
చిరంజీవి అభిప్రాయం సరైనదే: విజయశాంతి
కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి సినీనటి విజయశాంతి మద్దతు తెలిపారు.
హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి సినీనటి విజయశాంతి మద్దతు తెలిపారు. కాపు రిజర్వేషన్లు, కార్పొరేషన్పై చిరంజీవి అభిప్రాయం సరైనదే అని ఆమె సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు బీసీలకు నష్టం వాటిల్లకుండా కాపుల సమస్యను పరిష్కరించాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
కాగా కాపులను బీసీల్లో చేర్చేలా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిరంజీవి బహిరంగ లేఖ రాసిన విషయం విదితమే. మరోవైపు సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా కాపు గర్జనలో జరిగన హింసాత్మక ఘటనపై స్పందించారు.