
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌లో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతుంది. గత కొద్దిరోజులుగా ముచ్చింతల్ షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొందరు దర్శకులు 'విశ్వంభర' సెట్స్‌కు వెళ్లి మెగాస్టార్‌ను కలిసిన విషయం తెలిసిందే.
చిరంజీవిని కలిసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో దర్శకుడు మెహర్ రమేష్, చిరంజీవి కలిసి ఒకే ఫ్రేమ్‌లో పోజులిచ్చిన ఫోటో భారీగా వైరల్ అవుతుంది. వాటిని చూసిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు చాలా ఆందోళన చెందుతున్నారు. మెహర్ రమేష్‌కి చిరంజీవి మరో సినిమా అవకాశం ఇస్తున్నారా అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. గతంలో సినిమా అవకాశాలు లేని మెహర్ రమేష్‌కు భోళా శంకర్ ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి.. గోల్డెన్ లాంటి ఛాన్స్‌ను ఆయన కరెక్ట్‌గా ఉపయోగించుకోలేకపోయారనే అపవాదు ఉంది.
(ఇదీ చదవండి: ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'రాధికా ఆప్టే' బోల్డ్ సినిమా)
బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ దారుణమైన పరాజయాన్ని అందుకుంది. దీంతో మెహర్ రమేష్‌పై భారీగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆయన మీడియాకు కూడా కొంత కాలం దూరంగానే ఉన్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ మెగాస్టార్‌ను కలవడంతో నెట్టింట భోళా టాపిక్ మరోసారి వైరల్ అవుతుంది. ఎట్టిపరిస్థితిలో మెహర్ రమేష్‌కు మరో ఛాన్స్ ఇవ్వోద్దంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మెగాస్టార్‌ను ఎందుకు కలిశారంటే
మే 4న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని వారు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు రావాల్సిందిగా అసోసియేషన్ ప్రతినిధులు చిరంజీవికి ఆహ్వానం అందించారు. అనుదీప్ కేవీ, మెహర్ రమేశ్, సాయి రాజేశ్, శ్రీరామ్ ఆదిత్యతోపాటు పలువురు దర్శకులు చిరంజీవిని కలిసిన వారిలో ఉన్నారు. విశ్వంభర సెట్స్‌లో వారు కలవడంతో ఆ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేత నవీన్ యర్నేని)
Comments
Please login to add a commentAdd a comment