‘‘మహేశ్‌బాబు చాలా కాలం నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కళాశాల రోజుల్లో చెన్నైలో ఉన్నాం’’ అన్నారు హీరోయిన్ త్రిష. మహేశ్‌బాబు, త్రిష కలిసి ‘అతడు’ (2005), ‘సైనికుడు’ (2006) వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ నటించలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిషకి.. ‘మహేశ్‌బాబు గురించి మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్న ఎదురైంది.
(చదవండి: ఈ వీకెండ్ ఏకంగా 24 మూవీస్.. అవి ఏంటంటే?)
ఇందుకు త్రిష బదులిస్తూ– ‘‘నాకు ఇష్టమైన నటుల్లో మహేశ్‌బాబు ఒకరు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తోటి నటులను చాలా గౌరవిస్తారు. సెట్‌లో చాలా సరదాగా ఉంటారు. అలాగే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. తన షూటింగ్ అయిపోయినా కేరవ్యాన్‌లోకి వెళ్లకుండా మానిటర్ దగ్గర కూర్చొని గమనిస్తూ ఉంటారు.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మహేశ్ చాలా కాలం నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కాలేజ్ డేస్‌లో చెన్నైలో ఉన్నాం. మా ఇద్దరికీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారి వల్ల మహేశ్‌తో పరిచయం ఏర్పడింది. మేము యాక్టర్స్ అవుతామని అప్పుడు అనుకోలేదు’’ అన్నారు త్రిష. ఇదిలా ఉంటే త్రిష నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు త్రిష. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి– త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ‘విశ్వంభర’ విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment