
కొత్త ఏడాదిలో పద్మవిభూషణ్ అవార్డు దక్కడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులే కాకుండా ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ జోష్ ఇంతటితో ఆగేలా లేదు.. ఆయన నటిస్తున్న 156వ చిత్రం 'విశ్వంభర' కోసం రంగంలోకి దిగేందుకు రెడీ అయిపోయారు చిరు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే విశ్వంభర రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది కానీ చిరంజీవి ఇంకా సెట్స్‌లోకి అడుగు పెట్టలేదు. తాజాగా ఈ చిత్రం కోసం ఆయన జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. అందులో చివరగా రెడీ ఫర్ విశ్వంభర అంటూ ఫుల్ జోష్‌లో చెప్పారు. దీంతో మెగాస్టార్ విశ్వంభర సెట్స్‌లోకి అడుగు పెట్టే సమయం వచ్చేసింది. ఈ వారంలోనే కొత్త షెడ్యూల్‌లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను కూడా మేకర్స్ ఏర్పాటు చేశారు.
68 ఏళ్ల వయసులో కూడా జిమ్‌లో మెగాస్టార్ ఒక రేంజ్‌లో కష్టపడుతున్నారు. యంగ్‌స్టర్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఆయన కసరత్తులు చేస్తున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు. సినిమా కోసం ఆయన ఎంతగానో కమిట్‌మెంట్‌గా పనిచేస్తారని పేరు ఉంది. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడని ఇండస్ట్రీలో ఎందరో చెబుతుంటారు. చిరంజీవి దీంట్లో భీమవరం దొరబాబుగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. 2025 సంక్రాంతికి విశ్వంభర విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment