
టాలీవుడ్‌కి సంక్రాంతి తర్వాత సమ్మర్ మంచి సీజన్. వేసవి సెలవుల్లో పలు పెద్ద సినిమాలతో పాటు మీడియం, చిన్న చిత్రాలు కూడా విడుదల అవుతుంటాయి. స్కూల్, కాలేజీ పిల్లలకు సెలవులు ఉండడంతో వారిని టార్గెట్ చేస్తూ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. అయితే ప్రతి సమ్మర్‌కి కనీసం రెండు, మూడు పెద్ద సినిమాలైనా సందడి చేసేవి. కానీ ఈ సారి మాత్రం యావరేజ్ సినిమాలతోనే సరిపెట్టుకోవాలేమో. సమ్మర్‌లో సందడి చేస్తామని చెప్పిన మెగా హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్‌కి హ్యాండిచ్చేలా కనిపిస్తోంది. వీరితో పాటు ప్రభాస్ కూడా వేసవి సీజన్‌కి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ‘విశ్వంభర’ మూవీ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ కొడుకు రామ్ చరణ్ కోసం చిరు వెనక్కి తగ్గాడు. దీంతో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’సంక్రాంతికి రిలీజైంది. కానీ చిరంజీవి చేసిన త్యాగానికి గేమ్ ఛేంజర్ న్యాయం చేయలేకపోయింది. అది పక్కన పెడితే.. విశ్వంభర సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ మేకర్స్ మళ్లీ మనసు మార్చుకున్నారట. సమ్మర్‌లో కాకుండా.. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే సమ్మర్‌లో చిరును తెరపై చూడడం కష్టమే.
మరోవైపు పవన్ కల్యాణ్(Pawan Kalyan ) ‘హరిహర వీరమల్లు’ కూడా రిలీజ్‌ని వాయిదా వేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఇంకా షూటింగ్ జరుగుతోంది. పవన్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉందట.ఈ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. వీఎఫెక్స్ వర్క్ కూడా పెండింగ్‌లోనే ఉంది. ఈ లెక్కన ఈ చిత్రం కూడా వేసవిలో రిలీజ్ అవ్వడ కష్టమే అంటున్నారు సినీ పండితులు.
ఇక మెగా ఫ్యామిలీ హ్యాండిచ్చినా.. ప్రభాస్ అయినా సమ్మర్‌లో ఎంటర్‌టైన్ చేస్తారనుకుంటే.. అది కూడా కష్టమే అంటున్నారు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదట. ఈ చిత్రాన్ని ముందు చెప్పినట్లుగా ఏప్రిల్‌లో రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. జూన్ లేదా జులైలో ఈ చిత్రం రిలీజయ్యే అవకాశం ఉంది. ఇలా పెద్ద సినిమాలన్నీ తమ విడుదలను వాయిదా వేసుకుంటే.. యావరేజ్, చిన్న చిత్రాలు మాత్రం రిలీజ్‌కు రెడీ అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment