vijayasanthi
-
రాజకీయాల్లో సత్తా చాటిన వెండితెర మహారాణులు
రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఆషామాషి విషయం కాదు. మహిళలు రాణించాలంటే అంతకు మించిన సామర్థ్యమే ఉండాలి. అలాంటి రంగంలో సినిమా హీరోయిన్లు రాణించడం అనేది అంత సులభం కాదు. సాధారణంగా సినిమా హీరోయిన్ అంటే చాలామందిలో చిన్నచూపు కనిపిస్తుంది. అందుకే కొందరు వారిపై నోటికి వచ్చిన కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాలంటేనే రొంపి... ఇందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి. అవమానాలు, హేళనలు భరించాలి. అందుకే అతివలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కొందరు దూరంగా ఉంటారు. కానీ మరి కొందరు రాజకీయ కదనరంగంలోకి దూకుతున్నారు.. ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన హీరోయిన్లు కూడా శివంగిలా తనదైన మాటలతో రాజకీయ యుద్ధంలో పోరాడుతున్నారు. వారి పోరాటంలో అవమానాలు ఎదురైనా భూదేవి అంత సహనంతో ఓర్చుకొని అలాంటి వారి బుద్ధి చెబుతున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజకీయాల్లో రాణించిన వెండితెర మహారాణుల కొందరి గురించి తెలుసుకుందాం. తమిళనాడు అమ్మగా జయలలిత తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని తలచుకుంటే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు జయలలిత. తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతోనే శాసించిన అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. 1948లో జన్మించిన ఆమె.. సినీ నటిగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు సీఎంగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. 1991 నుంచి 2016 మధ్య ఆమె 14 ఏళ్లపాటు తమిళనాడు సీఎంగా పనిచేశారు. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవవుర తాలూకాలోని మెల్కోటేలో.. తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన రెండు పేర్లు కోమలవల్లి, జయలలిత. సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాలతో ప్రారంభించి.. సినీ నటి స్థాయికి ఎదిగింది. జయలలిత తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. జయలలిత 1981లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 43 ఏళ్లకే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు ఆమె తమిళనాడు సీఎం అయ్యారు. దీంతో అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు. 2016 డిసెంబరు 5న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆమె మరణించారు. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఆర్ కే రోజా చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా 1972 నవంబర్ 17న జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆమె తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఆ తర్వాత వరుసగా 2014, 2019 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా రోజా ఉన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు చిత్ర పరిశ్రమలో ఎంతో కాలం కొనసాగిన రోజా. తొలినాళ్లలో హీరోయిన్గా రాణించడం చాలా కష్టమని ఎంతో మంది ఎగతాలి చేశారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. ఎంతో కష్టపడి నటన, డాన్స్ నేర్చుకుని. పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినట్లు రోజా చెప్పారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని. విమర్శలను పాజిటివ్‌గా తీసుకుని. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఆమె పొలిటికల్ జర్నీ కొనసాగుతుంది. కన్నడలో సుమలత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అగ్రనటి సుమలత.220 కి పైగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. సినీ కెరీర్లో స్వీట్‌స్పాట్‌కు చేరుకొన్నాక అంబరీశ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత 2019 ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సుమలత విజయం కోసం కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శన్, రాక్‌లైన్ వెంకటేశ్, దొడ్డన్న వంటి సినీ ప్రముఖులు కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పనిచేస్తానని ఇటీవల సుమలత ప్రకటించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున మాండ్య నుంచే పోటే చేస్తానని ఆమె చెప్పారు. విజయశాంతి సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నించారు విజయశాంతి. 25 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఆమె కొనసాగుతున్నారు. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయశాంతి. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. తన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి.. ఆ పార్టీ తరపున మెదక్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. మెదక్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తిరిగి బీజేపీలో చేరారు. అమరావతిని శాసించిన తొల మహిళగా నవనీత్ కౌర్ నవనీత్ స్వస్థలం పంజాబ్. ఆమె తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో ‘శ్రీను వాసంతి లక్ష్మి’తో మొదలుపెట్టి 2010లో కాలచక్రం వరకు దాదాపు 20 తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. ఆపై 2011లో ఎమ్మెల్యే రవి రాణాతో పెళ్లి జరగడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. రవి రానాను పెళ్లి చేసుకున్న తర్వాత, నవనీత్ అమరావతికి వచ్చేశారు. తొలిసారి ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. అమరావతి నియోజిక వర్గంలో శివసేన నాయకుడు అనందరావ్ అడ్సూల్‌కు విపరీతమైన పట్టు ఉంది. దీంతో ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. కానీ, నవనీత్ అంత తేలిగ్గా వదిలిపెట్టే వ్యక్తి కాదు. పేదల ఇళ్లకు వెళ్లి భోజనం చేసేవారు. వారి ఇంట్లోకి వెళ్లి వారి కూతురిలా కలిసిపోయారు. 2019 ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి మళ్లీ ఆనంద్‌రావ్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాయి. అయితే, కాంగ్రెస్-ఎన్సీపీల మద్దతున్న నవనీత్ భారీ ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. మరావతి నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ ఆమె కావడం విశేషం. అయితే, ఇప్పుడు ఆమె రాజకీయాలు బీజేపీకి దగ్గరగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సమయంలో 2021లో లోక్‌సభలో ఆమె తెలుగులో మాట్లాడి తెలుగు వారందిరినీ మురిపించారు. స్టార్ క్యాంపెయినర్‌గా నగ్మా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం లేదు కానీ.. సినీ నటిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా నగ్మా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. చాలా సంవత్సరాల కిందటే కాంగ్రెస్ పార్టీలో చేరిన నగ్మా.. ఆ పార్టీ తరపున వివిధ రాష్ట్రాల వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగానే ఉన్నారు. -
రాజకీయం సినిమా వరకేనా? ఎన్నికల్లో పోటీ చేయరా?
తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ వార్ నడుస్తోంది. ఇప్పేటికే రాజకీయ నాయకుల నుంచి బుల్లెట్ లాంటి వ్యాఖ్యలు దూసుకొస్తున్నాయి. దీంతో ప్రతిరోజూ పత్రికలల్లో నువ్వానేనా.. హోరాహోరీ..! అనేలా వార్తలు ప్రచురం అవుతున్నాయి. అన్ని జరుగుతున్నా ఈ సారి ఎన్నికల్లో సినిమా గ్లామర్ కనిపించడం లేదు. ఎన్నికల వాతావారణం ముందు వివిధ పార్టీల నుంచి ఎలక్షన్స్ బరిలోకి దిగాలని దాదాపు పదిమందికి పైగా సినీ ప్రముఖులు ఉవ్విళ్లూరుతున్నట్లు వార్తలు వచ్చాయి! కానీ వారిలో ఈసారి ఎవ్వరికి ఆయా పార్టీలు టికెట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపించాయని చెప్పవచ్చు. బరిలో బాబూ మోహన్ మాత్రమే.. వారందరూ దూరం ఎందుకు? నిజానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విజయశాంతి, బాబూ మోహన్ మాత్రమే సినీ రంగం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. కానీ గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క బాబూ మోహన్ మాత్రమే పోటీ చేశారు! అదే విధంగా జయసుధ కూడా ఎక్కడా పోటీ చేయలేదు. కానీ ఈ సారి ఈ ముగ్గురితో పాటు నిర్మాతలు దిల్ రాజు, రామ్ తాళ్లూరి, దర్శకుడు శంకర్, నితిన్, జీవిత, కత్తి కార్తీక, ప్రకాశ్ రాజ్ వంటి వారందరూ కూడా వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ పైనల్గా బాబూ మోహన్ మాత్రమే ఆందోల్ నియోజక వర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్నాడు. బీజేపీ విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యుర్థుల మొదటి లిస్ట్‌లో ఆయన పేరు కూడా లేకపోవడంతో పార్టీపై ఆయన పలు విమర్శలకు దిగాడు. దీంతో రెండో లిస్ట్‌లో ఆయన పేరును బీజేపీ ఖరారు చేసింది. ఎన్నికల బరిలో లేని జయసుధ కారణమిదేనా..? ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీజేపీలో చేరిన సీనియర్ నటి జయసుధకు సీటు దక్కలేదు. అదే పార్టీలో చాలా ఎళ్లుగా ఉన్న ఫైర్ బ్రాండ్ విజయశాంతి అలియాస్ రాములమ్మకు కూడా సీటు దక్కలేదు. ఎన్నికల బరిలో నిలబడకూడదని వారు నిర్ణయించుకున్నారా..? లేదా పార్టీనే వారిని పక్కన పెట్టేసిందా..? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్,కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీలకు తెలుగు చిత్ర సీమ నుంచి సానుభూతి పరులు ఉన్న విషయం తెలిసిందే. కానీ వారెవ్వరూ ఎన్నికల సమయంలో ఆ పార్టీల తరపున ప్రచారం చేసేందుకు ముందుకు రావడం లేదు. కనీసం ఎక్కడా కూడ నోరెత్తడం లేదు. దీనికి ప్రధాన కారణం భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురుకావచ్చు.. మనకెందుకు ఈ ఎన్నికల గొడవ అని వారు ఎక్కడా కూడా నొరెత్తడం లేదని తెలుస్తోంది. బీజేపీకి దూరంగా విజయశాంతి..! 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయశాంతి. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి కచ్చితంగా బరిలోకి దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఇంకోవైపు, ఇటీవల పార్టీలో క్రియాశీలంగా ఉన్న జీవిత కూడా బీజేపీ తరఫున పోటీలోకి దిగుతారని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఆమె జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉంటారని వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు జయసుధ కూడా సికింద్రాబాద్ నుంచి ఎన్నికల పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతుండగా దానిని ఆమె కొట్టిపారేసింది. తాను ఎక్కడ నుంచి పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేసి రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోతే తన పరిస్థితి ఏంటి..? అధికారంలోకి వచ్చిన పార్టీతో లేనిపోని గొడవలు ఎందుకు..? సినీ పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖుల మాదిరే తాను కూడా సైలెంట్‌గా ఉండటమే మంచిదని ఆమె నిర్ణయానికి వచ్చారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో ఆ పార్టీ తెలంగాణ విభాగం మహిళా ర్యాలీ చేపట్టింది. ఇందులో జయసుధ ప్రధాన ఆకర్షణగా నిలవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆ సమయంలో రాములమ్మకు ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆమె అసంతృప్తితో ఉన్నారని, ఆమె పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అప్పట్లో ఒక్కసారిగా గుప్పుమంది. ఆమె స్థానాన్ని జయసుధతో బీజేపీ భర్తీ చేసిందని పలువురు చెప్పుకొచ్చారు. రాములమ్మపై కిరణ్‌కుమార్ రెడ్డి ఎఫెక్ట్.. సినీ నటీనటుల్లో ఎన్నికల భయం తెలంగాణను వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలో చేరడాన్ని విజయశాంతి తీవ్రంగా వ్యతిరేకించడం కూడా ఆ పార్టీలో కొందరికి మింగుడు పడలేదు. కొన్ని సందర్భాల్లో కిరణ్ కుమార్ రెడ్డితో వేదిక పంచుకోవడానికి సైతం ఆమె ఆసక్తి చూపక పోవడంతో కొందరు నేతలకు తలనొప్పిగా మారింది. మణిపూర్ హింసాకాండపై కూడా ఆమె చేసిన ట్వీట్ బీజేపీని షాక్‌కు గురిచేసింది. అంతేకాక కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రకటనలు, పోస్టులు పెట్టడం, సోనియా గాంధీ, రాహుల్ వ్యాఖ్యలకు వత్తాసు పలుకడంతో ఆమె మళ్లీ కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆమె ప్రస్తుతానికి బీజేపీలోనే కొనసాగుతున్నా.. ఎక్కడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అదే సమయంలో కొన్ని నెలల క్రితం బీజేపీ కండువా కప్పుకున్న జయసుధ కూడా ప్రచారానికి దూరంగానే ఉంది. పలు రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉన్నా ఇతర సినీ ప్రముఖులు కూడా తెలంగాణ ఎన్నికల్లో ఎక్కడా కూడా కనిపించడం లేదు. దీనంతటికి కారణం వారి సినిమా కెరియర్ ట్రాక్ బాగుంది కదా..? తమకు అవసరం లేని ఈ పాలిటిక్స్ ఎందుకని వారు గ్రహించినట్లు తెలుస్తోంది. -
ట్విట్టర్ వేదికగా బయటపడ్డ విజయశాంతి, ఈటల విబేధాలు
-
టీడీపీతో పొత్తు ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్టీ నాయకత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ–బీజేపీ పొత్తు అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోందని వారు జాతీయ నేతల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. శామీర్‌పేటలోని ఓ రిస్టార్‌లో జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో విజయశాంతి, అర్వింద్‌లు ఈ విషయం ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో ఇటీవల బల ప్రదర్శన చేయడం ద్వారా తన ఉనికిని చాటుకునేందుకు టీడీపీ ప్రయత్నించిన నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిగ్గా మారిందని వారు చెప్పినట్లు తెలిసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్, సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ సమక్షంలో.. విజయశాంతి ఈ విషయం లేవనెత్తారని, అర్వింద్ కూడా పొత్తులపై స్పష్టత ఇవ్వాలని కోరారని తెలిసింది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయిన విషయం తనకు ప్రత్యక్షంగా తెలుసునని విజయశాంతి పేర్కొన్నట్టు సమాచారం. స్పందించని జాతీయ నాయకత్వం ఆకస్మికంగా పొత్తుల అంశం చర్చకు రావడంతో సమావేశంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని బండి సంజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కార్యకర్తలకు కూడా తెలియజేయాలని ఆయన సూచించారు. వేదికపై జాతీయ నాయకులున్నా, పొత్తులపై వారు ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోయినా.. సంజయ్ మాత్రం కల్పించుకుని పొత్తు ప్రసక్తే లేదని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని గతంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కూడా ప్రకటించిన సంగతి విదితమే. కాగా తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇదివరకే నాయకత్వం స్పష్టం చేసిన విషయాన్ని సంజయ్ గుర్తు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
హైదరాబాద్: బీజేపీలోకి విజయశాంతి
-
‘టీఆర్ఎస్, ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం పార్టీ ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తారని, మత కలహాలు సృష్టించి కూలదోస్తామని చెబుతున్నట్టా అని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు ఎప్పటికీ కలిసే ఉంటాయని, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అవసరమైతే పొత్తు పెట్టుకుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక, బిహార్‌లో కాంగ్రెస్–ఆర్జేడీలాంటి బలమైన కూటమిని ఓడగొడితే దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవదనే అభిప్రాయం మైనార్టీల్లో కలిగించాలనే వ్యూహంతోనే టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. తద్వారా అనేక రాష్ట్రాల్లో పట్టు సాధించి పొత్తుల ద్వారా విస్తరించేందుకు అవసరమైన నిధులను కూడా ఎంఐఎంకు టీఆర్ఎస్ అందించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందని వెల్లడించారు. -
విజయశాంతి కాంగ్రెస్‌లోనే ఉంటారు..
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి పార్టీ మారుతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం విజయశాంతితో భేటీ అనంతరం మాట్లాడుతూ... ‘విజయశాంతికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ అంటే ఎంతో గౌరవం. కరోనా కారణంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆమె పార్టీలోనే ఉంటారు. పార్టీ మారుతారనేది ప్రచారం మాత్రమే. విజయశాంతిని మేమంతా ఎంతో గౌరవిస్తాం. కరోనా కారణంగానే కొత్త ఇన్ఛార్జ్ను కలవలేకపోయినట్లు చెప్పారు’ అని అన్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో దాదాపు గంటపాటు భేటీ అయిన విషయం తెలిసిందే. (పాతగూటికి ‘రాములమ్మ’?) విజయశాంతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కుసుమ కుమార్ -
ఆ డైలాగ్‌కు అర్థం ఇదా..: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి వ్యంగ్య్రస్తాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పదేపదే ‘సారు.. కారు.. సర్కార్’అనే డైలాగ్ వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థం అయిందన్న విజయశాంతి, ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న స్తూపాల్లో దేవతామూర్తులతో పాటు కేసీఆర్ బొమ్మను, కారు గుర్తును, టీఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడం ద్వారా కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థమవుతోందన్నారు. రాజులు, రాజ్యాలు కను మరుగైన తర్వాత కూడా కేసీఆర్ తన దొర తనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మండిపడ్డారు. ఖండించిన కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి యాదాద్రి దేవాలయ శిలలపై కేసీఆర్ తన ఫొటోతో పాటు కారు గుర్తు చిహ్నాన్ని చెక్కించుకోవడం సిగ్గుచేటని ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ చర్యలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. తక్షణమే ఆయా చిత్రాలను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వివాదాస్పదంగా మారిన కేసీఆర్ చిత్రాలు కాగా యాదాద్రిలో అష్టభుజి మంటప పిల్లర్లపై సీఎం కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ఎన్నికల చిత్రమైన కారు, కేసీఆర్ కిట్టు, ఓటు వేయడానికి ఉపయోగించే స్వస్తిక్ స్టాంపు ముద్ర చిత్రాలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కాంగ్రెస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు కొండపైకి చేరుకుని నిరసనకు దిగారు. కొందరు కార్యకర్తలు ఉత్తర రాజగోపురం పైకి ఎక్కి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని కిందికి దించారు. దేవస్థానంలో జరుగుతున్న పనుల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ ఆ దరిదాపుల్లోకి రానివ్వలేదు. ఇది పుణ్యక్షేత్ర ప్రాశస్త్యాన్ని భంగపరచడమే.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అష్ట భుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభాల పై సీఎం కేసీఆర్ చిత్రం, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు, అన్యమత చిహ్నాలను చెక్కించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అది సీఎం కేసీఆర్ ప్రచార కాంక్ష మాత్రమే కాకుండా, హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని తెలిపారు. వైభవోపేతమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రాశస్త్యాన్ని భంగపర్చడం, తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. సీఎం ఆదేశాల మేరకే శిల్పులు కేసీఆర్ చిత్రాన్ని, టీఆర్ఎస్ గుర్తును చెక్కినట్టు స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్‌తో తమ మైత్రిని చాటుకుంటూ ఇందిరాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూల చిత్రా లు చెక్కించడం, తమ మిత్రుడైన మరో పార్టీని సంతృప్తి పరచడానికి, ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు హిందూయేతర మతానికి చెందిన చార్మినార్‌ను చిత్రించడం దుర్మార్గమన్నారు. -
కేసీఆర్, కేటీఆర్‌లపై విజయశాంతి విసుర్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, సినీనటి విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో తమ ప్రభుత్వ తప్పిదం ఏమాత్రం లేదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో వ్యవహరించిందని, కానీ ఇప్పుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివరణ కోరడంతో రక్షణలో పడిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ మీడియా నోరు నొక్కి గ్లోబరీనా వ్యవహారాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేసినా , ఇప్పుడు రాష్ట్రపతి వివరణ అడిగేసరికి గుటకలు మింగుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పిదాలు ఇవాళ కాకపోయినా రేపైనా వెలుగులోకి వస్తాయన్న విషయాన్ని తండ్రీకొడుకులు గుర్తుంచుకోవాలని విజయశాంతి హితవు పలికారు. తాను ఆణిముత్యం, తన కుమారుడు స్వాతిముత్యం అనుకుని మురిసిపోతే కుదరదని, కాలం మారడం ఖాయమని, జనం ఆలోచన, అభిమానం మారడం అంతకన్నా ఖాయమని ఆమె హెచ్చరించారు. -
కేసీఆర్‌పై కేంద్రం నిఘా శుభపరిణామం
సాక్షి, హైదరాబాద్: నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారుపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టడం శుభపరిణామమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఐదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రతిపక్షాలు ఆధారాలతోసహా బయటపెట్టినా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని ఆమె విమర్శించారు. ఈ మేరకు నిన్న (బుధవారం) ప్రకటన విడుదల చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసులు పెడతామని బెదిరించిన నేపథ్యంలో కేసీఆర్ పాలనపై కేంద్రం నిఘా పెట్టిందని, అవకతవకలపై సమాచారం సేకరిస్తుందని బీజేపీ నేతలు ప్రకటించడాన్ని రాష్ట్ర ప్రజలు మంచి పరిణామంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఏం చేసినా అడిగే నాథుడు లేడన్న బరితెగింపుతో వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను కట్టడి చేసే రోజు కోసం ప్రజానీకం ఎదురుచూస్తోందని అన్నారు. కేవలం నిఘాతో సరిపెట్టకుండా టీఆర్ఎస్ పాలనలో అవకతవకలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలా చేస్తే బంగారు తెలంగాణ పేరుతో ఆడుతున్న నాటకానికి తెరపడుతుందని ఆమె పేర్కొన్నారు. -
విజయశాంతి అరెస్ట్.. ఉద్రిక్తత
సాక్షి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జిల్లా కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ముట్టడి సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండేటి శ్రీధర్‌లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ముట్టడి సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాలలో అవకతవకలు జరిగి 5 రోజులు గడిచినా దొర మాత్రం ఎమ్మెల్యేలను కొనే బిజిలో ఉన్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. 20 మంది విద్యార్థులు చనిపోయినా చలనం లేదా దొర.. దొర ఇక నీ ఆటలు సాగవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలు చాలా బాధాకరమన్నారు. విద్యార్థులు అధైర్య పడవద్దని, వారి కోసం తాము ఉన్నామన్నారు. ఇంటర్ విద్యార్ధుల కోసం ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు. -
ఖమ్మం లోక్‌సభ నుంచి విజయశాంతి..!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి విజయశాంతి పోటీ చేస్తే స్వాగతిస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటిగా, తెలంగాణ ఉద్యమకారిణిగా ఆమెకు గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. ఖమ్మం నుంచి చాలాసార్లు వలస నేతలే విజయం సాధించారని ఆయన గుర్తుచేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం, విజయశాంతి గెలుపు కోసం తాను కృషిచేస్తానని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి స్థానం నుంచి పోటీచేయ్యాలని మానవతారాయ్ ప్రయత్నించారు. వరంగల్ లోక్‌సభ స్థానాన్ని తనకు కేటాయించాలని రాహుల్ గాంధీని కోరాతానని ఆయన తెలిపారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరిస్తున్న విజయశాంతి గతంలో మెదక్ లోక్‌సభ నుంచి ఎన్నికయ్యారు. -
ఈ నెలలోనే ఎంపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటింస్తుంది
-
‘ఫిబ్రవరిలోనే ఎంపీ అభ్యర్థుల ప్రకటన’
సాక్షి, హైదరాబాద్ : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించేలా కృషి చేస్తానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ప్రచారకమిటీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల(ఫిబ్రవరి)లోనే ఎంపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కేసీఆర్ గెలిచారని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు గట్టి బుద్ది చెబుతారన్నారు. (సార్వత్రిక ఎన్నికలకు ఐదు కమిటీలు) ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్, నరేంద్ర మోదీలు విఫలమయ్యారని విమర్శించారు. సీఎం కేసీర్ పెట్టింది ఫెడరల్ ఫ్రంట్ కాదని.. ఫెడో ఫ్రంట్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు మంత్రి వర్గం కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ని గెలిపించింది హోమాలు చేయడానికా అని ప్రశ్నించారు. ఫామ్ హౌజ్‌లో ఉండేవారికి కాకుండా ప్రజల మనిషికి అధికారం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజలు కోపంగా ఉన్న తెలుగు దేశం పార్టీని ముందు ఉంచి కేసీఆర్ ఎన్నికల్లో లబ్ది పొందారన్నారు. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగించాలని డిమాండ్ చేశారు. తాను పోటీ చేసే విషయం అధిష్టానం నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పారు. దొడ్డిదారిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది : డీకే అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు అన్ని అనుకూలంగా చెప్పినా... టీఆర్ఎస్ దొడ్డి దారిని అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మన్ డీకే అరుణ ఆరోపించారు. చేయరాని పనులు చేసి, ధనబలంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిపించి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని కోరారు. 2014ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు సాధించిన టీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. విభజన చట్టంలోని హామీలను సాధించడంలో టీఆర్ఎస్ విఫలమయ్యిందని విమర్శించారు. మతాల పేరుతో దేశాన్ని విభజించాలని చూస్తున్న బీజేపీని తిప్పికొట్టాలని పిలనిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయం అధిష్టానం నిర్ణయంపై అధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. -
‘రైతుల ఆత్మహత్యలకు కారణమెవరు?’
సాక్షి, హైదరాబాద్: రైతులను బంధువులా ఆదుకుంటామని చెప్పే సీఎం కేసీఆర్ పాలనలో రోజుకు 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అధికారుల నివేదికలో స్పష్టమైందని, ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి నిలదీశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాన్ని గుర్తించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, కానీ వేలమంది ప్రాణాలు పోయేవరకు విభజన విషయంలో నిర్ణయాన్ని జాప్యం చేసినట్లుగా చూపిస్తూ కాంగ్రెస్‌ను కేసీఆర్ దోషిగా చిత్రీకరించారని ఆరోపించారు. వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే వరకు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టకుండా చోద్యం చూసిన టీఆర్ఎస్ అధిష్టానాన్ని దోషి అనాలా? క్రిమినల్ అనాలా? అని ఆమె ప్రశ్నించా రు. ఒకేసారి రుణమాఫీ, నిజమైన శ్రామిక కౌలుదారులకు రైతుబంధు, గిట్టుబాటు ధర చెల్లించని టీఆర్ఎసే ఇందుకు కారణమని ధ్వజమెత్తారు. నెల రోజులు గడిచినా జవాబు చెప్పడానికి ఇక్కడ ఇంకా సర్కార్ -
ప్రచార సందడి
సాక్షి, నెట్వర్క్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో బుధవారం ప్రచార సందడి నెలకొంది. మంత్రి కేటీఆర్ వివిధ ప్రాంతాల్లో రోడ్డు షో, ప్రచారం నిర్వహించారు. తాండూరులో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెను చూసేందుకు యువత భారీగా తరలివచ్చింది. రాములమ్మ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కేటీఆర్ రోడ్డుషోలకు కార్యకర్తలు, జనం భారీగా హాజరయ్యారు. తాండూరులో హెలికాప్టర్ దిగి సభకు వస్తున్న రాములమ్మ తాండూరులో భవనాలు ఎక్కి విజయశాంతి ప్రసంగం వింటున్న జనం చేవెళ్లలో కూటమి అభ్యర్థి రత్నంను గెలిపించాలని చెబుతున్న రాములమ్మ మొయినాబాద్ రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్ మొయినాబాద్ రోడ్ షోకు హాజరైన ప్రజలు -
కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్
సాక్షి, చేవెళ్ల: ‘దొరా.. కేసీఆర్.. ఇదేంది అన్నా.. తెలంగాణ వస్తే ఏమో చేస్తావని అనుకున్నాం కానీ, ఏమి చేయాలేదు’ అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎస్ రత్నం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏదో చేస్తావని నమ్మిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. దళితబిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పావా లేదా అన్నా... గుర్తు తెచ్చుకోండి అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్ల మీద కుటుంబ సభ్యులంతా పడి అమ్మా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని కేసీఆర్ అడిగారన్నారు. ప్రజలకు దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి.. లోపల తననే ముఖ్యమంత్రి చేయమని అడగటంపై సోనియా ఆశ్చర్యపోయారని, దీంతో సోనియా.. దళితబిడ్డనే ముఖ్యమంత్రిని చేయాలి నేను మిమల్ని ముఖ్యమంత్రి చేయను, నీవు నా పార్టీలో చేరవద్దు అని పంపించారని విజయశాంతి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని, అలాంటి దేవతను విమర్శించే హక్కు, స్థాయి కేసీఆర్‌కు, కేటీఆర్‌కు, కవితకు లేదన్నారు. ఇంటింటికో ఉద్యోగం, దళితులకు భూమి, డబుల్బెడ్రూం ఇళ్లు అన్ని ఇచ్చి హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు ఆశీర్వదించాలని సభలు పెడుతున్నారని, మళ్లీ ప్రజలు ఓటు వేస్తారనే భ్రమలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాపీ, డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు అందిస్తుందని, ఏడాదికి పేదలకు ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుందన్నారు. 5లక్షల వరకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎస్ రత్నంను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే ప్రజలకు అంతా మంచి జరుగుతుందని అనుకున్నామని, జిల్లాకు ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా రాలేదన్నారు. అప్పుడు ఓట్లు కోసం వచ్చాడు, ఇప్పుడు ఓట్ల కోసం వస్తాడని విమర్శించారు. ఈ ప్రాంతానికి ప్రాణహితను అడ్డుకున్నాడు.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల తీసుకొస్తామని చెప్పాడు. ఇప్పుడు దానిని పాలమూరు ఎత్తిపోతల అని మార్చాడన్నారు.ఆ నీళ్లు వస్తాయో రావో తెలియదన్నారు. యువతకు ఉద్యోగాలు రాలేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ.. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. కేస్ రత్నంను అప్పుడు కొన్ని దుష్టశక్తులు కలిసి ఓడించాయని, ఈసారి భారీ మోజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సభలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి పి.వెంకటస్వామి, ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, గోవర్దన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డైరెక్టర్ అగిరెడ్డి, మహిళా నాయకురాలు సదాలక్ష్మీ, నాయకులు గోపాల్‌రెడ్డి, వెంకటేశంగుప్తా, వసంతం, మధుసూదన్‌గుప్తా, రవికాంత్‌రెడ్డి, శర్వలింగం, శ్రీనివాస్‌గౌడ్, టేకులపల్లి శ్రీను, శ్రీదర్‌రెడ్డి, కె.రామస్వామి, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, రఘువీర్‌రెడ్డి, విఠలయ్య, శివానందం, ప్రకాశ్‌గౌడ్, శంకర్, ప్రభాకర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారానికి ‘స్టార్ క్యాంపెయినర్లు’
సాక్షి, భూపాలపల్లి: నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక ప్రచారం ఉధృత రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు, సాధారణ స్థాయి నేతలు ప్రచారం నిర్వహించి మొదటి విడతను పూర్తి చేశారు. మలిదశ ప్రచారమంతా వీఐపీల పర్యటన మధ్య జరగబోతుంది. ఇందులో భాగంగా ఈనెల 19న పాలకుర్తిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈనెల 23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామలో ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. తన పర్యటనతో పార్టీలో కొత్త ఉత్సాహం నింపాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, కడియం శ్రీహరి, ఎంపీ కవిత సైతం ఆయా నియోజవకర్గాల్లో పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా ఈ పది రోజుల్లో బీజేపీ తరఫున ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆ పార్టీ అధినేత అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రానున్నారని సమాచారం. అలాగే కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహు ల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖుష్బూ, విజయశాంతి, రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరందరి బహిరంగ సభలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. అగ్ర నేతలపైనే ఆశలు.. టీఆర్ఎస్ తమ పార్టీలోని అగ్రనేతలపైనే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు తమ పరిధిలో పెద్దఎత్తున ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ సైతం ప్రచార తీవ్రతను పెంచి పోటీ ఉధృతం చేస్తుండడంతో టీఆర్ఎస్ మరింతగా అప్రమత్తమవుతోంది. ఎలా గైనా గెలవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించి రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని భావి స్తోంది. తెలంగాణ సెంటిమెంట్, స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ద్రోహం, త్యాగాలు, గత నాలుగున్నరేళ్లలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తోడుగా ప్రస్తుత ఆకర్షనీయ మేనిఫెస్టోతో ఓట్లు రాబట్టాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దూకుడు పెంచే దిశగా కాంగ్రెస్.. ఇక నుంచి ప్రచారాన్ని దూకుడుగా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సన్నాçహాలు మొదలు పెట్టింది. ఇందుకోసం పార్టీకి చెందిన అగ్రనేతలందరిని రంగంలోకి దింపి బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ వారం, పది రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదో ఒక చోట ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీచే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అలాగే ఈ రెండు, మూడు రోజుల్లో రేవంత్ రెడ్డి పర్యటన సైతం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సినీనటులు ఖుష్బూ, విజయశాంతి నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేయలేదని, కుటుంబ పాలన సాగుతోందని ఎండగడుతూ, తాము అధికారంలోకి వస్తే అమలు చేసే మేనిఫెస్టోను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుకు సాగుతున్నారు. రంగంలోకి బీజేపీ.. బీజేపీ కూడా తమ ఫైర్బ్రాండ్లను రంగంలోకి దించి ఓటర్లను ఆకట్టుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ అధినేత అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, జాతీయ నాయకులు పరిపూర్ణానందస్వామి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులను జిల్లాకు రప్పించేందుకు సమాయత్తమవుతున్నారు. అలాగే బీజేపీలో కొనసాగుతున్న సినీనటులను సైతం రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. దీనికి తోడు తమ అనుబంధ సంఘాల్లోని అనర్ఘళంగా మాట్లాడే వారిని ఇక్కడికి రప్పించేం దుకు ప్రయత్నిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రాంమాధవ్, పరిపూర్ణానంద స్వామి పాల్గొంటా ర ని చెబుతున్నారు. సోమవారం భూపాలపల్లిలో జరిగిన బీజేపీ సభలోనే వీరిరువురు పాల్గొనాల్సి ఉన్నా అనివార్య కారణాలతో రావడం కుదరలేదని పేర్కొన్నారు. ఇక బీఎల్ఎఫ్ కూడా అందులోని పార్టీలకు చెందిన ముఖ్యనాయకులతో ప్రచారం నిర్వహిస్తోంది. -
కేసీఆర్ అంతమే ..కాంగ్రెస్ లక్ష్యం
మధిర/బోనకల్: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. మండలంలోని రావినూతల గ్రామంలో సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ పాలన చేతిలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిందన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ పార్టీని మోసం చేసి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారన్నారు. రాష్ట్ర సాధన కోసం 20 ఏళ్లు పోరాటం చేశానని విజయశాంతి గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటువేస్తే దొరల పాలన వస్తుందన్నారు. బంగారు తెలంగాణ ఉండదని, రాష్ట్రమంతా సర్వనాశనం అవుతుందన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఆ దొర నిజస్వరూపం బయటపడిందన్నారు. రాష్ట్రంలో 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతలకు ఖమ్మంలో సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా తీసి వేసి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నారు. ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులుగా మారి.. జీవితంపై విరక్తి కలిగేటట్లు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేజీ టు పీజీ విద్య ప్రవేశపెడతామని చెప్పి 5వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశాడన్నారు. రానున్నది ప్రజా ప్రభుత్వమే : భట్టి విక్రమార్క టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మధిర నియోజకవర్గానికి వేలాది కోట్ల రూపాయలను తెచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ ఊసే లేకుండా చేశాడన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ తిన్న సొమ్మును తిరిగి కక్కిస్తామన్నారు. టీడీపీ, టీజేఏసీ, సీపీఐతో కలిగి మహా కూటమిని ఏర్పాటు చేశామని, రానున్నది ప్రజా ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. మధిరలో 35 నుంచి 40వేల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ఆనాడు ఉప సభాపతిగా ఉండి.. తెలంగాణ బిల్లును నా చేతులమీది నుంచి ప్రవేశపెట్టానన్నారు. బీజేపీ మతోన్మాదం పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టిస్తోందన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి బొమ్మ పెట్టుకుని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేసి.. కాంట్రాక్టర్ల కోసం కేసీఆర్ వద్దకు వెళ్లిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తనను విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదన్నారు. మూడు పార్టీలు మారి.. కాంట్రాక్టర్ల సంచులు మోసే లింగాల కమల్‌రాజ్‌ను చూసి ఓటు వేసే అవివేకులు మధిర ప్రజలు కారని, ఇక్కడి ప్రజలు ఎంతో విజ్ఞులన్నారు. పనులు చేయకుండా బిల్లులు చేయించుకునేందుకే ఎంపీ పొంగులేటి పార్టీ మారారన్నారు. టీఆర్ఎస్ పతనం బోనకల్ నుంచే ప్రారంభమైందని, ఈ పార్టీకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బడ్జెట్లో కోట్లాది రూపాయలను కేటాయించినప్పటికీ నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి డ్యామ్‌లు ఏమైనా కట్టారా? కొత్త పరిశ్రమలు పెట్టారా? ఎక్కడైనా ఆనకట్టలు నిర్మించారా? అని ఆయన ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ విద్యను అమలు చేయకుండా మోసం చేశాడన్నారు. అమ్మహస్తం పథకాన్ని తీసి వేసి.. 9 రకాల వస్తువులను ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడన్నారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని, రైతు కూలిబంధు పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు సొంత స్థలాల్లో నిర్మించుకునేలా రూ.5లక్షలను లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తామన్నారు.బోనకల్ పోరాటాల పురిటిగడ్డ అని, మూడోసారి తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ రామనాథం, కాంగ్రెస్, టీడీపీ ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పైడిపల్లి కిషోర్, బంధం నాగేశ్వరరావు, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
మెదక్’ టికెట్ కాంగ్రెస్‌దే..
మెదక్‌జోన్: మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ స్థానిక నేతలకు వస్తుందని టీపీసీసీ ప్రధానకార్యదర్శి బట్టి జగపతి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరి మ్యాడం బాలకృష్ణ స్పష్టం చేశారు. వారు మంగళవారం మెదక్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ మేరకు పార్టీ స్పష్టమైనసంకేతాలు ఇచ్చినట్లు తెలిపారు. మహాకూటమిలో భాగంగా మెదక్ స్థానం తెలంగాణ జనసమితికి వస్తోందని అసత్య ప్రచారం సాగుతోందని, కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ దీనిని నమ్మొద్దని కోరారు. కొంత మంది పనిగట్టుకుని ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. మెదక్ స్థానం కాంగ్రెస్‌కే దక్కుతుందని స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ విజయశాంతి తమకు చెప్పారన్నారు. ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది కాంగ్రెస్ గెలుచుకోవటం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఇచ్చినహామీల్లో ఏ ఒక్కటీ నేరవేర్చలేదన్నారు. ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని తెరిపించ చేతగాని టీఆర్ఎస్ను మళ్లీ గద్దెనెక్కిస్తే ఏం ఒరగ బెడుతుందో ప్రజలో అర్థం చేసుకోవాలన్నారు. ఫ్యాక్టరీని తెరిపించక పోవటంతో ఈ ప్రాంత రైతులు, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. అందులో ఐదు మంది కార్మికులు గుండాగి చనిపోయారని విమర్శించారు. అవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఈ ప్రాంత రైతులకు ఉపయోగించాల్సిన సింగూరు నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అక్రమంగా తరలించటంతో ఈ ప్రాంతంలోని పంటపొలాలన్ని బీళ్లుగా మారాయన్నారు. నీళ్ల మంత్రి హరీశ్‌రావు ఏం మొహంపెట్టుకొని ఓట్లు అడిగేందుకు మెదక్ వచ్చాడని వారు మండిపడ్డారు. పద్మాదేవేందర్‌రెడ్డి మాహాకూటమిని విమర్శించే ముందు గతంలో టీడీపీతో పొత్తుపెట్టుకున్న విషయాన్ని మర్చిపోకూడదని తెలిపారు. మెదక్ ప్రాంతానికి మంజూరైన మెడికల్ కళాశాలను సిద్దిపేటకు తరలించుకపోతే కళ్లప్పగించి చూసిన పద్మాదేవేందర్‌రెడ్డి ఈప్రాంతానికి చేసిన మేలు ఏం లేదన్నారు. జిల్లాలోని అథ్లెటిక్ సెంటర్‌ను హైదరాబాద్‌కు తరలించుక పోతుంటే ఏం చేసిందో? చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అఫిజొద్దీన్, కిషన్‌గౌడ్, చందు ఉన్నారు. -
కూటమికే పట్టం కట్టండి : భట్టి విక్రమార్క
సాక్షిప్రతినిధి, ఖమ్మం: టీపీసీసీ ప్రచార కమిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలు విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చాలని, ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించారు. సభల్లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి, ప్రచార కమిటీ కోకన్వీనర్, మాజీ మంత్రి డీకే.అరుణ పాల్గొననున్నారు. ప్రచార సభల విజయవంతం కోసం పీసీసీ ప్రత్యేకంగా నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఈనెల 31న మధిరలో ఆ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ఇంటింటికీ కాంగ్రెస్ పేరుతో ప్రచారం చేయనున్నారు. ఇక నవంబర్ 5న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి ప్రారంభమయ్యే టీపీసీసీ ప్రచార యాత్ర నవంబర్ 11వ తేదీన పినపాక నియోజకవర్గంలో ముగియనుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించేలా ప్రచార పర్యటనను ఖరారు చేశారు. ఈనెల రెండో వారంలో ఈ పర్యటన ఉండాల్సి ఉండగా.. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన, ఇతర కార్యక్రమాల వల్ల జిల్లా ప్రచార యాత్ర అప్పుడు వాయిదా పడింది. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉందని భావిస్తున్న పార్టీ నేతలు జిల్లా పర్యటనపై ప్రత్యేక దృష్టి సారించారు. 5వ తేదీ నుంచి ప్రచార యాత్ర ప్రారంభం కానుండగా.. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సైతం ఖరారు చేసే అవకాశం ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో కాం గ్రెస్ ఖరారు చేసిన అధికారిక అభ్యర్థులు ప్రచారంలో పాల్గొననున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నవం బర్ 9, 10 తేదీల్లో ప్రచారానికి విరామం ప్రకటించిన టీపీసీసీ ప్రచార కమిటీ.. మళ్లీ 11వ తేదీన ఉమ్మడి ఖ మ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నది. సూర్యాపేట నుంచి ఖమ్మంలోకి.. నవంబర్ 5న ఉదయం సూర్యాపేట జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించగానే.. పాలేరులో రోడ్‌షో చేపట్టనున్నారు. అనంతరం సభ నిర్వహించి కూసుమంచిలో రోడ్‌షో ద్వారా ఖమ్మం నగరానికి చేరుకోనున్నారు. ఖమ్మంలో రోడ్‌షో నిర్వహించి ఆయా వీధుల్లో సభలు నిర్వహించనున్నారు. నవంబర్ 7న మధిర నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం నియోజకవర్గ కేంద్రమైన వైరాలో రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. తల్లాడ లో రోడ్ షోతోపాటు సభ నిర్వహించనున్నారు. రాత్రి సత్తుపల్లిలో రోడ్‌షో, సభ నిర్వహించనున్నారు. నవంబ ర్ 8న అశ్వారావుపేటలో రోడ్ షో నిర్వహించడంతోపాటు అదేరోజు మధ్యాహ్నం కొత్తగూడెంలో రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం ఇల్లెందుకు వెళ్లి అక్కడ రోడ్‌షో, సభ నిర్వహించనున్నారు. 9, 10 తేదీల్లో ప్రచార యాత్రకు విరామం ప్రకటించిన కమిటీ 11వ తేదీన మళ్లీ జిల్లాలోనే తమ ప్రచార పర్వాన్ని కొనసాగించనున్నది. నవంబర్ 11న ఉదయం భద్రాచలంలో రోడ్‌షో, సభ, మధ్యాహ్నం పినపాక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి.. సాయంత్రం రోడ్‌షో, సభ నిర్వహించే విధంగా పర్యటనను ఖరారు చేశారు. అన్ని సభల్లోనూ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, సినీ నటి విజయశాంతి, మాజీ మంత్రి డీకే.అరుణతోపాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, జిల్లా నాయకులు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ అందరికన్నా ముందుగా తమ పార్టీ పోటీ చేసే స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో ఆయా అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించడంతోపాటు నియోజకవర్గంలోని పలు మండలాలను, గ్రామాలను చుట్టొచ్చి టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఎవరనే అంశం తేలకపోవడం, మహాకూటమికి సంబంధించి జిల్లాలో పొత్తుల లెక్క కొలిక్కి రాకపోవడం వంటి కారణాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు ప్రచార సభలు దోహదపడతాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రచార యాత్ర తమ ప్రాంతాలకు వచ్చే నాటికి అభ్యర్థుల ప్రకటన సైతం జరిగే అవకాశం ఉండడంతో కార్యకర్తల్లో, ద్వితీయ శ్రేణి నేతల్లో ఉత్సాహం నింపినట్లు అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో తలపెట్టిన పీసీసీ ప్రచార యాత్రను విజయవంతం చేసేందుకు పీసీసీ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్చార్జ్ని నియమించింది. పాలేరుకు సయ్యద్ నిజాముద్దీన్, ఖమ్మం సంధ్యారెడ్డి, బోనకల్ విజయ్‌కుమార్‌నాయుడు, మధిర జనక్‌ప్రసాద్, వైరాకు డాక్టర్ కేటూరి వెంకటేష్, కల్లూరుకు మన్నె క్రిశాంక్, అశ్వారావుపేటకు పున్నా కైలాష్‌నేత, కొత్తగూడెం కేవీఎన్ రెడ్డి, ఇల్లెందుకు రామచంద్రారెడ్డి, భద్రాచలంకు జె.శ్రీనివాసరెడ్డి, పినపాకకు ఎన్.సునీతారావులను పార్టీ ఇన్చార్జిలుగా నియమించింది. కూటమికే పట్టం కట్టండి : భట్టి విక్రమార్క నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది. ఇన్నాళ్లు ప్రజలను మభ్యపెట్టుకుంటూ కాలం వెళ్లదీసింది. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడింది. అటువంటి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులను గెలిపించేందుకు విస్తృతంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నాం. కాంగ్రెస్‌కు ఖమ్మం జిల్లా అనుకూలంగా ఉండడంతో ప్రచార సభలు, యాత్రలను నియోజకవర్గాల వారీగా చేపట్టనున్నాం. మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రచార సభలను నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలి. -
అణిచివేత ఉన్న చోటే తిరుగుబాటు : విజయశాంతి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదనటం సరికాదని, అణిచివేత ఉన్నచోట తిరుగుబాటు ఏర్పడుతుందని కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి వ్యాఖ్యానించారు. గురువారం ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారామె. వరంగల్ బిడ్డలు శృతి, సాగర్ల రాక్షసత్వ హత్యలకు ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం వద్ద సమాధానం లేదని అన్నారు. చంపటం తప్పేనని, అయితే ప్రభుత్వాలకు ఆ విషయంలో మినహాయింపు లేదని స్పష్టం చేశారు. సమస్యను సామాజిక, ఆర్థిక కోణంలో కాకుండా శాంతి భద్రతల అంశంగా పరిగణించినంత వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయనేది చరిత్ర చెబుతున్న సత్యంగా పేర్కొన్నారు. చర్చలే సరైన శాశ్వత పరిష్కారమని, ఆ దిశగా ప్రయత్నించటం నిజంగా ప్రజాహితమన్నారు. మెదక్ పార్లమెంట్‌లోని సిద్దిపేట మినహా వేరే ఏ అసెంబ్లీ సీటు కూటమిలో ఇస్తే పార్లమెంట్ సీటు గల్లంతు అవుతుందని అన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు తప్ప కూటమి అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఏ పరిస్థితిలోనూ కూటమికి ఇస్తే అంగీకరించే పరిస్థితి లేదని ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజాగ్రహంలో కొట్టుకుపోవాల్సిందే!
కొల్లాపూర్: ‘మీరు ఇష్టం వచ్చినట్టల్లా దోచుకుతింటుంటే.. చూస్తూ కూర్చోవడానికి ప్రజలేం అమాయకులు కారు.. ప్రజలు కన్నెర్రజేస్తే ఆ ఆగ్రహంలో మీరు కొట్టుకుపోవాల్సిందే..’ అంటూ టీఆర్ఎస్ నాయకుల తీరుపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీపీసీసీ ఆధ్వర్యాన చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా శుక్రవారం కొల్లాపూర్, అచ్చంపేటలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభలు, రోడ్డు షోల్లో భట్టి విక్రమార్కతోపాటు ఎంపీ నంది ఎల్లయ్య, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, ప్రచార కమిటీ కోచైర్మన్ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ మేరకు హెలీక్యాప్టర్‌లో వచ్చిన నాయకులకు కొల్లాపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యాన పలువురు స్వాగతం పలికారు. రోడ్డు షో నిర్వహిస్తూ కొల్లాపూర్ రాజావారి బంగ్లా ఎదుట ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకున్నారు. కొల్లాపూర్‌తో ఎంతో అనుబంధం కొల్లాపూర్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. మాజీ ఎంపీ మల్లు అనంతరాములు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చాననని గుర్తుచేశారు. జూపల్లి కృష్ణారావు రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టే కారణమని, ఈ విషయాన్ని ఆయన మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మంత్రిగా ఉండి కొల్లాపూర్‌కు పరిశ్రమలు తేలేదని, స్వార్థ ప్రయోజనాల కోసం కేఎల్ఐ ప్రాజెక్టు పనులు ఆలస్యంగా పూర్తయ్యేందుకు కారణమయ్యారన్నారు. కేఎల్ఐ ప్రాజెక్టును వైఎస్ఆర్ హయాంలో ప్రారంభించారని, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేశారన్నారు. అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను పూర్తిచేసి ప్రాజెక్టు మొత్తం టీఆర్ఎస్సే పూర్తిచేసిందనే రీతిలో ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొల్లాపూర్ అభివృద్ధి కోసం సోమశిల బ్రిడ్జిని నిర్మిస్తామని, కొల్లాపూర్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తామని, జీఓ 98 అమలు చేసి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని, అటవీ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సోనియా రుణం తీర్చుకుందాం ‘తెలంగాణ ఉద్యమం చేసినందుకు కేసీఆర్‌కు ఒ కసారి ఓటేశారు.. ఇప్పు డు తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు ఓటేసి ఆ తల్లి రుణ తీర్చుకుందాం’ అని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రజలను కోరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని సభ్యత, సంస్కారం లేకుండా టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సోని యాగాంధీ ప్రజల బాగుకోరి తెలంగాణ ఇస్తే.. కేసీఆర్‌ను దాన్ని తన అవసరాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ను గద్దె దించాలి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలంతా పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తన ఆస్తిగా కేసీఆర్ కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నారన్నారు. కొల్లాపూర్ ప్రజల హక్కుల కోసం బీరం హర్షవర్ధన్‌రెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ప్రజా సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ పాల మూరు జిల్లాలోని అన్ని స్థానాలతోపాటు, కొల్లాపూర్‌లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సోమశిల బ్రిడ్జి మా హక్కు అని.. దాన్ని సాధించుకునేందుకు ఎంత పోరాటమైనా చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బ్రిడ్జిని నిర్మిస్తామన్నారు. కొల్లాపూర్‌లో సంబరాల నిర్వహణకు జూపల్లి కృష్ణారావు రూ.5 కోట్లు ఖర్చు చేశారని, దీని పై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టాలన్నారు. రత్నగిరి ఫౌండేషన్‌కు వస్తున్న విరాళాల వివరాలపై కూడా విచారణ జరపాలన్నారు. సభలో ఏపూరి సోమన్న ఆటపాటలతో అలరించగా.. పార్టీ రాష్ట్ర నాయకులు దేవని సతీష్ మాదిగ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, టీపీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు రంగినేని జగదీశ్వరుడు, జగన్మోహన్రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఓయూ నాయకులు వెంకటేష్, నాయకులు జగదీశ్వర్‌రావు, రత్నప్రభాకర్‌రెడ్డి, జంబులయ్య, గాలియాదవ్, రామచందర్‌యాదవ్, కిషన్‌నాయక్, వేణుగోపాల్‌యాదవ్, మతీన్ అహ్మద్, శ్రీధర్‌రెడ్డి, గణేశ్‌రావు పాల్గొన్నారు. ‘అందిన కాడికి దోచుకున్నారు’ అచ్చంపేట: ప్రజలు అమాయకులు కాబట్టే 2014 ఎన్నికల్లో కేసీఆర్‌ను నమ్మి ఓట్లు వేస్తే అందిన కాడికి దోచుకున్నారని స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి అన్నారు. అచ్చంపేట కూమరస్వామి రైస్‌మిల్లు ఆవరణలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగ్రహ సభ ఏర్పాటు చేశారు. హెలీక్యాప్టర్‌లో ఎన్టీఆర్ స్టేడియం చేరుకున్నా కాంగ్రెస్ అగ్రనేతలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుషో ద్వారా బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి విజయశాంతి మాట్లాడుతూ కేసీఆర్ ఓటును డబ్బుతో కొని అధికారంలోకి రావాలని చూస్తున్నారని, టీఆర్ఎస్ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని కాంగ్రెస్ ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. మీ అభిమానం చూస్తే కాంగ్రెస్‌కు అధికారం ఖాయమనిపిస్తుందని, మీ బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలోకి తేవడం తప్ప మరో మార్గం లేదన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ పాలమూరు జిల్లాను అధికార పార్టీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద వి విధ పథకాలు అమ లు చేస్తామ న్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు డాక్టర్ అనురాధ, సరిత, ధర్మానాయక్, ఎంïపీపీలు భాగ్యలక్ష్మి, సుదర్శన్, శారదమ్మ, చంద్రమోహన్, రామ్మోహన్, రఘునాయక్, అనంతరెడ్డి, గోపాల్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. జూపల్లికి కాంగ్రెస్తోనేరాజకీయ భిక్ష ‘బ్యాంకు ఉద్యోగి అయిన జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసింది కాంగ్రెస్. ఇప్పుడు ఆ పార్టీనే ఆయన తిడుతున్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం జూపల్లి’ అని డీకే అరుణ విమర్శించారు. ‘నాకు రాజకీయ భిక్ష పెట్టానని చాలాసార్లు చెప్పారు. ఆయన నాకు భిక్ష పెట్టలేదు. పాన్గల్లో జెడ్పీటీసీగా పోటీచేసినప్పుడు నన్ను ఓడించడానికి కుట్ర చేశారు. అక్కడి ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు. జూపల్లికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్’ అని ఆమె అన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లిచ్చిన తర్వాతనే ఓట్లడుగుతానని కేసీఆర్ ప్రకటించారు. మరి ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఓట్లెలా అడుగుతారని ఆమె ప్రశ్నించారు. కొల్లాపూర్ ప్రజలను ప్రతిసారి మోసం చేసి గెలుస్తున్న జూపల్లిని ఈసారి ఓడించాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 25 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామన్నారు. -
విజయవాడలో బాలిక అదృశ్యం
-
చిరంజీవి అభిప్రాయం సరైనదే: విజయశాంతి
హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి సినీనటి విజయశాంతి మద్దతు తెలిపారు. కాపు రిజర్వేషన్లు, కార్పొరేషన్‌పై చిరంజీవి అభిప్రాయం సరైనదే అని ఆమె సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు బీసీలకు నష్టం వాటిల్లకుండా కాపుల సమస్యను పరిష్కరించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. కాగా కాపులను బీసీల్లో చేర్చేలా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిరంజీవి బహిరంగ లేఖ రాసిన విషయం విదితమే. మరోవైపు సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా కాపు గర్జనలో జరిగన హింసాత్మక ఘటనపై స్పందించారు. -
సర్వేకు పవన్ కళ్యాణ్, విజయశాంతి నిరాకరణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు ఇచ్చేందుకు సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిరాకరించారు. ఆయనతోపాటు.. విజయశాంతి కూడా సర్వే వివరాలు ఇవ్వడానికి తిరస్కరించారు. వారి నుంచి మరోసారి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని ఆ ప్రాంతానికి వెళ్లిన ఎన్యుమరేటర్లు తెలిపారు. కాగా, హైదరాబాద్ నగరంలో 30 శాతం వరకు సర్వే పూర్తయిందని, మొత్తం సర్వేను మంగళవారమే పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉందని, సర్వేపై పూర్తి వివరాలను గవర్నర్‌కు అందజేశానని ఆయన అన్నారు. సమగ్ర సర్వేలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఉదయం 7 గంటల నుంచి అన్ని డివిజన్లలో సర్వే ప్రారంభమైందని తెలిపారు. సర్వేతో ఇబ్బందిపడుతున్న ప్రజలనుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నామని, 24 గంటలు పనిచేసే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌తోపాటు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎస్కేఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డివిజన్ నంబర్ టైప్‌చేసి స్పేస్ ఇచ్చి సమస్యను టైప్ చేసి 9177999876 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాలని ఆయన సూచించారు. -
బీజేపీలోకి విజయశాంతి, జగ్గారెడ్డి?
సాక్షి, హైదరాబాద్: మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇరువురు నేతలు బీజేపీ జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీఎం కేసీఆర్ మెదక్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. విజయశాంతి ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు జగ్గారెడ్డిని టీడీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నా ఆయన మాత్రం బీజేపీవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. విజయశాంతి, జగ్గారెడ్డి పూర్వాశ్రమంలో బీజేపీలో పనిచేసినవారే. ఇరువురు నేతలకు ఆ పార్టీ జాతీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఇరువురు భావిస్తున్నారు. అయితే వీరిద్దరి రాకను బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఈ నేతల రాక వల్ల బీజేపీకి పెద్దగా ప్రయోజనం చేకూరదని చెబుతోంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
గీతా...అరుణ....జయ...విజయ...
ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన తెలంగాణ సీనియర్ నేతలకు ...కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, చినబాబు రాహుల్ గాంధీ అనుకోని రీతిలో ఝలక్ ఇచ్చారు. తెలంగాణకు దళితుడిని సీఎంను చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటిస్తే.... బీసీ ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు ముందుకు వెళుతుంటే.... యువరాజు తాజాగా తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి మహిళ కావాలన్నది తన కోరిక అని బాంబు పేల్చారు. దీంతో సీఎం పోస్ట్‌పై ఆశలు పెట్టుకున్న టీ.కాంగ్రెస్ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. అవకాశం ఉంటే తనకు ముఖ్యమంత్రి పదవి కూడా రావచ్చేమోనని చెప్పిన వి.హనుమంతరావు రాహుల్ సభలో జరిగిన అవమానంతోనే దానిపై ఆశలు వదిలేసుకున్నారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ ప్రకటనతో అప్పుడే తెలంగాణలో చర్చలు జోరందుకున్నాయి. గీత... అరుణ... జయసుధ.... విజయశాంతి, సునీత లక్ష్మారెడ్డి ఇలా అనేక పేర్లు తెరమీదకు వచ్చేశాయి. తెలంగాణ మహిళా నేతలలో మాజీ మంత్రి గీతారెడ్డి బాగా సీనియర్. ఓ దశలో ఆమె ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీ పడిన విషయం తెలిసిందే. రాహుల్ తాజా ప్రకటనతో ఆమెకు సీఎం పదవిపై ఆశలు పెరిగాయి. గద్వాల్ మహిళా నేత, మరో మాజీమంత్రి డీకే అరుణ కూడా తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు అప్పట్లో ఫీలర్లు వదిలారు. ఇక సినీరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జయసుధ, అలాగే ఇటీవలే కారును వదిలి చేయందుకున్న విజయశాంతి పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్నాయి. అలాగే మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా సీఎం అభ్యర్థి జాబితాలో ఉన్నా.. ఎంతవరకూ అవకాశం దక్కుతుందో చూడాలి. ఏమో గుర్రం ఎగురా వచ్చు ...అన్నట్లు తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరికి వరిస్తుందో చూడాలి మరి. -
ఎలక్షన్లు, కలెక్షన్లు వారికి అలవాటు:విజయశాంతి
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విజయశాంతి మెదక్ , న్యూస్‌లైన్: టీఆర్ఎస్ దొంగల పార్టీ అని, ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే దొంగ చేతికి తాళం చెవి ఇచ్చినట్లేనని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి విమర్శించారు. బుధవారం ఆమె మెదక్ మండలంలోని ముత్తాయికోట, పోచంపల్లి, ఫరీద్పూర్, పోచమ్మరాల్, జక్కన్నపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ కేవలం ఎలక్షన్లు, కలెక్షన్లకు అలవాటు పడిందన్నారు. జక్కన్నపేటలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి వారు జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న విజయశాంతి ఆవేశంతో ఊగిపోయారు. అసలు టీఆర్ఎస్ వాళ్లకు మ్యానర్స్ ఉందా? అని ఘాటుగా స్పందించారు. -
కేసీఆర్‌వి నీచ రాజకీయాలు: విజయశాంతి
చిన్నశంకరంపేట టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి విమర్శించారు. శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దనడం కేసీఆర్ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్ఎస్ను విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ముఖ్యమంత్రి కుర్చీపై వ్యామోహంతోనే కాంగ్రెస్‌కు ఎదురు నిలిచారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఓడిపోవాలని యాగాలు చేయడం తగదు -
సీఎంతో భేటీ కానున్న విజయశాంతి
హైదరాబాద్ : మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సోమవారం భేటీ కానున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆమెను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. చాలాకాలం నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్న ఆమె ఇక త్వరలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో ఢిల్లీలో సమావేశం కావడంతో ఆ పార్టీలో చేరికపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మెదక్ ఎంపీ విజయశాంతి పార్టీని వీడే అంకానికి అధినేత సస్పెన్షన్‌తో ముగింపునిచ్చారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడతున్న క్రమంలోనే విజయశాంతి పార్టీని వీడతారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరేందుకు విజయశాంతి మంతనాలు సాగించిందనే పక్కా సమాచారంతో సస్పెన్షన్ వేటు వేశారు. ‘తల్లి తెలంగాణ’ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయశాంతి 2009 సాధారణ ఎన్నికలకు ముందు తాను స్థాపించిన సంస్థను టీఆర్ఎస్లో విలీనం చేసింది. -
ముగ్గురు నేతల ముచ్చట్లు
మామూలుగా ఇద్దరు మాట్లాడుకుంటే అందులో విచిత్రం ఏమీ ఉండదు. అదే ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నారంటే మాత్రం దానిపై ఎక్కడలేని ఆసక్తి పుట్టుకొస్తుంది. అదే, నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న వాళ్లు ఇప్పుడు ఉన్నట్లుండి ఆప్యాయంగా మంతనాలు జరుపుకొంటున్నారంటే... ఇక దాని సంగతి చెప్పనే అక్కర్లేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు గుప్పించుకోవటం... ఆనక మిత్రులుగా మారటం పరిపాటే. విభజన ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో చెప్పలేనన్ని మార్పులు సంభవించాయి. తాజాగా ముగ్గురు నేతలు విడివిడిగా సాగిస్తున్న భేటీలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ... కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో భేటీ అయితే... ఇటీవలే 'కారు' దిగి హస్తానికి స్నేహహస్తం చాచిన ఎంపీ విజయశాంతి రక్షణ మంత్రి ఏకే అంటోనీతో సమావేశమయ్యారు. మరోవైపు తెలంగాణ విషయంలో తెర వెనక నుంచి రాజకీయాలు నడుపుతున్న కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆహ్వానంపైనే ఆమె నివాసంలోనే కలిసి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని గురించి చర్చించినట్లు సమాచారం. రాయలసీమలోని రెండు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంపై వారు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించి యూపీఏ కూటమి నుంచి వైదొలగిన మజ్లిస్ అధినేతతో సోనియా ప్రత్యేకంగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి అత్యంత చేరువైపోయిన మెదక్ ఎంపీ విజయశాంతి.. రక్షణ మంత్రి, విభజన కమిటీ పెద్ద ఏకే ఆంటోనీతో భేటీ అయ్యారు. రాష్ట్ర సంబంధిత అంశాలపై సుమారు 10 నిమిషాల పాటు చర్చించారు. విభజన నిర్ణయానంతరం తెలంగాణలో రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న మద్దతు గురించి వివరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలు పలువురు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తి సానుకూల ఫలితాలు వస్తాయని విజయశాంతి తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సీమాంధ్రలో ఆందోళనల కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై కూడా రాములమ్మ సూచనలు చేసినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నిన్న రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. దాదాపు 25 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, సీమాంధ్రలో ఆందోళనలు, ఇతర రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ సోనియాగాంధీని కలిసిన తరుణంలో జైపాల్‌రెడ్డి గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతమయ్యే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్, శాంతిభద్రతల అంశాన్ని కేంద్ర పరిధిలోకి తేవటం తదితర డిమాండ్ల నేపథ్యంలో.. వారి మధ్య ఈ అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం. ఈ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యత ఏమీ లేదని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ.. రాష్ట్ర విభజన ప్రకటన తరువాత జైపాల్‌రెడ్డి గవర్నర్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
కాంగ్రెస్‌లో చేరనున్న రాములమ్మ?
మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆమెను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. చాలాకాలం నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్న ఆమె ఇక త్వరలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో ఢిల్లీలో సమావేశం కావడంతో ఆ పార్టీలో చేరికపై మరింత స్పష్టత వచ్చింది. సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం. రంగారెడ్డి ద్వారా దిగ్విజయ్‌ను కలుసుకోవడం కూడా చర్చనీయాంశమైంది. కాం గ్రెస్ పార్టీలో చేరికకు ఏది సరైన సమ యం?, ఎలా చేరాలనే అంశాలపై ఈ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి దిగ్విజయ్‌సింగ్ సైతం కొన్ని సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారాన్ని తెలిపిన తర్వాత కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై అందరి చూపు కేంద్రీకృతమై ఉంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం ద్వారా పార్టీని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. టీఆర్ఎస్ నుంచి సస్పెండైన జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునందన్ రావు కూడా దిగ్విజయ్ సింగ్‌ను కలుసుకున్న వారిలో ఉన్నట్టు సమాచారం. ఆంటోని కమిటీతో జిల్లా ప్రజాప్రతినిధుల భేటీ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సోమవారం రాత్రి ఆంటోని కమిటీతో సమావేశమై ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించింది. ఈ భేటీలో పాల్గొన వారిలో డిప్యూటీ సీఎం దామోదర, మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, నర్సారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆంటోని కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. -
టీఆర్ఎస్కు పది సీట్లు మించిరావు: విజయశాంతి
వచ్చే 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)పార్టీకి పది సీట్లు మించి రావని మెదక్ ఎంపీ విజయశాంతి అభిప్రాయపడ్డారు. సోమవారం 'సాక్షి'తో మాట్లాడిన విజయశాంతి పలు విషయాలను వెల్లడించారు. ఉద్యమంలో క్రెడిట్ అంతా కేసీఆర్ అంటే తాను ఒప్పుకోనని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం నడవడానికి అనేక మంది తెలంగాణ వాదులు ప్రాణ త్యాగాలు చేశారన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు షోకాజ్ నోటీస్ అందిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని విజయశాంతి తెలిపారు. తెలంగాణ సాధన టీఆర్ఎస్ గొప్పదనమే అని చెప్పకపోగా, తెలంగాణ అమరవీరులదే ఆ ఘనత అని విజయశాంతి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. టీఆర్ఎస్ అధినాయ కత్వంతో ఆమెకు దూరం పెరిగిందనేది స్పష్టమ వుతోంది. కాగా తెలంగాణ ఏర్పాటుకోసం టీఆర్ఎస్ కంటే తానే ఎక్కువగా కష్టపడ్డానని గతంలోనే ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఘనత ఏ రాజకీయపార్టీదో కాదని, ప్రాణాలను అర్పించిన అమరవీరులదే అని వ్యాఖ్యానించారు. అధికార రాజకీయాల చుట్టూ తిరిగే పార్టీలకు తాను క్రెడిట్ ఇవ్వదలచుకోలేదని, త్యాగాలు చేసిన అమరులకే క్రెడిట్ ఇస్తానని అన్నారు. తెలంగాణ కోసం తాను 16 ఏళ్లుగా కష్టపడ్డానని, టీఆర్ఎస్ 13 ఏళ్లుగానే, పోరాడుతోందని అన్నారు. తెలంగాణకోసం టీఆర్ఎస్ కంటే తానే ఎక్కువగా కష్టపడ్డానన్నారు. 2014 ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననే విషయంపై ఇప్పుడే మాట్లాడలేనన్నారు.