ఎన్టీఆర్ 'దేవర' మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా రేంజ్‌లో కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటిరోజు ఏకంగా రూ. 172 కోట్లు సాధించింది. ఇండియాలోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో 5వ స్థానం దక్కించింది. తాజాగా దేవర రెండురోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దేవర సినిమా రెండురోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 243 కోట్లు రాబట్టింది. అయితే, మొదటిరోజు కంటే భారీగా కలెక్షన్స్ తగ్గాయి. ఫస్ట్ డే రూ. 172 కోట్లు రాబట్టిన దేవర.. రెండోరోజు మాత్రం కేవలం రూ. 71 కోట్లతో సరిపెట్టుకున్నాడు. అయితే, బాలీవుడ్‌లో మాత్రం కలెక్షన్స్ పుంజుకున్నాయి. హిందీ వర్షన్‌లో ఫస్ట్ డే రూ. 7 కోట్లు రాగా.. సెకండ్ డే నాడు రూ. 9 కోట్లు రాబట్టింది. మూడో రోజు కూడా అక్కడ భారీగానే టికెట్ల కొనుగోలు జరిగింది.
ఇదీ చదవండి: ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్
అయితే, రెండో రోజు నుంచి సినిమాపై మరింత పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దసరా సెలవులు కూడా రానున్నడంతో మొత్తంగా రూ. 500 కోట్ల క్లబ్‌లో దేవర చేరవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
The wave of #Devara's rage FLOODS the Box Office putting ALL TERRITORIES on notice! 🔥🔥
𝟐 𝐃𝐚𝐲𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐁𝐎𝐂 𝟐𝟒𝟑 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 💥💥
- https://t.co/hGPUm1Tsio#BlockbusterDevara
Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor… pic.twitter.com/HbjFm2tmJ4— NTR Arts (@NTRArtsOfficial) September 29, 2024
Comments
Please login to add a commentAdd a comment