మెగా హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెట్టారు. తమ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి కథలనే ఎంచుకుంటున్నారు. చిరంజీవి మొదలు సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు.
చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇది హిట్టయితే ఇక చెర్రీకి తిరుగుండదు. పాన్ ఇండియా మార్కెట్‌ను కొన్నాళ్ల పాటు శాసించొచ్చు. ‘విశ్వంభర’ హిట్ కూడా చిరుకు చాలా అవసరం. ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇది హిట్టయితే ఇకపై చిరు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులనే ఎంచుకునే అవకాశం ఉంది.
(చదవండి: అర్జునుడుగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే?)
మరోవైపు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. దాని కోసం పాన్ ఇండియా సబ్జెక్ట్‌నే నమ్ముకున్నాడు. ఆయన నటిస్తున్న ‘మట్కా’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
(చదవండి: ఆ విషయంలో తప్పు చేశాను: సమంత)
ఇక ‘విరూపాక్ష’ చిత్రంతో 100 కోట్ల క్లబ్బులో చేరిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేస్తానంటున్నాడు. ‘బ్రో’ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే టైటిల్ విషయంలో వచ్చిన కాట్రవర్సీ కారణంగానో లేదా బడ్జెట్ ఇష్యూనో తెలియదు కానీ ఆ సినిమాను పక్కకు పెట్టి కొత్త మూవీని ప్రకటించాడు.
ఇది తన కెరీర్‌లో 18వ సినిమా. ఈ మూవీతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. సాయి ధరమ్ తేజ్‌కి ఈ చిత్రం చాలా ముఖ్యం. ఇది హిట్టయితేనే ఇకపై పాన్ ఇండియా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment