ప్రజా గర్జన సభ చూసి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఇక నిద్ర పట్టదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన గురువారం మాట్లాడారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంకు ఘన చరిత్ర ఉందన్నారు. 1979 డిసెంబర్‌లో ఇందిరా గాంధీ సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించారని, ఆ తరువాత 1980లో జరిగిన ఎన్నికల్లో ఆమె భారీ మెజార్టీతో గెలుపొంది అధికారంలోకి వచ్చారన్నారు.