భాగ్యనగరంలో ‘విశ్వంభర’ పూర్తి  | Trisha Shares Picture With Chiranjeevi And MM Keeravaani From Vishwambhara, Goes Viral - Sakshi
Sakshi News home page

భాగ్యనగరంలో ‘విశ్వంభర’ పూర్తి 

Published Fri, Mar 22 2024 4:50 AM | Last Updated on Fri, Mar 22 2024 1:02 PM

Trisha Shares Picture With Chiranjeevi And MM Keeravaani From Vishwambhara - Sakshi

కీరవాణి, త్రిష, చిరంజీవి

చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ‘బింబిసార’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్టాలిన్‌’ (2006) వంటి హిట్‌ మూవీలో జోడీగా నటించిన చిరంజీవి–త్రిష ‘విశ్వంభర’ మూవీ కోసం రెండోసారి కలిశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

కాగా ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన ‘విశ్వంభర’ షెడ్యూల్‌ పూర్తయినట్లు మేకర్స్‌ ప్రకటించారు. చిరంజీవి, త్రిషతో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్‌లో కొంత టాకీ పార్ట్, ఓ పాట, యాక్షన్  బ్లాక్‌ని చిత్రీకరించినట్లు యూనిట్‌ పేర్కొంది. ‘‘ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ మూవీ ఉంటుంది.

2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి నివాసంలో చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా యూనిట్‌తో దిగిన ఫొటోలను త్రిష సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ‘ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు! విశ్వంభర’ అని పోస్ట్‌ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: కార్తీక్‌ శబరీష్, లైన్‌ప్రోడ్యూసర్‌: రామిరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement