చిరుతో 'విశ్వంభర'.. త్రిష డబుల్‌ ధమాకా?  | Trisha Krishnan To Play A Double Role in Chiranjeevi Starrer the movie Vishwambhara | Sakshi
Sakshi News home page

చిరుతో 'విశ్వంభర'.. త్రిష డబుల్‌ ధమాకా? 

Published Mon, Mar 11 2024 2:18 AM | Last Updated on Mon, Mar 11 2024 10:47 AM

Trisha Krishnan To Play A Double Role in Chiranjeevi Starrer the movie Vishwambhara - Sakshi

హీరోయిన్‌ త్రిష తెలుగు ప్రేక్షకు లకు డబుల్‌ ధమాకా ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. 2006లో విడుదలైన ‘స్టాలిన్‌’ సినిమా తర్వాత రెండోసారి ‘విశ్వంభర’ కోసం జోడీ కట్టారు చిరంజీవి–త్రిష. కొన్నేళ్ల  తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌ చిత్రమిది.

ఇందులోని గ్రాఫిక్స్‌ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని టాక్‌. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో త్రిష ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌. ఆమెపాత్రకు కథలో చాలాప్రాధాన్యం ఉందట.. అందుకే డబుల్‌ రోల్‌ చేస్తున్నారని భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement