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. చదవండి: రెండోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ -
దో షేర్.. దో బకరే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ క్రీడలో రెండు సింహాలు, రెండు మేకలున్నాయని.. ఇందులో కేసీఆర్, అమిత్‌షాలు సింహా లైతే, బండి సంజయ్, ఈటల రాజేందర్లు మేకలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, అమిత్ షా ఆడుతున్న ఆటలో వారిద్దరూ బలికావడం ఖాయమని హెచ్చరించారు. మంగళవారం గాందీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర కమిటీకి ఎలాంటి అధికారం లేదని, పవర్ అంతా ఢిల్లీలోనే ఉందని ఎద్దేవా చేశారు. గల్లీలో బండి సంజయ్ కేసీఆర్‌ను తిడతారని, ఢిల్లీలో మోదీ, అమిత్‌షాలు అదే కేసీఆర్‌తో మంతనాలు జరుపుతారని అన్నారు. అధికారాన్ని కాపాడుకోవడం కోసమే కేసీఆర్ బీజేపీతో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్, బీజేపీ అధిష్టానం ఆడే క్రీడలో రాష్ట్ర బీజేపీ నేతలు డమ్మీలవుతారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వర్షాల వల్ల నష్టపోయిన వారందరికీ రూ.10వేల చొప్పున సాయం చేయాలని కోరారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే రాజకీయాలా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరదల కారణంగా ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌లు రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.జీ. వినోద్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాం«దీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..గతేడాది హైదరాబాద్‌లో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ఈ ఏడాది ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. -
జోష్ ఇంకా పెరగాలి
సాక్షి, హైదరాబాద్: ‘పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత గత రెండు నెలల కాలంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహంతో కూడిన కదలిక కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఆ పార్టీ నేతల అవినీతిపై క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గ్రాఫ్ నానాటికీ పడిపోతోంది. ఇంకోవైపు బీజేపీలో వర్గపోరు తీవ్రమైంది. పాదయాత్రల కోసం ఆ పార్టీ నేతలు పోటీలు పడుతున్నారు. ఈ విధంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితు ల్లో ఈ ఊపు, ఉత్సాహం మరింత పెరగాలి’అని టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అభి ప్రాయపడింది. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూ ర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మ య్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్లు దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్లతో పాటు ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. 17లోపు హుజూరాబాద్ అభ్యర్థి ప్రకటన మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ సమావేశానికి హాజరైన కీలక నేతలందరూ హుజూరాబాద్ అభ్య ర్థిగా ఒక్క పేరునే సూచిస్తే ఆ పేరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఓకే చేయిస్తానని చెప్పారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని, పరిశీలించిన దరఖాస్తులను అధిష్టానానికి పంపి వచ్చేనెల 17లోపు అభ్యర్థిని ప్రకటించాలని తీర్మానించారు. మరో రెండుచోట్ల దండోరా సభలు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు మం చి స్పందన వచ్చిందని, క్షేత్రస్థాయి కార్యక్రమాల వల్ల దళితులు, గిరిజనుల్లో అవగాహన పెంచగలిగామని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 17లోగా మరో రెండుచోట్ల సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో గజ్వేల్ లేదా మెదక్ పార్లమెంటు స్థానం పరిధిలోనికి వచ్చే మరోచోట సభ నిర్వహించాలని తీర్మానించారు. 17న నిర్వహించే ముగింపుసభకు రాహుల్ రాకపోతే ఏఐసీసీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు. దళితబంధుతో వ్యతిరేకత దళితబంధు వల్ల దళితుల్లోనూ, ఇతర సామాజికవర్గాల్లోనూ టీఆర్ఎస్పై వ్యతిరేకత వస్తోందని సీనియర్ నేతలు చెప్పారు. ఈ నేపథ్యం లో దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్ని వర్గాలకు దాన్ని వర్తింప చేయాలంటూ ప్రభు త్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలే తమ పని అయిపోయినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారని చెప్పినట్టు సమాచారం. పార్లమెంటు స్థానాల వారీ సమీక్షా సమావేశాలు డిసెంబర్ 31 కల్లా పూర్తి చేస్తానని మాణిక్యం ఠాగూర్ చెప్పారు. అప్పటికి మండల స్థాయి, బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయించి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ల సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళతానని రేవంత్ అన్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి గైర్హాజరయ్యారు. కాగా టీపీసీసీ అధ్యక్షులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జెట్టి కుసుమకుమార్‌లు పార్టీకి చేసిన సేవలను అభినందిస్తూ సమావేశం తీర్మానించింది. ‘ఆ లోటు కనిపించింది’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో సీనియర్ నాయకులు కొందరు లేని లోటు కనిపించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డి, వీహెచ్ లాంటి సీనియర్లు లేని లోటు స్పష్టంగా ఉందని మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ అన్నా రు. గతంలో వైఎస్సార్ సీఎం హోదాలో ఉన్న ప్పుడు కూడా కాకా, వీహెచ్‌లాంటి నేతలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేశారని, సభలు సక్సెస్ చేయడం ఎంత ముఖ్యమో సీనియర్ నేతలను గాంధీభవన్‌కు రప్పించుకోవడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని పీసీసీ గ్రహించాలని జగ్గారెడ్డి అన్నారు. -
అసంతృప్తి ‘దండోరా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి దండోరా’ మోగింది. టీపీసీసీ కార్యవర్గ సమావేశం వేదికగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై పలువురు సీనియర్లు గళమెత్తినట్టు సమాచారం. గురువారం గాంధీభవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశానికి మాణిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్లు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి టీం తీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల నిర్వహణ ఏకపక్షంగా జరుగుతోం దని, తమను భాగస్వాములను చేయడం లేదని ఫిర్యాదు చేశారు. పార్టీలో వ్యక్తిగత ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని, ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఇకపై అందరితో చర్చించిన తర్వాతే ఈ సభల నిర్వహణ ప్రకటించాలని, సభల నిర్వహణలోనూ అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న గజ్వేల్‌లో జరగాల్సిన సభను వాయిదా వేయడం గమనార్హం. కాగా అదే రోజున మేడ్చల్‌లో 48 గంటల దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కోవర్టులెవరు? ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పార్టీలో కోవర్టు రాజకీయాలు చేయవద్దని, అలాంటి వారు పార్టీ వదిలి వెళ్లిపోతే మంచిదని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కూడా కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఇంటి దొంగలున్నారనే రీతిలో రేవంత్ చేసిన కామెంట్లు ఎలాంటి సంకేతాలిచ్చాయో అర్థం చేసుకోవాలని ఒకరిద్దరు సీనియర్లు అన్నట్టు తెలిసింది. నిజంగా అలాంటి వారు పార్టీలో ఉంటే గుర్తించి చర్యలు తీసుకోవాలని, కోవర్టులున్నారని బహిరంగంగా వ్యాఖ్యానించడం మంచిది కాదని వారు పేర్కొన్నారు. అందరితో చర్చించే నిర్ణయాలు సీనియర్లు లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ రేవంత్ టీం కూడా సమావేశంలో ధీటుగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. రేవంత్‌కు మొదటి నుంచీ తోడుగా ఉన్న సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ఇతర సీనియర్లు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గతంలో పార్టీ పరిస్థితికి, రేవంత్ వచ్చిన తర్వాత పరిస్థితిని బేరీజు వేసుకుని మాట్లాడాలన్నారు. అందరితో చర్చించే నిర్ణయాలు తీసుకుంటున్నామని, కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఇంకెన్నాళ్లు కుమ్ములాడుకుందామని ప్రశ్నించారు. మనం పోరాటం చేయాల్సింది టీఆర్ఎస్ పార్టీపై అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, చిన్న చిన్న సమస్యలుంటే మాట్లాడుకోవచ్చని అన్నారు. అధిష్టానానికి అన్నీ తెలుసు: మాణిక్యం సీనియర్ల అభిప్రాయాలపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ టీపీసీసీలో ఏం జరుగుతోందో, పార్టీ నేతలు ఎవరేం చేస్తున్నారో అధిష్టానానికి అంతా తెలుసునని అన్నట్టు సమాచారం. ‘ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఏం లీకులిస్తున్నారో ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి. క్రమశిక్షణ రాహిత్యం సహించే పరిస్థితుల్లో పార్టీ లేదు. అందరూ కలసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలి..’అని సూచించినట్లు తెలిసింది. పీఏసీ భేటీలకు సీనియర్లను పిలవండి: జగ్గారెడ్డి ప్రతి వారం జరిగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాలకు సీనియర్లను ఆహ్వానించాలని కోరుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశమయ్యింది. ఈ లేఖలో ఆయన ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్లు జానారెడ్డి, వీహెచ్, పొన్నాల లాంటి వారి పేర్లను ప్రస్తావించారు. పీఏసీ సమావేశాలకు వారిని కూడా పిలవాలని కోరారు. మొత్తం మీద రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆయన గైర్హాజరీలో జరిగిన సమావేశంలో పార్టీలో అసంతృప్తి బహిర్గతం కావడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. 24న మేడ్చల్‌లో 48 గంటల దీక్ష రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు అమలు చేయాలని, గిరిజనులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న మేడ్చల్‌లో 48 గంటల దీక్ష చేయనున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు సంఘీభావంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దండోరా ముగింపు సభకు రాహుల్‌గాంధీ వస్తారని తెలిపారు. బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ప్రతి శనివారం జరిగే ముఖ్య నేతల సమావేశం యథాతథంగా కొనసాగుతుందన్నారు. -
Jagga Reddy: అనుమతిస్తే సీఎంకు సన్మానం చేస్తా
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ అనుమతిస్తే ఆయనకు భారీ సన్మానం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానిం చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దాదాపు నాలుగేళ్లుగా సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం చేసిన ఉద్యమ ఫలితంగానే నేడు నా నియోజకవర్గ ప్రజల కల సాకారం అయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు. సంగారెడ్డి కాలేజీకి మీరే వచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయండి. రూ.వెయ్యి కోట్లు కేటాయించండి. మీరు శంకుస్థాపనకు వచ్చిన రోజు మీ అనుమతితో భారీ సన్మానం చేస్తా. ఇది నా వ్యక్తిగతం. పార్టీతో సంబంధం లేదు’ అని అన్నారు. ఎమ్మెల్యేగా తనకు, సీఎంగా కేసీఆర్‌కు ఇప్పుడు మంచి పేరు వస్తుందని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. 2018లో గెలిచిన తర్వాత ఎప్పుడు అసెంబ్లీకి వచ్చినా సంగారెడ్డి మెడికల్ కాలేజీ కోసం అడిగానని, అసెంబ్లీలో సీఎం మాట ఇచ్చారని, తన కుమార్తె జయారెడ్డితో కలిసి ట్యాంక్‌బండ్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశానని ఆయన గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సంగారెడ్డికి ఐఐటీ వచ్చిందన్నారు. చదవండి: దమ్ముంటే రాజీనామా చెయ్యి : మంత్రి గంగుల -
వ్యాక్సిన్ కోసం మోదీ ముందు ధర్నా చేయండి: పొన్నం
సాక్షి, హైదరాబాద్: పక్క రాష్ట్రాల్లో అల్లర్లు జరుగుతున్నాయంటూ దీక్షలు చేయడంకాదని, తెలంగాణలోని ఆరోగ్య పరిస్థితులపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర బీజేపీ నేతలకు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఘర్షణలు జరిగాయని ఇక్కడ దీక్షలు చేస్తున్న బీజేపీ నేతలు కరోనా వ్యాక్సిన్ లేదని, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు లేవని మోదీ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే ఆందోళనలు చేయడం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమేనని, నిజంగా బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణకు దౌర్భాగ్యస్థితి పట్టింది: భట్టి సాక్షి, హైదరాబాద్: కరోనాతో రాష్ట్రం అతలాకుతమవుతున్న వేళ చిల్లర రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కారణంగా తెలంగాణకు దౌర్భా గ్యస్థితి పట్టిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్ర మార్క విమర్శించారు. ఇలాంటి సీఎం నాడు ప్రధా ని అయి ఉంటే పోలియో దెబ్బకు దేశంలోని సగంమంది అంగవైకల్యంతో బాధపడాల్సి వచ్చేదని ఎద్దేవా చేశారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. బుధవారం సీఎల్పీ కార్యాలయం నుంచి ఆయన జూమ్‌యాప్ ద్వారా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, పొడెం వీరయ్య హాజరై కరోనా పరిస్థితులపై చర్చించారు. అనంతరం జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా మొదటిదశ సమయంలోనే ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజులు నిర్ధారించాలని కోరామన్నారు.అప్పుడు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు జనాన్ని జలగల్లా పీల్చుకుతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ఇప్పు డు ఇంజక్షన్లుంటే ఆక్సిజన్ ఉండదు.. ఆక్సిజన్ ఉంటే బెడ్లు ఉండవు.. వెంటిలేటర్లుంటే టెక్నీషియ న్లు లేరు.. వ్యాక్సిన్లు లేవు.. ఆరోగ్య శాఖకు మంత్రి కూడా లేరు.. అని అన్నారు. కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఏమైందని భట్టి ప్రశ్నించారు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వాలి: జగ్గారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు అధికారులు చెబుతున్నారో లేదోననే అనుమానం తమకుందని, అందుకే నేరుగా ఆయనతోనే మాట్లాడేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి కోరారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజలు ఆక్సిజన్ లేక చనిపోతున్నారని, సీటీ స్కాన్ యంత్రాలు పనిచేయడం లేదని, ఉన్నా అవి పనిచేయడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని కోరారు. ప్రస్తుత తరుణంలో రాజకీయ విమర్శలు ముఖ్యం కాదని, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమో...భూముల పంచాయితీలు ముఖ్యమో తేల్చుకోవాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
కూతురుతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఆయన తన కూతురు జయారెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ, నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరి కొద్దిసేపట్లో అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: అసెంబ్లీ గేట్‌ని ఢీకొట్టిన వాణి దేవి కారు -
సిక్స్ కొట్టినంత ఈజీ కాదు.. సచిన్‌కు జగ్గారెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ‘క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సినీ తారలు కంగనా, అజయ్ దేవగన్, అక్షయ్‌కుమార్ లాంటి వారు ఒక్కసారి నాగలి పట్టి, భూమి దున్ని, ఇత్తులేసి, నీరు పోసి, పంట పండించగలరా? నాగలి పట్టి, పొలం దున్ని, పంట పండించడం అంటే క్రికెట్ ఆడినంత ఈజీ కాదు.. సినిమాల్లో డైలాగ్ చెప్పి డాన్స్ చేసినంత సులువు కాదు. రైతుల గురించి, వారు చేస్తున్న ఉద్యమాల గురించి అవమానకరంగా మాట్లాడడం మానుకోవాలి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి హితవు పలికారు. రైతులు పండించిన పంట తింటూ వారి పోరాటాన్నే వ్యతిరేకిస్తూ కొందరు సినీ తారలు, క్రికెట్ ప్లేయర్లు మూర్ఖంగా మాట్లాడటం బాధాకరమని శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘సినీ పరిశ్రమలో, క్రికెట్ ఆటలో విరామం ఉంటుంది. వారు ఆడుతున్నా, నటిస్తున్నా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. కానీ రైతులు నాగలి పట్టి భూమి దున్నేటప్పుడు అలాంటిదేమీ ఉండదు. రైతులకు పరాయి దేశస్తులు మద్దతిస్తే దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన సెలబ్రిటీలు విమర్శలు చేయడం సిగ్గుచేటు’అని దుయ్యబట్టారు. -
రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా..
సాక్షి, హైదరాబాద్ : రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా మార్చుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గత పది నెలలుగా తెలంగాణలో రిజిస్ట్రేషన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఆస్తులను కాపాడేందుకు ధరణి తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.. అయితే గతంలో బ్రిటిష్, నిజాం కాలం నుంచి ఆస్తులకు భద్రత లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. . ఆస్తుల వివరాలు మీకెందుకు అని అధికారులను జనం నిలదీశారని, సీఎం తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, అధికారులు పిచ్చి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. అధికారుల మాటలు విని సీఎం చెడ్డ పేరు తెచ్చకోవద్దని, ఎల్ఆర్ఎస్పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. (‘సొంతిల్లు స్వంతమవుతుందని అనుకోలేదు’) కరోనా కాలంలో ట్రీట్మెంట్కు ఆస్తులను కుదవ పెట్టుకుందామన్నా, ఆఖరికి పెళ్లిలకు కూడా డబ్బు అవసరమైతే.. ఆస్తులు అక్కరకు రాకుండా పోతున్నాయని ధ్వజమెత్తారు. ధరణి లోని ఆస్తులను చూపించి.. అప్పులు తెస్తారేమోనని అనుమానం కలుగుతోందని జగ్గారెడ్డి అన్నారు. పాత పద్ధతి లో రిజిస్ట్రేషన్ ఉంటదని చెప్పి జీవోలో వంద కండీషన్లు పెట్టారు..ప్రభుత్వ తీరుతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిందని ఆరోపించారు. తక్షణమే రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎల్.ఆర్.ఎస్ విషయంలో కూడా ప్రజల బాధలను అర్థం చేసుకోవాలని, లేదంటే ప్రజల ఉసురు తగిలి ప్రభుత్వం కుప్పకూలుతుందని మండిపడ్డారు. (సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట) -
కాంగ్రెస్ బలహీన పార్టీ కాదు : జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బలహీనం కాలేదని, సంస్థాగతంగా ఇంకా బలంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడి కోసం మొదటిసారి ఇలా అభిప్రాయ సేకరణ జరగడం దురదృష్టకరమన్నారు. గతంలో ఇలా ఎన్నడూ జరగలేదని తెలిపారు. ఈసారి పీసీసీ అధ్యక్షుడి కోసం చాలా కాంపిటీషన్ ఉందని, రేసులో తనతో పాటు మరికొంతమంది ఉన్నట్లు తెలిపారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ విషయంపై నేడు సాయంత్రం 4 గంటలకు పార్టీ ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్ హైదరాబాద్ రానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కోర్ కమిటీ సమావేశంలో అన్ని వర్గాల వారి అభిప్రాయ సేకరణ తీసుకొని పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారు. అనేకమంది అశావహులు ఉన్న నేపథ్యంలో పీసీసీ ఎవరికి వరిస్తుందనే ఆసక్తి నెలకొంది. -
‘ఈ ఎన్నికలో ఓడిస్తే సీఎం వందమెట్లు దిగివస్తారు’
సాక్షి, దుబ్బాక(సిద్దిపేట): ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బు, పోలీసులను విచ్చలవిడిగా వాడుతుందని, కలెక్టర్ కూడా వారికే సపోర్టు కాబట్టి గెలిచినట్లుగా భావిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరమే అయినప్పటికీ దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే అది రాష్ట్ర ప్రజలకు శాపమన్నారు. మూడు పార్టీల అభ్యర్థులు బలంగానే ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు మాత్రం డబ్బు, పోలీసుల బలం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌కు పెద్దకొడుకులా పనిచేస్తున్నారని, అందువల్లే ఎన్నిక జరగక ముందే గెలిచినట్లుగా హరీశ్ రావు భావించి మెజారిటీ గురించి మాట్లాడుతున్నారన్నారు. లక్ష రూపాయల రూణమాఫీ, 57 ఏళ్లకే పెన్షన్, 12 శాతం రిజర్వేషన్లు, ఎస్సీలకు 12 రిజర్వేషన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయినా మళ్లీ ఎలక్షన్లో గెలిచినందుకు సీఎం కేసీఆర్ గల్లా ఏగిరేస్తున్నాడన్నారు. అంటే భవిష్యత్తులో కూడా ఇవేమీ ఇవ్వకపోయిన గెలుస్తామనే థీమా వాల్లకు వస్తే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. పంటలు మొత్తం మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. యూనివర్శిటీ పిల్లలంతా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా దుబ్బాకలో పని చేయాలని పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తే సీఎం వంద మెట్లు దిగివస్తారని, కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే రాష్ట్ర ప్రజలకు లాభమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
మంత్రి కేటీఆర్‌కు జగ్గారెడ్డి కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరంటున్నారని, వారి వద్ద ఉన్న వాళ్లందరూ తమ వాళ్లేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి తమ దుకాణం ఖాళీ చేసి, వాళ్లది నింపుకున్నారని, తమ గవర్నమెంట్ వస్తే.. టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పారు. మంత్రి తలసాని వ్యాఖ్యలతో ప్రభుత్వం అభాసుపాలవుతోందని, లక్ష ఇళ్లని చెప్పి.. ఆఖరుకు 20 వేలకు మించి చూపలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ వేదికగా ఎల్ఆర్ఎస్కు సంబంధించి ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ముందు పెట్టాం. 131 జీవోను రద్దు చేసి, ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలని కోరాం. రెగ్యులరైజ్‌కు సమయం రెండు నెలలు కాకుండా.. ఏడాది కాలం ఇవ్వాలని కోరాం. డబ్బులు 50 శాతం తగ్గించాలని కోరినప్పుడు కేటీఆర్ వెంటనే స్పందించారు. మంత్రి కేటీఆర్‌కు మీడియా ముఖంగా కృతజ్ఞతలు చెబుతున్నా. డబ్బులు తగ్గించడంతో పాటు 6 నెలల సమయం ఉంటుందన్నారు. లక్ష రూపాయలు కట్టే ప్లాట్‌పై 40 వేల రూపాయలకు కుదిస్తే.. సంతోషంగా చెల్లిస్తారు. రెవెన్యూ చట్టంలో మార్పులు చేర్పులకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. తక్షణమే రిజిస్ట్రేషన్లు జరిగేలా జీవో ఇవ్వాలి. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల ప్రభుత్వానికి కూడా నష్టమే’’అని అన్నారు. -
ఆ సీనియర్లపై చర్యలు తీసుకోవాల్సిందే: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీకి లేఖ రాయటంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి భగ్గుమన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భిక్షతో రాజకీయంగా ఎదిగిన నేతలే విమర్శించడమా అని మండిపడ్డారు. పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. సోమవారం ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. ‘‘ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక బలం, భరోసా. వారి నాయకత్వమే కాంగ్రెస్ పార్టీకి బలం. గాంధీ కుటుంబం కాకుండా ఎవరు అధ్యక్షులు అయినా కష్టమే. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి, సీనియర్లుగా ఉండి, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా గాంధీ యేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని లేఖ రాయడం ఏంటి?. వారు ప్రజా నాయకులు కాకపోయినా పార్టీ పదవులు ఇచ్చింది. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోయినా పార్టీ కోసం అహార్నిశలు కృషి చేస్తున్నారు. 73 ఏళ్ల వయసులో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుతూ దేశ కోసం కష్టపడుతున్నారు. నెహ్రు మొదటి ప్రధానిగా ఈ దేశానికి ఎన్నో పారిశ్రామిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన నేత. అలాగే నెహ్రు వ్యవసాయ అభివృద్ధి కోసం భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. ( రాజీనామాకు సిద్ధపడ్డ గులాం నబీ ఆజాద్) అందుకే భారత దేశం వ్యవసాయ పరంగా అభివృద్ధిలో ఉంది. ఆయన విద్యా రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇందిరా గాంధీ బ్యాంక్‌లను జాతీయం చేసి పేద వాడికి అందుబాటులో ఉంచింది. రాజీవ్ గాంధీ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి దేశాన్ని ప్రగతి పదంలో నడిపించారు. దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారు. ఇది గాంధీ కుటుంబ చరిత్ర. ఈ చరిత్ర దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇలాంటి పార్టీ రాజకీయ భిక్షతో జాతీయ స్థాయిలో ఎదిగిన నేతలు గాంధీ కుటుంబాన్ని విమర్శించడమా?’’ అని ప్రశ్నించారు. -
జగ్గారెడ్డిపై ఎచ్ఆర్సీలో ఫిర్యాదు..
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మంత్రి హరీష్ రావుపై అసభ్యపదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మంగళవారం ఖండించింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రైవేటు ఉద్యోగ సంఘం నేతలు మండిపడ్డారు. అదేవిధంగా జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశామని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం తెలిపింది. చదవండి: ‘సభ్యసమాజం సిగ్గుపడేలా జగ్గారెడ్డి మాట్లాడారు’ ఈ సందర్భంగా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న జగ్గారెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి హరీష్‌రావుపై అనుచిత వాఖ్యలు చేశారని మండిపడ్డారు. జగ్గారెడ్డి తక్షణం హరీష్ రావుకి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై అనుచితన వాఖ్యలు చేస్తే ఉరుకోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. జగ్గారెడ్డి భాష మార్చుకోకపోతే ఆయన ఇంటిముందు ధర్నా చేస్తామనాని గంధం రాములు పేర్కొన్నారు. చదవండి: కేటీఆర్‌కు భజన చేసుకో.. చెంచాగిరి కాదు..! -
ఏం చేయాలో అర్థం కావడం లేదు : జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి, మంత్రులకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించారు. 17 వేల కోట్ల మిగులు ఆదాయంతో దేశంలో హుందాగా ఉన్న తెలంగాణ, నేడు కేసీఆర్ అసమర్థ పాలన వల్ల 3 లక్షల కోట్ల అప్పులతో దివాళా రాష్ట్రంగా మారిపోయిందని విమర్శించారు. ఆయన మాటల్లోనే.. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, కొత్త ఉద్యోగాలు, పీఆర్సీ, రైతు బంధు, మద్దతు ధరలు, ధరల నియంత్రణలలో ఏవీ అమలు కాలేదు. అవినీతిలో 5వ స్థానం, విద్యలో 13వ స్థానంలో ఉండడం బాధాకరం. విద్యా, వైద్యం పరిస్థితి దారుణంగా ఉంది. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. రోడ్లపైన హత్యలు జరుగుతున్నాయి. మహిళల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది. శాంతి భద్రతల విఘాతంలో దేశంలో రెండో స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ అంటే చెడ్డపేరు వచ్చేవిధంగా మారిపోయింద’ని వ్యాఖ్యానించారు. ఇంకా ‘రెవెన్యూ ప్రక్షాళన అంటూ ఇంకా 11 లక్షల మంది రైతులకు పాసుబుక్కులు ఇవ్వలేదు. పంచాయితీలకు, మున్సిపాలిటీలకు నిధులు లేవు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు అడిగే పరిస్థితి లేదు. గతంలో ఎమ్మెల్యేకు ఏడాదికి మూడు కోట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఒక్క పైసా లేదు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? సంగారెడ్డి ప్రజలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. గతంలో సింగూరు, మంజీరా నీరు బయటకు వదలొద్దంటే హరీష్‌రావు వినలేదు. ఇప్పుడు సంగారెడ్డి ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నా’నంటూ వివరించారు. -
‘ఆర్టీసీని వాడుకుని రాజకీయం చేయలేదు’
సాక్షి, సంగారెడ్డి: ఆర్టీసీ కార్మికులను వాడుకుని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజకీయం చేయలేదని ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 52 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షనీయమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచిన సీఎం కేసీఆర్.. ఎక్కడ ప్రైవేటీకరణ అనే ప్రకటన చేయలేదని అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఇక ప్రైవేటీకరణ అనేదే ఉండదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ చార్జీల పెంపుపైన ప్రజలలో వ్యతిరేకత వస్తే తాము వారి పక్షాన పోరాతామని చెప్పారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ ఘటనల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే ప్రియాంక మృతిపై ఆయన స్పందిస్తూ.. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇక ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళలు, యువతులు జగ్రత్త పడాలని ఆయన సూచించారు. ఇబ్బందుల్లో వారి కోసం స్పెషల్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దాబాల వద్ద భద్రత చర్యలు పెంచాలని సీఎం, హోంమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఆర్టీసీ కార్మికుల ఏడుపు మంచిది కాదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం విచిత్రంగా తయారవుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత ఎంతో మేలు జరుగుతుందన్న ఆశతో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం వద్దకు తీసుకువచ్చారన్నారు. కార్మికుల డిమాండ్లు నిజమైనప్పటికీ ప్రాణనష్టం జరుగుతోందన్న ఆలోచనతో సమ్మె విరమించారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమ్మె విరమించి తిరిగి విధుల్లో చేరాలనుకుంటున్న ఉద్యోగులను ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ విధుల్లోకి తీసుకోమని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ‘ఆయన ఎవరు ప్రకటన చేయడానికి.. రాష్ట్రంలో ఏం జరుగుతుంది. రాష్ట్రంలో మంత్రులు లేరా’ అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఆకలి అవుతుందని చెప్పుకునే పరిస్థితి.. నిరసన తెలిపే హక్కు కూడా లేదు’ అని అసహనం వ్యక్తం చేశారు. గత 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి పక్షాలకు మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీని సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రైవేటు చేసినా.. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రైవేటును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు లేఖలు రాస్తున్నానని, ఈ విషయాన్ని కూడా తమ పార్టీ పెద్దలకు లేఖలో వివరిస్తానని తెలిపారు. ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమంలో పని చేసిన మేధావులంతా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీని ఆదుకోవాలి అలాగే ‘చక్రపాణి, అల్లం నారాయణ, కారం రవీందర్‌రెడ్డి, టీఎన్జీఓ, టీజీఓ నేతలంతా ఎక్కడున్నారు. మీ అందరికీ చీము నెత్తురు లేదా.. మీకు అసలు సిగ్గుందా.. ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారా...చరిత్ర హీనులుగా మిగిలిపోతారా’ అంటూ ధ్వజమెత్తారు. అదే విధంగా ‘సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా.. ఆర్టీసీ కార్మికుల ఏడుపు మంచిది కాదు. ఆర్టీసీని ఆదుకోవాలి. ఇవాళ మీరు అధికారంలో ఉండవచ్చు. పోలీసులు మీ చేతుల్లో ఉండవచ్చు. కానీ అన్ని రోజులు మనవి కావని గుర్తు పెట్టుకోవాలి’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
సమ్మె విరమణ హర్షణీయం: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత 52 రోజులుగా కొనసాగిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం హర్షణీయమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కార్మికులు మంగళవారం నుంచి విధుల్లో చేరుతామని ప్రకటించినందున వారిని విధుల్లో చేర్చుకునే విషయంలో ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఎలాంటి ఆటంకాలు సృష్టించినా అది శాంతి భద్రతల అంశంగా మారే అవకాశం ఉందని, మానవతాదృక్పథంతో వారు విధుల్లో చేరేలా కేసీఆర్ అనుమతించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. -
సోనియాజీ నాకో ఛాన్స్ ఇవ్వండి...
సాక్షి, సంగారెడ్డి : తెలంగాణలో మంచి పాలన రావాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని, తాను లోక కళ్యాణం కోసమే పీసీసీ పదవి అడుగుతున్నాని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలలో పనిచేసిన అనుభవం ఉందని, పీసీసీ అవకాశం ఇస్తే వారిని ఎలా ఎదుర్కొవాలో తెలుసని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ పదవి నుంచి వైదొలిగిన తర్వాత తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీని ఇదివరకే కోరినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే నా పూర్తి బయోడేటా వివరాలను సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్ వంటి కీలక నేతలందరికి రిజిస్టర్లో పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఒకవేళ తనకు పీసీసీ పదవి లభిస్తే ఎటువంటి షరతులు లేకుండా సోనియా, రాహుల్ సూచనల మేరకు పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ రాచరిక పాలనను నిలదీసే ధైర్యం ఆ పార్టీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని, ఎవరు తప్పు చేసినా నిలదీసే హక్కుతో పాటు అవసరమైతే పదవి నుంచి తొలగించే అధికారం ఉంటుందని వెల్లడించారు. సోనియా, రాహుల్ అడుగుజాడల్లో పార్టీ నడుస్తుందని, ఎవరికి వారే హీరోలు అనుకుంటే కాంగ్రెస్‌లో నడవదని వివరించారు. డబ్బు ఉంటేనే అధిష్టానం పీసీసీ పదవి ఇస్తుందనేది అవాస్తవమని పేర్కొన్నారు. గతంలో డబ్బు లేకున్నా డి. శ్రీనివాస్, కేశవరావు వంటి వ్యక్తులు పీసీసీ పదవులు లభించలేదా అంటూ గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో లాబీయింగ్ ఉన్నా క్యారెక్టర్‌ను కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. తాను బహిరంగంగా అన్ని విషయాలు చెప్పాలని అనుకున్నట్లు తెలిపారు. ఈమేరకు తన మీద ఉన్న కేసులను ఏఐసీసీకి పంపిన బయోడేటాలో పేర్కొన్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
ముఖ్యమంత్రి దగ్గర తల దించుకుంటా, కానీ.. : జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : నియోజకవర్గ ప్రజల కోసం సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ముందు తల దించుకుంటా కానీ హైదరాబాద్ వస్తే మాత్రం ప్రజా సమస్యలపై తల ఎత్తి ప్రశ్నిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తనదైన శైలిలో మీడియాతో అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని... అతని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను నేడు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగి లోపం ఎక్కడుందో గుర్తించాలని జగ్గారెడ్డి సూచించారు. కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రిని ఒప్పించకుంటే రవాణాశాఖ మంత్రి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడుందని, ఎవరిని మిగిల్చారని ప్రశ్నించారు. సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని, అవసరమైతే కోర్టుకు వెళతామని కార్మికులకు భరోసా ఇచ్చారు. -
కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడను : జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి : కేసీఆర్‌కు, బీజేపీకి వ్యతిరేకంగా నేనెలాంటి స్టేట్మెంట్లు ఇవ్వననీ, మీరు కూడా మాట్లాడవద్దని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ దగ్గర తల వంచుతానని, మనకిప్పుడు అదే ముఖ్యమన్నారు. మరోవైపు తన మాట, ప్రవర్తన వెనుక ఎత్తుగడ ఉంటందని స్పష్టం చేశారు. ప్రత్యేక వ్యూహంతోనే నేను మాట్లాడతానని వెల్లడించిన జగ్గారెడ్డి, తాను ఏది చేసినా నియోజకవర్గం, కాంగ్రెస్ కార్యకర్తల కోసమే చేస్తానని వ్యాఖ్యానించారు. కాగా, ఒకవైపు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది. -
అందుకే హరీష్ రావును కలిశా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి గురువారం ఆర్థిక మంత్రి హరీష్‌రావుతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్టాడుతూ ..సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసమే మంత్రిని కలిసినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్దే తమ ధ్యేయమన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం 14సంవత్సరాల తరువాత హరీష్‌ను కలిసినట్లు ఆయన వెల్లడించారు. జగ్గారెడ్డి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంత్రి సమస్యల పరిష్కారం పై సానుకూలంగా స్పందించినట్లు అయన మీడియాకు తెలిపారు. కాగా నిన్న, మొన్నటివరకూ విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి తాజాగా హరీష్ రావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘మోదీ, షా కూడా నెహ్రూలా ఆలోచించేవాళ్లే..’
సాక్షి, సంగారెడ్డి : కశ్మీర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమర్థించారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి కశ్మీర్ అంశంపై నెహ్రూ చేసిన పని, నేటి పరిస్థితుల నేపథ్యంలో మోదీ, అమిత్‌షా తీసుకున్న నిర్ణయం సరైనవేనని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ‘పార్లమెంటు ప్రధాని మోదీ, అమిత్‌షా ఆర్టికల్ 370 రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా నెహ్రూపై ఆరోపణలు చేశారు. అది సరైంది కాదు. నాడు 540 సంస్థానాలు ఉండేవి. వాటిలో హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో.. కశ్మీర్ జునగర్ అధీనంలో ఉండేది. భారతదేశంలో విలీనం కావడానికి హైదరాబాద్ నిజాం నవాబు ఒప్పుకోలేదు. కానీ, ప్రజలు భారత్‌లో కలవడానికి సంసిద్ధమయ్యారు. కశ్మీర్ రాజు భారత్‌లో విలీన కావడానికి ఒప్పుకున్నాడు. కానీ, ప్రజలు ఒప్పుకోలేదు. నిజాం ఒప్పుకోకపోవడంతో పటేల్ రంగంలో దిగారు. ఆయన్ని ఒప్పించి సంస్థానాన్ని భారత్‌లో కలుపుకున్నారు. కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో కలవడానికి ఇష్టపడ్డారు. పాకిస్తాన్ నుంచి కశ్మీర్‌ను కాపాడటం కోసం నెహ్రూ ఆర్టికల్ 370, 35A తీసుకొచ్చారు. ఒకవేళ ఆ వెసులుబాటు కల్పించకపోతే మనకు ఇబ్బందుదు కలిగేవి. అప్పుడేం జరిగిందో ఇప్పుడున్న వాళ్లకు తెలియదు. ఒకవేళ పాకిస్థాన్ కశ్మీర్‌ను ఆక్రమించుకుంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడే వాళ్లం. అప్పుడున్న పరిస్థితుల్లో మోదీ, షా కూడా అలాంటి నిర్ణయాలే తీసుకునేవాళ్లు. కాంగ్రెస్ ఎప్పుడూ సెక్యులర్ పార్టీయే. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. సీట్ల కోసం విధానాలకు భిన్నంగా ప్రవర్తించదు. బీజేపీ ఒక మతానికి చెందిన పార్టీ. ఆర్టికల్ 370, 35A ఎత్తేయాలని ఆరెస్సెస్ ముందునుంచీ అనుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి మోదీ, షా ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం సరైందే. అప్పుటి పరిస్థితుల తగ్గట్టు నాటి ప్రధాని నెహ్రూ చేసింది కూడా సరైందే. కశ్మీర్‌ను కాపాడటంలో నాడు నెహ్రూ కీలక పాత్ర పోషించారు. కశ్మీర్‌ను నెహ్రూ కాపాడారు కాబట్టే ఈ రోజు మోదీ, షా ఈ నిర్ణయం తీసుకోగలిగారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు అవసరమే’అన్నారు. -
ముందు సమస్యలు పరిష్కరించండి: జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: ‘నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. ముందు ప్రజల సమస్యలను పరిష్కరించండి’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి బుధవారం వరకు జిల్లా కలెక్టరేట్ లేదా ఐబీ వద్ద శాంతియుత ధర్నా చేపడతామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో పలు కాలనీల్లో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా తాగునీటి సమస్యలపై ఎంతగా పోరాడినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగూరు జలాలను తరలించడం వల్లే ఈ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. సింగూరు జలాల తరలింపును అడ్డుకోటానికి తాను ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టిచుకోలేదన్నారు. తాను ప్రజల కోసం పోరాడితే టీఆర్ఎస్ నాయకులు తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి ఇబ్బందులు సమసిపోవాలంటే గోదావరి నీళ్లను పఠాన్ చెరువు నుంచి సంగారెడ్డికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరానని జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో పీజీ చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని, ఇది దృష్టిలో ఉంచుకుని తక్షణమే పీజీ కళశాల తరలింపును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
హరీష్‌రావుకు సవాల్ విసిరిన జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టలేదన్న హరీష్‌రావు బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాము ఎక్కడెకక్కడ ప్రాజెక్టులు కట్టామో స్వయంగా తానే తీసుకువెళ్లి చూపిస్తానని అన్నారు. కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇంత ప్రచారం చేసుకుంటారా అంటూ ఆయన ధ్వజమెత్తారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరంగా ప్రారంభించారన్నారు. సింగూరు, మంజీరా, ఎస్ఆర్ఎస్పీ, నాగార్జున సాగర్, శ్రీశైలం, దేవాదుల, జూరాల, ఎల్లంపల్లి, బీమా, నెట్టంపాడు, కోయల్‌సాగర్ గడ్డన్నవాగు, పెద్దవాగు, అలీసాగర్, గుత్ప. చౌట్పల్లి కట్టింది కాంగ్రెస్ కాదా అని జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు కట్టిన కాళేశ్వరం నీళ్లు ఎందులో నింపుతున్నారో హరీష్‌రావు జవాబు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమి చేసిందో ప్రజలకు తెలుసని, కావాలని నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. అదేవిధంగా తాము ఏనాడు ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూడలేదని, దాంట్లో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించామన్నారు. -
రాజగోపాల్‌రెడ్డి ఏం మాట్లాడాడో నేను చెప్పను..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు ఫోన్ చేసినమాట వాస్తవమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ...రాజగోపాల్‌రెడ్డి తనతో ఏం మాట్లాడారనేది తాను బయటకు వెల్లడించనన్నారు. రాజకీయ అంశాలపై తమ ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందని, ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ నుంచి ఎవరూ కూడా టీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లే ఆలోచన చేయరన్నారు. తాను మళ్లీ పార్టీ మారతానంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే పార్టీకి పూర్తి సమయం కేటాయిస్తానంటూ తాను ఇప్పటికే స్పష్టంగా చెప్పానన్నారు. తనకు ఆ పదవిస్తే పార్టీని బలోపేతం చేస్తానని జగ్గారెడ్డి మరోసారి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలలో గందరగోళ పరిస్థితి లేదని, పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉందని అన్నారు. నాయకులు అయోమయంలో ఉన్నారే కానీ క్యాడర్ కాదని అన్నారు. రాజకీయాల్లో లోపాలు లేని నాయకుడు ఎన్ని విమర్శలు అయినా చేయొచ్చని, లోపాలు ఉన్న నాయకులు కాదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కాగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం బీజేపీయేనంటూ రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన నిన్న పలువురు కాంగ్రెస్ ముఖ్యలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్లతో పాటు తనతో సన్నిహిత సంబంధాలున్న నేతలతో ఆయన మాట్లాడినట్లు భోగట్టా. అంతేకాకుండా భవిష్యత్‌లో తీసుకోబోయే నిర్ణయాలకు అండగా ఉండాలని రాజగోపాల్‌రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణా సంఘం... కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక పంపింది. -
పీసీసీ చీఫ్‌గా పులులు అవసరం లేదు..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తామని తాము భావించామని, అయితే మూడు స్థానాల్లో గెలుపొందినా తాము సేఫ్ జోన్లో ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ 4 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందడం వల్ల తమకేమీ నష్టం లేదని, టీఆర్ఎస్ మాత్రం డేంజర్ జోన్లో పడిందని ఆయన చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని, ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌ల రూపంలో మూడు పులులు విజయం సాధించాయని చెప్పారు. బీజేపీ గెలుపుతో రాష్ట్రంలో తమకు నష్టమేమీ లేదని, ప్రస్తుతం రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు 2023లో మూడు పార్టీల మధ్య జరుగుతాయని అన్నారు. భవిష్యత్తులో తమ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లబోరని, టీఆర్ఎస్ నేతలే బీజేపీలోకి వెళతారని చెప్పారు. నల్లగొండ ఎంపీగా ఉత్తమ్ గెలుపొందడం ద్వారా ఖాళీ అయ్యే హుజూర్నగర్ అసెంబ్లీ స్థానంలో కూడా తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు పులులు అవసరం లేదని, వేద మంత్రాలు చదివే సాత్వికులు కావాలని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
విజయశాంతి విమర్శలకు నో కామెంట్...
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి స్పందించారు. విజయశాంతి తనపై చేసిన విమర్శలకు తాను కౌంటర్ ఇవ్వబోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మల్యే జగ్గారెడ్డి బుధవారమిక్కడ విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘విజయశాంతికి పీసీసీ చీఫ్ కావాలనే కోరిక ఉందమో. ఆమె సినిమా స్టార్‌గా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. విజయశాంతి వల్ల కాంగ్రెస్‌కు ఉపయోగమే. ఆమె సేవలను దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకుంటే పార్టీకి ఉపయోగం. పార్టీ కోసం మరింత సమయం వెచ్చిస్తే విజయశాంతికి మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. రాబోయే రోజుల్లో పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టేవాళ్లు...ముఖ్యమంత్రి పదవిపై ఆశలు లేకుండా పార్టీ కోసం పని చేయాలి. పీసీసీ పీఠం కావాలనుకునేవాళ్లు తమ సొంత ఖర్చులతో పార్టీని నడిపేలా ఉండాలి. అప్పుడే పీసీసీకి కాబోయే సీఎంకు మధ్య సమన్వయం ఉంటుంది. పదవుల కోసం, డబ్బు కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్లు కాంగ్రెస్‌లో పుష్కలంగా ఉన్నారు. ఈ అంశంపై త్వరలో పార్టీ అధినేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తా. పార్టీ కోసం పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుల్లో ఉన్నారనేది వాస్తవం. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ ఎదుగదలకే పని చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఆయన పనిచేయలేదు. ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టాక పార్టీకి ఫాయిదా లేదన్నది సరికాదు. పార్టీ క్యాడర్లో ఉత్తమ్ మనోధైర్యం నింపగలిగారు. సీనియర్లు అంతా పీసీసీకి సమన్వయంతో పనిచేసినప్పుడే పార్టీకి మనుగడ. ఎమ్మెల్యేలు పార్టీ వీడటం ఉత్తమ్ వైఫల్యం కాదు. సొంత ప్రయోజనాల కోసమే ఫిరాయింపులు. ఉత్తమ్, కుంతియ అమ్ముడుపోయారనేది సరికాదు. వాళ్లను ఎవరు కొనలేరు. ఇక పార్టీలో కోవర్టులు ఎవరనేది సమయం వచ్చినప్పుడు చెబుతా.’ అని అన్నారు. -
కారెక్కుతున్న మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి అయిదు నెలలు అవుతున్నా టీఆర్ఎస్లో చేరేందుకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సగం ఖాళీ అవగా...తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలో కారెక్కనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 24న వీరంతా టీఆర్‌ఎస్‌లోచేరేందుకు ముహుర్తం ఖరారైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. తాజా చేరికలతో తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. ఈ ముగ్గురు చేరికతో ఇక కాంగ్రెస్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సీతక్క మాత్రమే మిగలనున్నారు. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా చేరికలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104కు చేరనుంది. -
‘నీ అంతటి నీచ చరిత్ర మరో నాయకుడికి లేదు’
సాక్షి, సంగారెడ్డి : సింగూరు నీటిని హరీష్‌రావు దొంగిలించారన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్నేతలు నిప్పులు చెరిగారు. జగ్గారెడ్డి విమర్శలపై టీఆర్ఎస్ నేతలు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ రాజమణి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. 'జగ్గారెడ్డి తీరుతో ఎందుకు గెలిపించామా అని సంగారెడ్డి ప్రజలు ఆవేదన పడుతున్నారు. జగ్గారెడ్డి వ్యవహారం చూసి పిచ్చి వాడిని గెలిపించాము అని సంగారెడ్డి ప్రజలు భావిస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నాడు. నీటి సమస్యలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంటే, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభం. నీకు జనాలు ఓట్లు వేసి ఏం లాభం. జగ్గారెడ్డి ముమ్మాటికీ చెల్లని రూపాయి. ఎమ్మెల్యేగా గెలవగానే, తెలంగాణకు ద్రోహం చేశావు. ఈదులనాగులపల్లి, ధర్మసాగర్, కంది, చేర్యాలలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి అమ్ముకున్నావు. ఇంతటి నీచ చరిత్ర రాష్ట్రంలో మరో నాయకునికి లేదు. తప్పని పరిస్థితిలో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల రైతులను కాపాడాలనే ఉద్దేశంతో నీటిని విడుదల చేశారు. ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రోత్సహిస్తే ఉక్కుపాదం కింద నలిగిపోక తప్పదు. జగ్గారెడ్డి ఎన్ని జన్మలు ఎత్తినా హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని అడ్డుకోలేవు. కేసులు, శిక్షల నుంచి తప్పించుకోవడానికే జగ్గారెడ్డి కేసీఆర్‌ను పొగుడుతున్నాడు' అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మండిపడ్డారు. 'జగ్గారెడ్డి గత కొన్ని నెలలుగా ప్రెస్ మీట్లు పెట్టి హరీష్ రావుపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. తప్పుడు హామీలు ఇచ్చి గెలుపొందిన జగ్గారెడ్డి వాటిని నెరవేర్చకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తాను చేసిన నేరాలకు జైలుకు వెళ్ళక తప్పదనే భయంతోనే జగ్గారెడ్డి హరీష్ రావు మీద విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం హరీష్ రావు చేసిన కృషి నువ్వు చేసిన నిర్వాకాలు అందరికి తెలుసు. కార్గిల్ యుద్ధ సమయంలో కార్గిల్ అమరవీరుల కోసం డబ్బులు వసూలు చేసి వాటిని స్వాహా చేసిన చరిత్ర జగ్గారెడ్డిది. సరిహద్దులో సైనికులు ఉండి శత్రువులతో పోరాడుతుంటే నువ్వు అక్రమంగా గుజరాత్ మహిళను అమెరికాకు తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చావు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశావు. ప్రజాసేవను వదిలిపెట్టి ఇటువంటి విమర్శలు చేస్తూ కాలం గడిపితే చరిత్రలో పుట్టగతులుండవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంవత్సరానికి 7టీఎంసీల నీటిని హైద్రాబాద్‌కు తరలించారు. అప్పుడు ఎందుకు స్పందించ లేదు. రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అందుకే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. శిక్షల నుంచి తప్పించుకోవడానికి నిష్కలంకమైన హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నావు. కాళేశ్వరం నుంచి సింగూర్‌ను నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎక్కువ నీరు ఉన్న దగ్గరి నుంచి అవసరం ఉన్న ప్రాంతాలకు తరలిస్తారు. కృష్ణ, గోదావరిలోంచి నీటిని హైదరాబాద్ తాగునీటి కోసం తరలిస్తున్నారు. దీన్ని అక్కడి ప్రజలు అడ్డుకుంటే హైదరాబాద్ పరిస్థితి ఏంటి. చట్ట సభల్లో కూర్చొని జగ్గారెడ్డి గల్లీ నాయకునిలా వ్యవహరిస్తున్నాడు. గల్లీ రాజకీయాలపై ఆసక్తి ఉంటే వచ్చే ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చెయ్యి. ప్రజా ఆదరణ ఉన్న నాయకులను విమర్శించి జగ్గారెడ్డి వికృత ఆనందం పొందుతున్నాడు. జగ్గారెడ్డి తన చర్యలతో సంగారెడ్డి నియోజకవర్గానికి నష్టం చేస్తున్నాడు' అని మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పేర్కొన్నారు. 'జగ్గారెడ్డి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసింది ఏం లేదు. హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగదు. ఎమ్మెల్యేగా వీలైతే అభివృద్ధి చెయ్యాలి. లేకపోతే మా ప్రభుత్వమే అభివృద్ధి చేసుకుంటుంది' అని జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి అన్నారు. కాగా, సింగూరు నీటిని హరీష్‌రావు దొంగిలించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. హరీష్‌రావు ఆదేశాల మేరకే సింగూరు నీటిని నిజాంసాగర్‌కు తరలించారని విమర్శించారు. నీటిని తరలిస్తుంటే ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సింగూరుపై హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. -
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలవను : జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తాను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును వ్యక్తిగతంగా కలవనని, మీడియా ద్వారానే అన్ని విషయాలు చెప్పదలుచుకున్నానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలో వద్దో అది కేసీఆర్ ఇష్టమని, జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని అడగనన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ సీఎం దగ్గరవుంది కాబట్టి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన నిర్వాకంతోనే సింగూరు, మంజీరా ఎండిపోయిందని, తాను పదిహేను రోజులుగా చెబుతున్నా అనధికారికంగా హరీష్ నీళ్లు తీసుకెళ్లిన దానిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడంలేదని మండిపడ్డారు. మంజీర ,సింగూరుకు చేసిన తప్పును ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిందని, ఒక్క బోరు కూడా పడటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల బృందాన్ని పంపి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏడుపాయల జాతరకొచ్చే లక్షలాది భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కారణంగానే ప్రస్తుత సమస్యలు ఏర్పడ్డాయని ఆరోపించారు. హరీష్ తప్పు చేశారు కాబట్టే తన కామెంట్స్‌పై స్పందించడం లేదన్నారు. తాను చెబుతున్నవి వాస్తవాలు కాబట్టే టీఆర్ఎస్ మౌనంగా ఉందన్నారు. -
మీడియాతో జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్:. ‘ఓ రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాకు రాజకీయ పునరుజ్జీవం కల్పించా రు. ఆయన పార్టీ పెట్టడం వల్లే నేను ఎమ్మెల్యేను కాగలి గాను. కేసీఆర్ వల్ల నాకు రెండు రకాల మేలు జరిగింది’ అని కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి చెప్పారు. బీజేపీలో రాజకీయంగా తనను అణచివేసిన సమయంలోనూ టీఆర్ఎస్ అధినేత పిలిచి పార్టీలోకి ఆహ్వానించారన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ హరీశ్‌రావు బ్లాక్మెయిల్ రాజకీయాల కారణంగానే తనను జైల్లో పెట్టించారని ఆరోపించారు. ఈ కారణంగానే తన వారసురాలు జయారెడ్డి తెరపైకి వచ్చారని, జయారెడ్డిని భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకురాలిగా చూడవచ్చని వ్యాఖ్యానించా రు. కేసీఆర్ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని రాజకీయం గా విమర్శించానే తప్ప వ్యక్తిగతంగా తానెప్పుడూ మాట్లాడలేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తాను విభేదించేదంతా హరీశ్‌రావుతోనేనని, తనను జైల్లో పెట్టించింది ఆయనేనని ఆరోపించారు. ఉనికి కోసం హరీశ్ తనను బలి చేసే యత్నం చేశారని దుయ్యబట్టారు. హరీశ్ ఇప్పుడు టీఆర్ఎస్ను వీడతారని తాను అనుకోవడం లేదన్నారు. హరీశ్‌తో పోలిస్తే కేటీఆర్ చాలా ఫెయిర్ అని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ పార్టీ మారేది లేదని, అయితే నియోజకవర్గ అభివృద్ధి, సం గారెడ్డిలో మెడికల్ కళాశాల కోసం కేసీఆర్, కేటీఆర్‌లను కచ్చితంగా కలుస్తానని చెప్పారు. తాను టీఆర్ఎస్ను వీడినప్పటి నుంచి కేసీఆర్‌తో లోపాయికారీగా కలిసింది ఎప్పు డూ లేదని, కేసీఆర్, కేటీఆర్‌లతో తాను మాట్లాడలేదని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు సీనియర్ నేతలు ఉత్తమ్, వీహెచ్ తప్ప కాంగ్రెస్‌లో ఉన్న ఏ నాయకుడూ పట్టించుకోలేదన్నారు. ఆపద వస్తే ఆదుకుంటారనే విశ్వాసం కాంగ్రెస్‌లో లేదన్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారని, వారికి అధిష్టానం భరోసా ఇవ్వకపోతే కోలుకోవడం కష్టమేనన్నారు. కాంగ్రెస్‌లో కమిటీలు, పదవుల విషయంలో రాహుల్ తీసుకునే నిర్ణయాలన్నింటికీ కట్టుబడి ఉంటానన్న జగ్గారెడ్డి... ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తే తప్ప కాంగ్రెస్‌లో పదవులు దక్కే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 7–8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేశారు. డీకే అరుణ, జానారెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి, విజయశాంతి, ఉత్తమ్ లాంటి నేతలను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని అభిప్రాయపడ్డారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాల ఫైర్... టీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి జగ్గారెడ్డి సానుకూలంగా మాట్లాడటంపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. పార్టీ మారబోనంటూనే జగ్గారెడ్డి కేసీఆర్‌ను పొగడటం, కేటీఆర్ చాలా ఫెయిర్ అని వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ కేడర్‌కు ఎలాంటి సంకేతాలివ్వాలనుకుంటున్నారని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ అంటే అభిమానం అంటూనే ‘ఢిల్లీ లాబీయింగ్’అని పేర్కొనడం ఏమిటని, ఢిల్లీలో నిర్ణయాలు జరిగే పరిస్థితి కాంగ్రెస్‌లో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదని గుర్తుచేస్తున్నారు. ‘జగ్గారెడ్డి వ్యక్తిగత ఎజెండాతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడాలి. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యాన్ని, పార్టీ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తే మంచిది’అని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.