
స్టార్ హీరోయిన్ త్రిష.. కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. 40 ఏళ్ల వయసులోనూ ఈమె నటిస్తున్న సినిమాలన్నీ సూపర్ స్టార్స్‌తోనే కావడం శేషం. అన్ని భాషల్లోనూ ఏక కాలంలో నటించేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ 'విడామయూర్చి', కమల్ హాసన్ 'థగ్ లైఫ్', చిరంజీవి 'విశ్వంభర', మోహన్ లాల్ 'రామ్' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్.
(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్‌రెడీ బ్రేకప్!)
కాగా అజిత్ 'విడా మయూర్చి' షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాకు కేటాయించిన డేట్స్‌ని విశ్వంభర, థగ్ లైఫ్ చిత్రాలకు ఉపయోగించేస్తోంది. దీంతో 'విడామయర్చి' చిత్రానికి షాక్ తగిలినట్లయింది. అయితే ఇదంతా దర్శకుడు మణిరత్నం చేసిన పని అనుకోవచ్చు.. ఎందుకంటే 'పొన్నియన్ సెల్వన్'లో కుందవై పాత్ర ఇచ్చి త్రిషకి మళ్లీ లైఫ్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఈమె ఊపిరిసలపనంత బిజీగా మారిపోయింది. టైమ్ అంటే ఇదే మరి.
(ఇదీ చదవండి: నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్‌కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment