
హైదరాబాద్: ముఖ్యమంత్రి పీఠం కోసం టీఆర్‌ఎస్ పార్టీలో ఐదు కుర్చీలాట జరుగుతోందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. మానవ అక్రమ రవాణా కేసులో కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం ఆయన మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసేందుకు వచ్చారు. జగ్డారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, సంతోశ్, కవిత, హరీష్‌రావులు రాష్ట్రాన్ని తమ జాగీరు అనుకుంటూ ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్నారని మండిపడ్డారు.
దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మంతనాలు జరిపారని, అందుకు తానే సాక్షినని చెప్పారు. ప్రత్యర్థి పార్టీల నేతలను జైలుకు పంపి కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా అధికారులందరూ కేసీఆర్ ఆదేశాల ప్రకారమే నడుస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు స్వేచ్ఛ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థులపై నిఘా పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment