
చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు. కునాల్ కపూర్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.ప్రోడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ శంకర్‌పల్లిలో వేసిన ఓ భారీ సెట్‌లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.
ఇదిలావుంటే ఈ మూవీలో మెగా వారసులు నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. ముఖ్యంగా మెగా హీరోలు ఆయనతో పాటు కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. వారిని సంతోష పరిచేందుకు ఈ సినిమాలో నటుడు సాయధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు నిహారికా కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, చిరు కాంబినేషన్‌లో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని టాక్ ఉంది.

టీజర్ విడుదలయిన తర్వాత సినిమాపై కాస్త నెగెటివిటీ వచ్చింది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ సరిగ్గా లేదంటూ విమర్శలు వచ్చాయి. దీంతో వాటి వర్క్ మళ్లీ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఎంతో ప్రతిభ ఉన్న కెమెరామెన్ చోటా కే నాయుడు విషయంలోనూ చిత్ర యూనిట్ కాస్త అసంతృప్తిగా ఉందని ఒక వార్త వైరల్ అయింది. చిరంజీవి నటించిన చాలా హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. వారిద్దరి కాంబో అంటే ఫ్యాన్స్‌కు పండగే.. తెరపై చిరును అద్భుతంగా చూపిస్తారని చోటా కే నాయుడుకు పేరుంది. బింబిసారకు కూడా చోటానే పనిచేయడంతో వశిష్టతో మంచి బాండింగే ఉంది. కానీ, విశ్వంభర విషయంలో కాస్త తేడా కొట్టినట్లు తెలుస్తోంది. అందుకే హాలీవుడ్ నుంచి మరో కెమెరామెన్‌ను లైన్‌లోకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment