చిరంజీవి కాదు.. చరణ్ వస్తున్నాడా? | Is Chiranjeevi Vishwambhara Postponed And Ram Charan Game Changer Lock For Sankranthi Release? | Sakshi
Sakshi News home page

Chiranjeevi Ram Charan: పండగ రేసులో తండ్రి బదులు కొడుకు వస్తే?

Published Sun, Sep 29 2024 3:27 PM | Last Updated on Sun, Sep 29 2024 5:34 PM

Vishwambhara Postponed Game Changer Sankranthi Release

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అందుకు తగ్గట్లే షూటింగ్, గ్రాఫిక్స్ పనులన్నీ వేగంగా చేస్తున్నారు. ఎంత ఫాస్ట్‪‌గా చేస్తున్నా సరే అనుకోని అవాంతరాలు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి.. చికెన్ గున్యా బారిన పడ్డారు. అయినా సరే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈవెంట్‌కి హాజరైన తనకు దక్కిన పురస్కారాన్ని అందుకున్నారు.

(ఇదీ చదవండి: ప్రముఖ ఫోక్‌ సింగర్‌పై అత్యాచార కేసు.. యువతి ఫిర్యాదు)

ప్రస్తుతం చిరంజీవి కోలుకుంటున్నారని, పూర్తిగా సెట్ అవడానికి మరికాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తోంది. దీంతో 'విశ్వంభర' సమాయానికి రెడీ అవ్వకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సంక్రాంతి రేసు నుంచి చిరు సైడ్ అవుతారు. ఇదే గనన జరిగితే 'గేమ్ ఛేంజర్'ని సంక్రాంతి రేసులోకి తీసుకురావాలని దిల్ రాజు భావిస్తున్నారట.

ఇప్పటికే సంక్రాంతి రేసులో బాలయ్య, వెంకటేశ్, రవితేజ ఉన్నారు. చిరంజీవి వస్తే ఓకే. లేదంటే మాత్రం చరణ్ రెడీగా ఉన్నాడు. అంతలో శంకర్ కూడా అ‍న్ని పనులు పూర్తి చేసుకోవడానికి టైమ్ దొరుకుతుంది. మరి సంక్రాంతికి చిరంజీవి వస్తాడా? రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్‌.. బాలీవుడ్‌లో పెరిగిన క్రేజ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement