విశ్వంభరలో స్టార్‌ హీరోయిన్స్‌.. చిరుకు చెల్లెలిగా ఈ బ్యూటీ! | Ramya Pasupuleti About Her Role In Vishwambhara Movie | Sakshi
Sakshi News home page

Ramya Pasupuleti: ఎన్నో ఆఫర్స్‌ రిజెక్ట్‌ చేశా, చిరంజీవి మూవీ అనగానే..

Aug 17 2024 12:07 PM | Updated on Aug 17 2024 12:18 PM

Ramya Pasupuleti About Her Role In Vishwambhara Movie

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ఆషిక రంగనాథ్‌ ముఖ్య పాత్ర పోషిస్తుండగా కునాల్‌ కపూర్‌ విలన్‌గా కనిపించనున్నాడు. బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఈ మూవీలో సిస్టర్‌ సెంటిమెంట్‌ కూడా ఉందట!

చిరంజీవికి చెల్లెలిగా..
ఈ విషయాన్ని హీరోయిన్‌ రమ్య పసుపులేటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. విశ్వంభరలో నేను చిరంజీవిగారికి చెల్లెలిగా నటిస్తున్నాను. చిరంజీవి పక్కన నటించే ఛాన్స్‌ అని ఈ మూవీ ఒప్పుకున్నాను. ఆయనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నిజంగా గర్వకారణం. నా జీవితంలో ఇలాంటి ఛాన్స్‌ మళ్లీ వస్తుందో, రాదో కూడా తెలీదు. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను.

నో చెప్పలేకపోయా..
సహాయక పాత్రలు చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను హీరోయిన్‌గా మాత్రమే కొనసాగాలని వాటిని రిజెక్ట్‌ చేశాను. అయితే ఇక్కడున్నది చిరంజీవి సర్‌ కావడంతో నో చెప్పలేకపోయాను. దీనివల్ల నా కెరీర్‌ ఇబ్బందుల్లో పడుతుందని అనుకోవడం లేదు. పైగా ఇందులో స్టార్‌ హీరోయిన్స్‌ కూడా చిన్న రోల్స్‌ చేస్తున్నారు. కేవలం చిరంజీవి సర్‌ సినిమా అనే వాళ్లు కూడా ఇందులో యాక్ట్‌ చేస్తున్నారు' అని రమ్య చెప్పుకొచ్చింది. రమ్య ప్రధాన పాత్రలో నటించిన మారుతినగర్‌ సుబ్రమణ్యం ఆగస్టు 23న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement