
కేసీఆర్‌వి నీచ రాజకీయాలు: విజయశాంతి
టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి విమర్శించారు.
చిన్నశంకరంపేట టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి విమర్శించారు. శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దనడం కేసీఆర్ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ముఖ్యమంత్రి కుర్చీపై వ్యామోహంతోనే కాంగ్రెస్‌కు ఎదురు నిలిచారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.
ఓడిపోవాలని యాగాలు చేయడం తగదు