రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించేలా కృషి చేస్తానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ప్రచారకమిటీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల(ఫిబ్రవరి)లోనే ఎంపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు.