రాగాలాపనలో... | Megastar Supervision On Music For Vishwambhara | Sakshi
Sakshi News home page

రాగాలాపనలో...

Published Sun, Jul 14 2024 12:39 AM | Last Updated on Sun, Jul 14 2024 12:39 AM

Megastar Supervision On Music For Vishwambhara

చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథన్, కునాల్‌ కపూర్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవైపు చిత్రీకరణ జరుపుతూనే మరోవైపు పోస్ట్‌ప్రోడక్షన్‌ వర్క్స్‌ను కూడా ఈ చిత్రయూనిట్‌ ఆరంభించింది.

ఇందులో భాగంగా ఇటీవల డబ్బింగ్‌ మొదలైంది. ఇక ప్రస్తుతం ‘విశ్వంభర’ రాగాలాపనలో ఉన్నాడు. ఈ చిత్రం మూజిక్‌ సిట్టింగ్స్‌ బెంగళూరులో జరుగుతున్నాయి. చిరంజీవి, ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి, దర్శకుడు వశిష్ఠ, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు ఈ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement