Vishwambhara Movie
-
సంక్రాంతికే 'గేమ్ ఛేంజర్'.. ‘విశ్వంభర' త్యాగం
-
షాపులో నగలన్నీ చిరంజీవి హీరోయిన్ ఒంటిపైనే! (ఫొటోలు)
-
విశ్వంభర గ్రాఫిక్స్ పై చిరు కు బిగ్ టెన్షన్..!
-
పొంగల్ పోరు.. సీన్ మారుతోంది!
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే చాలా స్పెషల్. వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి దాదాపు అన్ని సినిమాల వసూళ్లు బాగుంటాయి. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది హీరోలు, దర్శక – నిర్మాతలు వారి సినిమాలను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని పోటీ పడుతుంటారు. కానీ ఫైనల్‌గా బెర్త్ కొంతమందికే దొరుకుతుంది. 2025 సంక్రాంతి సమయం సమీపిస్తున్న తరుణంలో సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఆయా చిత్రబృందాలు రెడీ అవుతున్నాయి. కానీ ఆల్రెడీ సంక్రాంతికి ప్రకటించిన సినిమాలు థియేటర్స్‌లోకి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి స్థానంలో వేరే సినిమాలు సంక్రాంతికి సై అంటున్నాయి. ఇలా సంక్రాంతి సినిమా సీన్ మారుతోంది. ఇక 2025 సంక్రాంతి బాక్సాఫీస్ పోరులోకి వెళదాం.సంక్రాంతికి వస్తున్నాం... కానీ! ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే వర్కింగ్ టైటిల్‌ని పెట్టుకుని మరీ వెంకటేశ్ అండ్ టీమ్ వర్క్ చేస్తున్నారంటే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని యూనిట్ ఎంతటి కృతనిశ్చయంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, అతని భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ఇదిలా ఉంటే... మరోవైపు ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మరో చిత్రం ‘గేమ్ చేంజర్’ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సంక్రాంతి పండక్కి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా స్పేస్ ఉంటుంది కాబట్టి తమ బేనర్లోని ఈ రెండు చిత్రాలనూ ‘దిల్’ రాజు పండగ బరిలో దింపుతారని ఊహించవచ్చు. ఆఫీసర్ వస్తారా? ఈ ఏడాది సంక్రాంతి సమయంలో రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా థియేటర్స్‌లోకి రావాల్సింది. కానీ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల నిర్మాతల రిక్వెస్ట్, వివిధ సమీకరణాల నేపథ్యంలో ‘ఈగల్’ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకుని, ఫిబ్రవరిలో విడుదలైంది. దీంతో 2025 సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలని రవితేజ ప్లాన్ చేశారు. రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ, హీరో రవితేజ ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాను 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు తగ్గట్లుగానే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో రవితేజ భుజానికి గాయమైంది. దాంతో ఈ సినిమా చిత్రీకరణ సజావుగా సాగలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? లేదా అనే విషయంపై మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. ‘ధమాకా’ సినిమా తర్వాత రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరి పాత్రలో రవితేజ నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. గేమ్ చేంజర్ రెడీ సంక్రాంతి బరికి సిద్ధమయ్యారు రామ్‌చరణ్. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తొలుత 2024 క్రిస్మస్కి రిలీజ్ చేయాలనుకున్నారు ‘దిల్’ రాజు. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాల ట్రేడ్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ సూచనల మేరకు ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్‌ను 2024 క్రిస్మస్ నుంచి 2025 సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా నిర్మాత ‘దిల్’ రాజు ఇటీవల ఓ వీడియోలో వెల్లడించారు. 2025 జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక ‘గేమ్ చేంజర్’ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, నవీన్‌చంద్ర, ఎస్జే సూర్య, జయరాం, సునీల్, ప్రియదర్శి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ఇది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ల విధులు, హక్కులు, వారికి ఉండే ప్రత్యేక అధికారాలు వంటి అంశాల నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ ఉంటుందని టాక్.నార్త్ ఇండియాలో... ఈ సంక్రాంతి పండక్కి బాలకృష్ణ 109వ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. కేఎస్ రవీంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ దీపావళి సందర్భంగా టైటిల్, రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తారని, కథకు నార్త్ ఇండియా నేపథ్యం ఉంటుందని, విలన్‌గా బాబీ డియోల్, ఓ పోలీసాఫీసర్ పాత్రలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మజాకా ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్స్‌లో ‘మజాకా’ సెలబ్రేషన్స్ ఖాయం అంటున్నారు హీరో సందీప్ కిషన్. రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తీసిన నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మజాకా’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్న చిత్రం ఇది. మహేంద్రగిరి దేవాలయం సంక్రాంతి వంటి పెద్ద పండక్కి మీడియమ్, స్మాల్ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. ప్రతి సంక్రాంతికి ఇలాంటి చిత్రాలు రెండు అయినా వస్తుంటాయి. ఏ చిత్రం ఆడియన్స్‌కు నచ్చితే అది పెద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఈ కోవలో వస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సుమంత్ హీరోగా, బ్రహ్మానందం మరో లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ఇది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు నిర్మిస్తున్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్ పేర్కొంది.2025 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్ కావాల్సింది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. కానీ ‘విశ్వంభర’ జనవరి 10న రిలీజ్ కావడం లేదు. ‘విశ్వంభర’ సినిమా వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని, రామ్‌చరణ్– ‘దిల్’ రాజుగార్ల కోసం చిరంజీవిగారితో మాట్లాడి ‘విశ్వంభర’ రిలీజ్‌ను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్రదర్శకుడు వశిష్ఠ పేర్కొన్నారు. ఇక ‘విశ్వంభర’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది.అలాగే 2025 సంక్రాంతి సందర్భంగా తాను హీరోగా నటించే ఓ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందన్నట్లు నాగార్జున గతంలో పేర్కొన్నారు. కానీ ఇది సాధ్యపడేలా లేదు. అయితే నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ ఓటీటీ డీల్స్, పర్ఫెక్ట్ రిలీజ్ డేట్స్ వంటి అంశాలను పరిశీలించుకుని ‘తండేల్’ సినిమా సంక్రాంతి రిలీజ్‌పై చిత్రయూనిట్ ఓ స్పష్టతకు వస్తారట. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ బాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో స్ట్రయిట్ చిత్రాలతో పాటు ఒకటీ లేదా రెండు తమిళ హీరోల చిత్రాలు కూడా రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. ఇలా 2025 సంక్రాంతికి అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్స్‌లోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ క్యారెక్టర్లో మూడు వేరియేషన్స్ ఉంటాయి. – ముసిమి శివాంజనేయులు -
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' మూవీ HD స్టిల్స్ (ఫోటోలు)
-
'విశ్వంభర'తో యుద్ధాన్ని పరిచయం చేసిన మెగాస్టార్ (టీజర్)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. దసరా సందర్భంగా మెగా అభిమానుల కోసం చిత్ర యూనిట్ అదిరిపోయే కానుకను ఇచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించారు.చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించేలా ‘విశ్వంభర’ టీజర్ ఉంది. యు.వి.క్రియేషన్స్ పతాకంపై సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ గేమ్ ఛేంజర్ అనూహ్యంగా సంక్రాంతి రేసులోకి రావడంతో విశ్వంభర వాయిదా పడుతుంది. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.బాక్సాఫీస్‌ను షేక్ చేసేలాభోళా శంకర్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని విశ్వంభర కథను చిరంజీవి ఎంపిక చేశారు. ఫ్యాన్స్ కూడా ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. మెగాస్టార్ లుక్‌తో పాటు టీజర్లో కనిపిస్తున్న విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు వశిష్ఠపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునేలా టీజర్ ఉంది. విశ్వంభరతో బాక్సాఫీస్ వద్ద మెగా యుద్ధం తప్పకుండా ఉంటుంది. -
సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'.. దిల్ రాజు ప్రకటన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, దసరా సందర్భంగా మెగా ఫ్యాన్స్‌లో నిర్మాత దిల్‌రాజు జోష్ నింపారు. గేమ్ ఛేంజర్ విడుదల తేదీని అయన అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు స్పష్టతనిచ్చారు.'గేమ్ ఛేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నప్పుడు క్రిస్మస్ కంటే సంక్రాంతి అయితే బావుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్ సీస్‌లోని ఇతర డిస్ట్రిబ్యూటర్స్ అందరం భావించాం. ఈ ఆలోచనను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ సంస్థకు తెలియజేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నామని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభర’ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అందువల్ల సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారితో పాటు యువీ క్రియేషన్స్ సంస్థను అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి విడుదలకు లైన్ క్లియర్ అయింది. విశ్వంభర సినిమా విషయంలో మరో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారు. విశ్వంభర సినిమా కూడా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా నిర్మాణ పనులన్నీ పూర్తి అయ్యాయి. కానీ, నా కోసం, మా సినిమా కోసం వాళ్ల మరో రిలీజ్ డేట్‌కు విశ్వంభర విడుదల చేయటానికి ఒప్పుకున్నారు. అందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి నా ధన్యవాదాలు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను సంక్రాంతి విడుదల చేస్తున్నాం. ఇటు అభిమానులకు, అటు సినీ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నాం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూ ట్యూబ్‌లో మారుమోగిపోతున్నాయి. తర్వాత టీజర్‌తో పాటు మరో మూడు సాంగ్స్ రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజయం సాధించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతికి కలుద్దాం.' అన్నారు.సంక్రాంతికి కలుద్దాం! ❤️🔥✊🏼#GameChanger Global Star @AlwaysRamCharan @shankarshanmugh @MusicThaman @advani_kiara @iam_SJSuryah @actorsrikanth @yoursanjali @Naveenc212@AntonyLRuben @DOP_Tirru @artkolla @HR_3555 @ZeeStudios_ @saregamaglobal @saregamasouth @PharsFilm… pic.twitter.com/57Ht1FRW8m— Sri Venkateswara Creations (@SVC_official) October 12, 2024 -
'విశ్వంభర' టీజర్ తేదీని ఫిక్స్ చేసిన మెగాస్టార్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. దసర సందర్భంగా అభిమానులకు కానుక ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఇదే విషయాన్ని తాజాగా ఒక పోస్టర్‌తో అభిమానులతో పంచుకున్నారు.దసర సందర్భంగా అక్టోబర్ 12న విశ్వంభర టీజర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శనివారం ఉదయం 10:49 గంటలకు ప్రేక్షకులను విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేయనున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి కావస్తుంది.చిరంజీవి ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులను మెప్పించారు. క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి ‘విశ్వంభర’ రెడీ అవుతోంది. ఈ మూవీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. -
చిరంజీవి కాదు.. చరణ్ వస్తున్నాడా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అందుకు తగ్గట్లే షూటింగ్, గ్రాఫిక్స్ పనులన్నీ వేగంగా చేస్తున్నారు. ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నా సరే అనుకోని అవాంతరాలు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి.. చికెన్ గున్యా బారిన పడ్డారు. అయినా సరే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈవెంట్‌కి హాజరైన తనకు దక్కిన పురస్కారాన్ని అందుకున్నారు.(ఇదీ చదవండి: ప్రముఖ ఫోక్ సింగర్‌పై అత్యాచార కేసు.. యువతి ఫిర్యాదు)ప్రస్తుతం చిరంజీవి కోలుకుంటున్నారని, పూర్తిగా సెట్ అవడానికి మరికాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తోంది. దీంతో 'విశ్వంభర' సమాయానికి రెడీ అవ్వకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సంక్రాంతి రేసు నుంచి చిరు సైడ్ అవుతారు. ఇదే గనన జరిగితే 'గేమ్ ఛేంజర్'ని సంక్రాంతి రేసులోకి తీసుకురావాలని దిల్ రాజు భావిస్తున్నారట.ఇప్పటికే సంక్రాంతి రేసులో బాలయ్య, వెంకటేశ్, రవితేజ ఉన్నారు. చిరంజీవి వస్తే ఓకే. లేదంటే మాత్రం చరణ్ రెడీగా ఉన్నాడు. అంతలో శంకర్ కూడా అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి టైమ్ దొరుకుతుంది. మరి సంక్రాంతికి చిరంజీవి వస్తాడా? రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్) -
మహేశ్‌తో కాలేజ్ డేస్ నుంచే పరిచయం : త్రిష
‘‘మహేశ్‌బాబు చాలా కాలం నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కళాశాల రోజుల్లో చెన్నైలో ఉన్నాం’’ అన్నారు హీరోయిన్ త్రిష. మహేశ్‌బాబు, త్రిష కలిసి ‘అతడు’ (2005), ‘సైనికుడు’ (2006) వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ నటించలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిషకి.. ‘మహేశ్‌బాబు గురించి మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్న ఎదురైంది. (చదవండి: ఈ వీకెండ్ ఏకంగా 24 మూవీస్.. అవి ఏంటంటే?)ఇందుకు త్రిష బదులిస్తూ– ‘‘నాకు ఇష్టమైన నటుల్లో మహేశ్‌బాబు ఒకరు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తోటి నటులను చాలా గౌరవిస్తారు. సెట్లో చాలా సరదాగా ఉంటారు. అలాగే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. తన షూటింగ్ అయిపోయినా కేరవ్యాన్‌లోకి వెళ్లకుండా మానిటర్ దగ్గర కూర్చొని గమనిస్తూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మహేశ్ చాలా కాలం నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కాలేజ్ డేస్‌లో చెన్నైలో ఉన్నాం. మా ఇద్దరికీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారి వల్ల మహేశ్‌తో పరిచయం ఏర్పడింది. మేము యాక్టర్స్ అవుతామని అప్పుడు అనుకోలేదు’’ అన్నారు త్రిష. ఇదిలా ఉంటే త్రిష నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు త్రిష. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి– త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ‘విశ్వంభర’ విడుదల కానుంది. -
మెగాస్టార్ బర్డే.. ఘనంగా సెలెబ్రేట్ చేసిన ఫ్యాన్స్..
-
పవర్ఫుల్ విశ్వంభర
హీరో చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు ‘విశ్వంభర’ మూవీ మేకర్స్. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు. కునాల్ కపూర్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఫస్ట్ లుక్ చూస్తే చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని చేత పట్టుకుని పవర్‌ఫుల్‌గా కనిపించారు. చిరంజీవి లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరుపులతో కూడిన ఈ ఫస్ట్ లుక్ అదుర్స్ అంటున్నారు మెగా అభిమానులు. ‘‘క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’. తన అభిమాన హీరో చిరంజీవితో ‘విశ్వంభర’ను ప్రతిష్టాత్మక ్రపాజెక్ట్గా తీర్చిదిద్దుతున్నారు వశిష్ఠ. ఈ సినిమా కోసం ఓ ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించాం. అద్భుతమైన వీఎఫ్ఎక్స్, హై యాక్షన్, చక్కని డ్రామాతో విజువల్ వండర్‌గా ఈ మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. 2025 జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
'విశ్వంభర' నుంచి చిరంజీవి పుట్టినరోజు కానుక
చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ను మేకర్స్ ఇచ్చారు. విశ్వంభరలో చిరంజీవి ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. త్రిశూలంతో చిరంజీవి కనిపించారు.చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర నుంచి టీజర్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ పోస్ట్‌ర్ ద్వార మెగాస్టార్ లుక్‌ను రివీల్ చేశారు. 'చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించిన సమయంలో ఒక అద్భుతమైన తార పోరాడేందుకు ప్రకాశిస్తుంది.' అని పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ తెలిపింది.త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ తాజాగా పూర్తి అయిందని సమాచారం. ‘‘చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో ‘విశ్వంభర’ మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ కానుంది. -
విశ్వంభరలో స్టార్ హీరోయిన్స్.. చిరుకు చెల్లెలిగా ఈ బ్యూటీ!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ఆషిక రంగనాథ్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా కునాల్ కపూర్ విలన్‌గా కనిపించనున్నాడు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉందట!చిరంజీవికి చెల్లెలిగా..ఈ విషయాన్ని హీరోయిన్ రమ్య పసుపులేటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. విశ్వంభరలో నేను చిరంజీవిగారికి చెల్లెలిగా నటిస్తున్నాను. చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ అని ఈ మూవీ ఒప్పుకున్నాను. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా గర్వకారణం. నా జీవితంలో ఇలాంటి ఛాన్స్ మళ్లీ వస్తుందో, రాదో కూడా తెలీదు. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను.నో చెప్పలేకపోయా..సహాయక పాత్రలు చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను హీరోయిన్గా మాత్రమే కొనసాగాలని వాటిని రిజెక్ట్ చేశాను. అయితే ఇక్కడున్నది చిరంజీవి సర్ కావడంతో నో చెప్పలేకపోయాను. దీనివల్ల నా కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని అనుకోవడం లేదు. పైగా ఇందులో స్టార్ హీరోయిన్స్ కూడా చిన్న రోల్స్ చేస్తున్నారు. కేవలం చిరంజీవి సర్ సినిమా అనే వాళ్లు కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు' అని రమ్య చెప్పుకొచ్చింది. రమ్య ప్రధాన పాత్రలో నటించిన మారుతినగర్ సుబ్రమణ్యం ఆగస్టు 23న విడుదల కానుంది. -
విశ్వంభర యాక్షన్
చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ అ¯Œ్ల అరసు నేతృత్వంలో ‘విశ్వంభర’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ‘‘చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో ‘విశ్వంభర’ మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ కానుంది. చిరంజీవి కోటి విరాళం కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్‌లో భారీ ఎత్తున ్ర΄ాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన నటీనటులు తమవంతుగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా హీరో చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కోటి రూ΄ాయలు విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ 25లక్షల విరాళంవయనాడ్ వరద బాధితుల సహాయార్థం హీరో అల్లు అర్జున్ కూడా 25 లక్షలు విరాళం ప్రకటించారు.సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఆ మొత్తాన్ని అందించనున్నట్లు ఆయన తెలి΄ారు. -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘దేవుళ్లు’
ఒకప్పుడు మన పురాణాలు, ఇతీహాసాలపై టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.అయితే రాను రాను వెండితెరపై మైథాలజీ కథలు తగ్గిపోతూ వచ్చాయి. యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, రొమాంటిక్ జానర్ సినిమాలే ఎక్కువగా సందడి చేశాయి. మధ్య మధ్యలో ఒకటి రెండు మైథాలజీ జానర్ సినిమాలు వచ్చినా..అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా.. మళ్లీ మన ప్రేక్షకులు ‘దేవుళ్ల’ కథలను ఆదరిస్తున్నారు. సోషియో పాంటసీ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నిదర్శనం ‘కల్కి 2898 ఏడీ’ సినిమానే. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలన్నింటిని వెండితెరపై చూపిస్తూ..ఓ కొత్త కథను చెప్పాడు. ఆ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది.అంతకు ముందు వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రాన్ని కూడా ‘దేవుడే’ హిట్ చేశాడు. ఆ సినిమాలో కృష్ణుడుకి సంబంధించిన సన్నివేశాలకు నార్త్‌తో పాటు సౌత్ ప్రేక్షకులు కూడా పడిపోయారు. సినిమా విజయంలో ఆ సీన్స్ కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మరో మైథాలజీ ఫిల్మ్ ‘హను-మాను’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టింది.‘అరి’తో పాటు మరిన్ని చిత్రాలు..టాలీవుడ్లో మైథాలజీ చిత్రాలకు గిరాకీ పెరిగింది. దీంతో పలువురు దర్శకనిర్మాతలు ఆ జోనర్ చిత్రాలనే తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆఖండ 2ను లైన్లో పెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘కల్కి’ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. అలాగే హను-మాన్‌కి సీక్వెల్‌గా ‘జై హను-మాన్’ రాబోతుంది. 2025లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. చిరంజీవి ‘విశ్వంభర’, నిఖిల్ ‘స్వయంభు’ కూడా సోషియో ఫాంటసీ చిత్రాలే.ఇక ఇదే జోనర్లో ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ ‘అరి’అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృష్ణుడిది ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఇంత వరకి ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలనే కాన్సెప్ట్ మీద అరి మూవీని తెరకెక్కించాడు జయశంకర్. మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్‌లో కృష్ణుడికి సంబంధించిన సీన్స్..గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అసలే ఇప్పుడు మైథాలజీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ‘అరి’లో కృష్ణుడి సీన్స్ పేలితే..బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
విశ్వంభర డైరక్టర్ బీభత్సమైన ట్విస్ట్..
-
రాగాలాపనలో...
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథన్, కునాల్ కపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవైపు చిత్రీకరణ జరుపుతూనే మరోవైపు పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్‌ను కూడా ఈ చిత్రయూనిట్ ఆరంభించింది.ఇందులో భాగంగా ఇటీవల డబ్బింగ్ మొదలైంది. ఇక ప్రస్తుతం ‘విశ్వంభర’ రాగాలాపనలో ఉన్నాడు. ఈ చిత్రం మూజిక్ సిట్టింగ్స్ బెంగళూరులో జరుగుతున్నాయి. చిరంజీవి, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, దర్శకుడు వశిష్ఠ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఈ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. -
మాటలు ఆరంభం
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.అందుకు తగ్గట్టు ఓ వైపు షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మరోవైపు పోస్ట్‌ప్రోడక్షన్ పనులు మొదలుపెట్టింది చిత్రబృందం. గురువారం మాటల (డబ్బింగ్) పనులను ప్రారంభించారు. ‘‘క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ‘విశ్వంభర’ రూపొందుతోంది.ఈ చిత్రంలో హనుమాన్ భక్తుడిగా కనిపిస్తారు చిరంజీవి. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉంటాయి. పోస్ట్ ప్రోడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ పడుతుంది. అందుకేప్రోడక్షన్, పోస్ట్‌ప్రోడక్షన్ పనులను ఏకకాలంలో చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు
మెగా హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెట్టారు. తమ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి కథలనే ఎంచుకుంటున్నారు. చిరంజీవి మొదలు సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇది హిట్టయితే ఇక చెర్రీకి తిరుగుండదు. పాన్ ఇండియా మార్కెట్‌ను కొన్నాళ్ల పాటు శాసించొచ్చు. ‘విశ్వంభర’ హిట్ కూడా చిరుకు చాలా అవసరం. ఆయన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇది హిట్టయితే ఇకపై చిరు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులనే ఎంచుకునే అవకాశం ఉంది. (చదవండి: అర్జునుడుగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే?)మరోవైపు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. దాని కోసం పాన్ ఇండియా సబ్జెక్ట్‌నే నమ్ముకున్నాడు. ఆయన నటిస్తున్న ‘మట్కా’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. (చదవండి: ఆ విషయంలో తప్పు చేశాను: సమంత)ఇక ‘విరూపాక్ష’ చిత్రంతో 100 కోట్ల క్లబ్బులో చేరిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేస్తానంటున్నాడు. ‘బ్రో’ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే టైటిల్ విషయంలో వచ్చిన కాట్రవర్సీ కారణంగానో లేదా బడ్జెట్ ఇష్యూనో తెలియదు కానీ ఆ సినిమాను పక్కకు పెట్టి కొత్త మూవీని ప్రకటించాడు. ఇది తన కెరీర్లో 18వ సినిమా. ఈ మూవీతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. సాయి ధరమ్ తేజ్‌కి ఈ చిత్రం చాలా ముఖ్యం. ఇది హిట్టయితేనే ఇకపై పాన్ ఇండియా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. -
విశ్వంభరతో వినాయక్
చిరంజీవి టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్‌కి వెళ్లారు దర్శకుడు వీవీ వినాయక్. దాదాపు 20 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఠాగూర్’ (2003) చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పట్నుంచీ చిరంజీవి–వినాయక్ మధ్య మంచి అనుబంధం ఉంది. సోమవారం ‘విశ్వంభర’ సెట్‌కి వెళ్లిన వినాయక్ చిత్రదర్శకుడు వశిష్ఠకి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు చిరంజీవితో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్‌గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
'విశ్వంభర' సెట్లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి.. ఫొటోలు వైరల్
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. హైదరాబాద్‌లోని 'విశ్వంభర' సెట్లో ఇది జరిగింది. చిరుతో పాటు కీరవాణి, దర్శకుడు వశిష్ట, నిర్మాతలు కూడా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా చిరు.. మంత్రి దుర్గేష్‌తో కాసేపు ముచ్చటించారు. అలానే ఈ భేటీ విషయమై ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా)'మిత్రుడు కందుల దుర్గష్.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లని సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారని చెప్పారు' అని చిరంజీవి రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు!💐💐… pic.twitter.com/R7tDsrPR6R— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2024 -
'విశ్వంభర'లో విలన్ ఎంట్రీ.. అధికారిక ప్రకటన
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ' విశ్వంభర'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసింది. రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే, తాజాగా 'విశ్వంభర' విలన్ పాత్రలో కనిపించేది ఎవరో చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా డైరెక్టర్ వశిష్ఠ ఒక ఫోటో కూడా షేర్ చేశాడు.విశ్వంభరలో విలన్‌గా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన పేరును అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కునాల్ కపూర్ గతంలో నాగార్జున,నాని నటించిన దేవదాస్ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించాడు. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు విశ్వంభరలో అడుగుపెట్టాడు. వాస్తవంగా ఈ చిత్రంలో విలన్‌గా నటించే ఛాన్స్ మొదట రానా దగ్గుబాటికి దక్కింది. అయితే, రానా తన తదుపరి చిత్రంలో నటించబోయే పాత్రకు కాస్త దగ్గరగా ఉండటంతో విశ్వంభరకు నో చెప్పాడని వార్తలు వచ్చాయి. దీంతో కునాల్ కపూర్‌కు ఆ ఛాన్స్ దక్కింది. ఇప్పటికే ఆయనతో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని సమాచారం. అమితాబ్ బచ్చన్ సోదరుడి కూతురు నైనా బచ్చన్‌ను కునాల్ వివాహం చేసుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విశ్వంభర విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అశికా రంగనాథ్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు. View this post on Instagram A post shared by Vashistaa Mallidi (@vassishta_006) -
ఒకే ఒక్క సినిమా.. హిట్టయితే ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా!
సాధారణంగా హీరోయిన్లకు నాలుగైదు హిట్లు పడితేకానీ గుర్తింపు రాదు. చిన్న చిన్న హీరోలతో నటించి మెప్పిస్తే..స్టార్ హీరోల సినిమాల్లో చాన్స్ వస్తుంది. అక్కడ ఒక్క హిట్ పడితే చాలు..ఇక స్టార్ హీరోయిన్ అయిపోతారు. వరుస అవకాశాలు వస్తాయి. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అదృష్టం కూడా ఉండాలి. కానీ కొంతమంది హీరోయిన్లకి మాత్రం తొలి సినిమాతోనే స్టార్ హీరోలతో నటించే అవకాశం వస్తుంది. అది హిట్టయితే చాలు..వాళ్లు ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం. అలాంటి బంపరాఫర్స్ని పట్టేసిన హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం.మాళవికా మోహన్.. ఈ బ్యూటీ పేరు తెలుగు ఆడియన్స్‌కి అంతగా గుర్తుండకపోవచ్చు కానీ, తమిళ్ ఆడియన్స్‌కి మాత్రం బాగా తెలుసు. రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ‘మాస్టర్’తో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ బ్యూటీ ఇంతవరకు టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మారుతి-ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ చిత్రంలో మాళవిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలై హిట్టయితే మాత్రం మాళవిక స్టార్ హీరోయిన్గా మారడం ఖాయం.జాన్వీ కపూర్.. దీవంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల తనయగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. అక్కడ వరుస సినిమాలు చేసిన రావాల్సినంత గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌పై కన్నేసింది. తొలి సినిమాతోనే ఎన్టీఆర్‌తో నటించే చాన్స్ కొట్టేసింది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘దేవర’మూవీలో జాన్వీనే హీరోయిన్. అంతేకాదు రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబినేసన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు విడుదలై హిట్టయితే..సౌత్‌లో ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు రావడం ఖాయమని సీనీ విశ్లేషకులు చెబుతున్నారు.అషికా రంగనాథ్.. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం వచ్చిందంటే.. ఆ హీరోయిన్‌కి ప్రమోషన్స్ వచ్చినట్టే లెక్క. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అషికా రంగనాథ్‌కి మాత్రం రెండో సినిమాతోనే మెగాస్టార్ సరసన నటించే అవకాశం దక్కింది. ‘నా సామిరంగ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అషికాకు తెలుగులో వరుస సినిమాలు వచ్చే అవకాశం ఉంది. -
అజిత్, షాలినితో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి
కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ‘విశ్వంభర’ సెట్స్‌లో అడుగుపెట్టారు చిరంజీవి. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఆషికా రంగనాథ్ కూడా ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టేసింది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రాన్ని వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరించారు. అయితే, తాజాగా విశ్వంభర సెట్స్‌లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.హైదరాబాద్‌లో జన్మించిన అజిత్సౌత్ ఇండియాలో టాప్ హీరోలలో అజిత్ కూడా ఒకరు. హైదరాబాద్‌లో జన్మించిన అజిత్ పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన 'ప్రేమ పుస్తకం'తో ప్రారంభించాడు. ఈ సినిమాను కూడా ఆప్పట్లో మెగాస్టార్ చిరంజీవినే లాంచ్ చేశారు. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో అజిత్ పెళ్లి చేసుకున్నాడు.నా చేతుల మీదుగా లాంచ్ అయ్యాడు: చిరంజీవిఅయితే, అజిత్ విశ్వంభర సెట్స్‌లో అడుగుపెట్టడం పట్ల చిరంజీవి ఇలా చెప్పుకొచ్చారు. 'నిన్న సాయంత్రం 'విశ్వంభర' సెట్స్‌కి స్టార్ గెస్ట్‌గా వచ్చి అజిత్ మా అందరినీ ఆశ్చర్యపరిచారు. అజిత్ సినిమా కూడా షూటింగ్ ఇక్కడే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత కలిశాం. అజిత్ తొలి సినిమా 'ప్రేమ పుస్తకం' ఆడియో లాంచ్ కార్యక్రమం నా చేతుల మీదుగానే జరిగింది. ఆ సమయాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ గడిపాం. ఇంకా చెప్పాలంటే అజిత్ జీవిత భాగస్వామి షాలిని కూడా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలో నటిచింది. ఆ సినిమాలోని చిన్నపిల్లల పాత్రలో ఆమె ఒకరు. అలా అజిత్‌తో గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో అజిత్ స్టార్డమ్ శిఖరాలను దాటేసింది. దానిని చూసి నేను చాలా సంతోషించాను.' అని మెగాస్టార్ అన్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)