బీజేపీలోకి విజయశాంతి, జగ్గారెడ్డి? | jagga reddy and vijayasanthi to join in bjp? | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి విజయశాంతి, జగ్గారెడ్డి?

Published Sat, Jul 26 2014 12:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీలోకి విజయశాంతి, జగ్గారెడ్డి? - Sakshi

బీజేపీలోకి విజయశాంతి, జగ్గారెడ్డి?

మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

సాక్షి, హైదరాబాద్: మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇరువురు నేతలు బీజేపీ జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీఎం  కేసీఆర్ మెదక్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. విజయశాంతి ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు జగ్గారెడ్డిని టీడీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నా ఆయన మాత్రం బీజేపీవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

విజయశాంతి, జగ్గారెడ్డి పూర్వాశ్రమంలో బీజేపీలో పనిచేసినవారే.  ఇరువురు నేతలకు ఆ పార్టీ జాతీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఇరువురు భావిస్తున్నారు. అయితే వీరిద్దరి రాకను బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఈ నేతల రాక వల్ల బీజేపీకి పెద్దగా ప్రయోజనం చేకూరదని చెబుతోంది.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement