సంక్రాంతికి మరోసారి... | Vishwambhara: Ashika Ranganath joins Megsastar Chiranjeevi film | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి మరోసారి...

Published Sat, May 25 2024 12:09 AM | Last Updated on Sat, May 25 2024 12:09 AM

Vishwambhara: Ashika Ranganath joins Megsastar Chiranjeevi film

‘‘ఓ అద్భుతమైన సినిమాటిక్‌ జర్నీకి స్వాగతం’’ అంటూ ఆషికా రంగనాథ్‌ను ఆహ్వానించింది ‘విశ్వంభర’ చిత్ర యూనిట్‌. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఓ ముఖ్యమైన పాత్రకు ఆషికా రంగనాథ్‌ని తీసుకున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘నా సామి రంగ’లో నాగార్జున సరసన కథానాయికగా నటించారు ఆషిక.

ఆ చిత్రంలో మాస్‌ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారీ బ్యూటీ. ఆ పాత్రలో కనబర్చిన నటనే ‘విశ్వంభర’లో నటించే అవకాశం దక్కేలా చేసిందని టాక్‌. ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీగా రూపొందుతున్న ‘విశ్వంభర’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది. ఇక ఈ సంక్రాంతికి ‘నా సామి రంగ’తో వచ్చిన ఆషిక మరోసారి వచ్చే ఏడాది సంక్రాంతికి తెరపై కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement