ప్రముఖ ఫోక్‌ సింగర్‌పై అత్యాచార కేసు.. యువతి ఫిర్యాదు | Lady Filed Harassment Complaint On Folk Singer Mallik Tej In Karimnagar, Know More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రముఖ ఫోక్‌ సింగర్‌పై అత్యాచార కేసు.. యువతి ఫిర్యాదు

Published Sun, Sep 29 2024 11:54 AM | Last Updated on Sun, Sep 29 2024 1:12 PM

Lady Complaint To Singar Mallik Tej

యూట్యూబ్‌లో తన పాటలతో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సుద్దాల మల్లిక్ తేజ ఎన్నో పాటలు రచించడమే కాకుండా పాడటం కూడా జరిగింది. ఆయన ఎక్కువగా జానపద గీతాలు, ఫోక్‌ సాంగ్స్‌, తెలంగాణ ప్రాంతీయ పాటలతో ఫేమస్‌ అయ్యాడు. ఆయన పాటలకు అత్యధిక వ్యూస్ కూడా ఉన్నాయి.

జగిత్యాలకు చెందిన ఒక యువతికి సింగర్‌గా అవకాశం ఇచ్చాడు. ఆమెతో కలిసి మల్లిక్‌ తేజ్‌ చాలా సాంగ్స్‌ పాడటం కూడా జరిగింది. వారిద్దరూ హైదరాబాద్‌, దుబాయ్‌తో పాటు పలుచోట్లు అనేక ఈవెంట్లు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో మల్లిక్‌ తేజ్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని  జగిత్యాల పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఛాన్సుల పేరుతో తనను వేధిస్తున్నట్లు  ఫిర్యాదులో ఆమె పేర్కొంది.  

తనకు సంబంధించిన యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పాస్వర్డ్స్‌ మార్చేసి పలు ఇబ్బందులు పెడుతున్నట్లు బాధితురాలు తెలుపుతుంది. బ్లాక్‌ మెయిల్‌ చేసి స్టూడియోలోనే తనపై మల్లిక్‌ తేజ్‌ అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది. తరచూ ఫోన్ చేసి వేధిస్తూన్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. చిత్రపరిశ్రమ, సోషల్‌మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వారిపై ఇలాంటి కేసులే నమోదయిన విషయం తెలిసిందే. వారిలో కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ఒకరు కాగా.. ప్రముఖ యూట్యూబర్‌ హర్షసాయి ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement