వారిని బంతాట ఆడుకుంటా: జగ్గారెడ్డి
మెదక్: ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, జగ్గారెడ్డిల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణ కేసీఆర్, హరీష్‌రావుల జాగీరుకాదని జగ్గారెడ్డి అన్నారు. త్వరలో తాను అధికారం చేపట్టబోతున్నానని జగ్గారెడ్డి తెలిపారు.
తాను అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ నేతలతో బంతాట ఆడుకుంటానని జగ్గారెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ బెదిరిస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. నర్సాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ చేసిన విమర్శలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు.