sai dhara tej
-
పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు
మెగా హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెట్టారు. తమ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి కథలనే ఎంచుకుంటున్నారు. చిరంజీవి మొదలు సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇది హిట్టయితే ఇక చెర్రీకి తిరుగుండదు. పాన్ ఇండియా మార్కెట్‌ను కొన్నాళ్ల పాటు శాసించొచ్చు. ‘విశ్వంభర’ హిట్ కూడా చిరుకు చాలా అవసరం. ఆయన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇది హిట్టయితే ఇకపై చిరు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులనే ఎంచుకునే అవకాశం ఉంది. (చదవండి: అర్జునుడుగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే?)మరోవైపు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. దాని కోసం పాన్ ఇండియా సబ్జెక్ట్‌నే నమ్ముకున్నాడు. ఆయన నటిస్తున్న ‘మట్కా’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. (చదవండి: ఆ విషయంలో తప్పు చేశాను: సమంత)ఇక ‘విరూపాక్ష’ చిత్రంతో 100 కోట్ల క్లబ్బులో చేరిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేస్తానంటున్నాడు. ‘బ్రో’ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే టైటిల్ విషయంలో వచ్చిన కాట్రవర్సీ కారణంగానో లేదా బడ్జెట్ ఇష్యూనో తెలియదు కానీ ఆ సినిమాను పక్కకు పెట్టి కొత్త మూవీని ప్రకటించాడు. ఇది తన కెరీర్లో 18వ సినిమా. ఈ మూవీతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. సాయి ధరమ్ తేజ్‌కి ఈ చిత్రం చాలా ముఖ్యం. ఇది హిట్టయితేనే ఇకపై పాన్ ఇండియా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. -
BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ కీలక హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘బ్రో’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బ్రో’ కథేంటి? ఎలా ఉంది? దేవుడిగా పవన్ ఏమేరకు మెప్పించాడు? తదితర విషయాలను సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #bro is a powerstar film but lot of lag and many unnecessary scenes makes a below par movie thaman music stands out may be a below average fare for others and vintage papk for fans#BroTheAvatar — Gowtham (@gowthamreddy25) July 28, 2023 ట్విటర్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉందని అంటున్నారు. ఓవరాల్‌గా కథ బాగున్నప్పటికీ కొన్ని అనవసరపు సన్నివేశాలు జోడించడం వల్ల సినిమా యావరేజ్‌గా అనిపిస్తుంది. గత సినిమాలతో పోలిస్తే తమన్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #BRO First half review highlights:- 1) Vintage Pawan mannerisms 🤙💥 2) Total fun filled👌 3) Bromance between mama alludu👍👍 4) Taman music K**Ramp 💥🔥🔥#BroTheAvatar#BroReview#PawanaKalyan #SaiDharamTej #ketikasharma#PriyaPrakashVarrier — CinephileX (@CinephileX) July 27, 2023 ‘బ్రో’సినిమా బాగుంది. ఫస్టాఫ్ కామెడీ అదిరిపోయింది. మామఅల్లుళ్ల మధ్య బ్రోమాన్స్ బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండాఫ్‌లో ఆడియెన్స్ ఎమోషల్ అయ్యే సీన్లు ఉన్నాయి.అదే సమయంలో కొన్ని సాగదీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #BroTheAvathar is just good 👍 If you are expecting mass, just leave the theatre, basically an emotional movie with few laughs. @PawanKalyan entry 💥💥 Overall it's good 👌#BroTheAvatar#BroTimeStarts #BRO For more filmy content and exclusive updates follow me❤️💙 pic.twitter.com/KbO6XtZWgO — Lokie (@LokeshD33384473) July 28, 2023 పవన్ కల్యాణ్ మేజరిజం, కామెడీతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా ఉందట. అయితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చకపోవచ్చు అంటున్నారు. ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారట. అవి సాధారణ ప్రేక్షకులను ఇబ్బందిగా అనిపిస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. #BRO Strictly for PK fans ….high whistle blowing moments with PK vintage mash up songs …Rest all goes flat …again Trivikram failed to deliver an remake with unwanted emotions and unexceptional Lag in screenplay …BGM 👍🔥 2.75/5 #BroTheAvatar #BROFromJuly28th #BROreview pic.twitter.com/q7H1aZVsVX — Saideep07 (@saideep_satya77) July 27, 2023 #BroTheAvatar First half : ⭐⭐ Second half : ⭐ Overall : ⭐😀 Power"less" movie pic.twitter.com/TMIFrTir8W — Viraj_AADHF (@zooCakePaata) July 28, 2023 #BroTheAvatar First Half Review: ⭐⭐⭐½ Dialogues And Racy Screenplay 👌 Thamman BGM ❤️🔥 Interval Block is Too Good🔥🔥#PawanKalyan SDT Combo working good#BroTheAvathar #BroMovieReview #Bro pic.twitter.com/CiQ2aaAAvL — Thyview (@Thyveiw) July 27, 2023 One time watch for PK. Fun and swag when PK is on the screen. Kids liked these episodes. Wish the story was a bit better.#BRO — Anon (@AnonAndhra) July 27, 2023 #BRO -Good script which should have been executed more convincingly , a pure feast for fans with vintage @pawankalyan show in modern ultra stylish looks with reference to his old super hit songs.. #saidharamtej has done good job and all the characters involved in the movie gave — $h@shi yad@v (@shashiyadav073) July 28, 2023 Surprise Insp. ani vere location Povalsi vasthundi, Denemma life, e Tweets chusthu kurchovali eve varaku. 6:30 PM cheskunna 🥲 Missing My #BRO at Benefit shows 🔥🔥 Meeru njoy Cheyandi Cults … Updates matram pettandroi 🔥🔥#BusyBankLife🥲#BroTheAvatar @PawanKalyan pic.twitter.com/jd1K9AGYae — Srikanth_PawanKalyan 🔯 ✊ (@AlwaysPK143) July 28, 2023 First half report : Starting with rampp BGM 🔥🔥🔥BROOOOO 😉 Fans ki highs iche stuff 💥👌👌chaala kothaga undi.. But slow ga untadi..🤷♂️ Amma.. chelli.. Ramya.. BROO 😁Interval. Overall abv average 1st half 😊 @tollymasti . .#BroTheAvatar #Bro #BroReview #PawanKalyan… — Tollymasti (@tollymasti) July 27, 2023 150. #Bro (Telugu) {2.25/5} 😐#BroTheAvatar #BroReview pic.twitter.com/xgvMsqlplY — Cinema Madness 24*7 (@CinemaMadness24) July 28, 2023 Movie Review :- #BroTheAvatar Not Enough Bro...!! We Are Going With 2.5/5⭐#BroReview #BroTheAvatarReview #PawanKalyan #SaiDharamTej @PawanKalyan @IamSaiDharamTej #Bro #Review #FactInMedia pic.twitter.com/6XZjaoGKg7 — FACT IN MEDIA (@FactInMedia) July 28, 2023 First Half - భీమవరం Second Half - గాజువాక Final Report - అనంతపురం#BroTheAvatar #BroReview — నా ఇష్టం🖕 (@Infidel_KING) July 28, 2023 -
టాలీవుడ్లో పెళ్లి కాని ప్రసాద్‌లు ఇంతమంది ఉన్నారా?
టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లి టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ఇంకా 30 ఏళ్ల వయసు వచ్చినా.. పెళ్లి ఊసెత్తని హీరోలు ఎవరెవరు ఉన్నారో అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ మధ్యే ఈ జాబితా నుంచి వైదొలిగాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ శర్వానంద్. జూన్ 3న శర్వానంద్ రక్షితారెడ్డిని వివాహమాడారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇంతలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వీరి నిశ్చితార్థం నేడు(జూన్ 9న) జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!) అయితే పెళ్లి ఆలోచన లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న బడా హీరోలు మాత్రం చాలా మందే ఉన్నారు. టాలీవుడ్లో బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్.. ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోలిస్తే ప్రభాస్ వయస్సు అందరికంటే ఎక్కువగానే ఉంటుంది. ప్రభాస్ పెళ్లి మీద రోజుకో వార్త పుట్టుకొచ్చినప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్‌గా మిగిలిపోయాడు. చివరకు ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని చెప్పిన శర్వానంద్ కూడా ఓ ఇంటివాడు అయిపోయాడు. దీంతో ‘ఆదిపురుష్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో పెళ్లి గురించి అభిమానుల అరుపులకు సమాధానమిస్తూ.. ఎప్పుడైనా ఇక్కడే తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ హామీ ఇచ్చాడు. కానీ ఆ శుభాకార్యం ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఇక ఇదే వరుసలో మరో హీరో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు. తన చిన్న వయసు వారంతా పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో తేజ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. టాలీవుడ్లో మరో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ హీరో రామ్ పోతినేని.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం దాటుతున్న పెళ్లికి మాత్రం సై అనడం లేదు. ఇదే లిస్ట్‌లో విజయ్ దేవరకొండ, అడవి శేష్, బెల్లం కొండ శ్రీనివాస్, సిద్ధార్థ్, అల్లు శిరిష్, తరుణ్ ఇలా బ్యాచ్లర్ల లిస్ట్ పెద్దదిగానే ఉంది. ఎంతోమంది హీరోలు.. పెళ్లయ్యాక కూడా సక్సెస్ అయ్యారు. మరి ఈ హీరోలు మాత్రం పెళ్లి విషయాన్నే మర్చిపోయి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది.. ఈ హీరోలంతా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లయితే చూద్దామని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న కమెడియన్ కెవ్వు కార్తీక్) ---- పోడూరి నాగ ఆంజనేయులు -
Virupaksha Review In Telugu: ‘విరూపాక్ష’ మూవీ రివ్యూ
టైటిల్: విరూపాక్ష నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: కార్తీక్ దండు స్క్రీన్‌ప్లే: సుకుమార్ సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: ఏప్రిల్ 21, 2023 రోడ్డు ప్రమాదం తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే తొలి హారర్ మూవీ. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం, ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఫస్ట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్,ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 21) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. విరూపాక్ష కథేంటేంటే ఈ సినిమా కథంతా రుద్రవనం అనే గ్రామంలో జరుగుతుంది. 1979లో క్షుద్ర పూజలు చేస్తూ చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నారనే నెపంతో ఓ జంటను కొట్టి చంపుతారు గ్రామస్తులు. అది జరిగిన పుష్కరకాలం తర్వాత సూర్య(సాయి ధరమ్ తేజ్) తన తల్లితో కలిసి ఆ గ్రామానికి వస్తాడు. ఆ గ్రామంలో జాతర జరుగుతుండడంతో 15 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆ ఊరి సర్పంచ్ హరిశ్చంద్ర(రాజీవ్ కనకాల) కూతురు నందిని(సంయుక్త మీనన్)తో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో రుద్రవనం గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తాయి. అందులో సూర్య పెదనాన్న కూతురు పార్వతి(యాంకర్ శ్యామల) కూడా ఉంటుంది. అనుమానాస్పద మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఊరి ప్రజలంతా భయంతో వణికిపోతారు. చేతబడి కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని పూజారి (సాయిచంద్) ఊరినంతా అష్టదిగ్బంధనం చేయిస్తారు. అసలు ఆ ఊరిని పట్టిపీడుస్తున్న ఆ దుష్టశక్తి ఏంటి? చావుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ప్రేమించిన అమ్మాయి నందినిని రక్షించుకోవడం కోసం సూర్య ఎం చేశాడు? ఆ మిస్టరీ డెత్స్ కారణంగా భయపడుతున్న ఊరి ప్రజలకు ఎలాంటి విముక్తిని ఇచ్చాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. చేతబడి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా విజయం సాధించాయి కూడా. అయితే ఈ మధ్య కాలంతో ఈ తరహా చిత్రాలు రావడం లేదు. చాలా కాలం తర్వాత ఆ మధ్య ‘మసూద’ వచ్చి మంచి విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘విరూపాక్ష’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కథను చక్కగా అల్లుకున్నాడు కార్తిక్ దండు. అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ప్రేమ కథను చొప్పించి కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. పాడుబడ్డ ఇంట్లో క్షుద్రపూజల సీన్‌తో సినిమా ఆసక్తిగా ప్రారంభం అవుతుంది. పుష్కరకాలం తర్వాత ఏం జరుగుతుందో చనిపోతున్న జంటతో ముందే చెప్పించారు. చేతబడి కారణంగానే ప్రజలు చనిపోతున్నారనేది ప్రేక్షకులు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ చేతబడి వెనుక ఉంది ఎవరు? ఎలా చేస్తున్నారు? అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిపిస్తూ సస్పెన్స్‌ని మెంటైన్ చేయడంలో సుకుమార్ వందశాతం విజయం సాధించారు. కొన్ని సన్నివేశాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. అదేసమయంలో లవ్‌స్టోరీ, లాజిక్‌లెస్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. క్లైమాక్స్‌కి ముందు వచ్చే సీక్వెన్స్‌లను మరింత క్లారిటీగా చూపిస్తే బాగుండేది. కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా సింపుల్‌గా ముగించారు. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ‘విరూపాక్ష’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే... యాక్సిడెంట్ తర్వాత తేజ్ నటించిన తొలి చిత్రమిది.హీరోయిజానికి అంతగా స్కోప్‌లేదు.అయినా కూడా తేజ్ తన పాత్రకి న్యాయం చేశాడు. సూర్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే.. నటనలోనూ మెచ్యూర్డ్‌గా కనిపించాడు. ఇక నందినిగా సంయుక్త మీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలలో అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సునీల్ పాత్రని కథలో అనవసరంగా ఇరికించారనిపిస్తుంది. ఇక సర్పంచ్ హరిశ్చంద్రగా రాజీవ్ కనకాల, పూజారిగా సాయిచంద్, అఘోరాగా అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. శామ్ దత్ సైనూద్ధీన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. రొటీన్ కథకు సుకుమార్ స్క్రీన్‌ప్లే బాగా ప్లస్ అయింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
సాయి తేజ్ పేరుతో మోసం.. నమ్మకండి అంటూ సుప్రీం హీరో విజ్ఞప్తి
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త తరహాలో మోసాలలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. పేదోడు, ఉన్నోడు అని తేడా లేకుండా అందినకాడికి దోచుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్కుల్లో ఒకరి పేరుని వాడుకుని కొందరు సైబర్ దొంగల ముఠా డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖుల పేర్లతో చాటింగ్ చేసి ఆపదలో ఉన్నామంటూ, అర్జెంట్‌గా డబ్బులు అవసరమని చెప్పి మోసాలకు పాల్పడడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. తాజాగా సాయిధరమ్ తేజ్‌ని కూడా సైబర్ నేరగాళ్లు వదలేదు. ఆయన పేరుతో ఓ సైబర్ నేరగాడు డబ్బులు వసూలు చేయబోయాడు. తాను సాయిధరమ్ తేజ్‌ని అని ,15000 కావాలని ఓ ఫ్రెండ్‌ని అడుగుతున్నట్టుగా ఓ వాట్సాప్ చాట్‌ని తాజాగా సాయి తేజ్ పంచుకున్నారు. ఇలాంటి నేరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు. ‘నా పేరు మీదుగా నేను నటించిన కో ఆర్టిస్ట్, ఇతర సభ్యుల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తున్నారని నాకు తెలిసింది. నాకు ఆర్థిక సాయం కావాలని వారిని డబ్బులు అడుగుతున్నానట. ఈ విషయంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.. అలాంటి వాటిని నమ్మకండి.. నా పేరు మీద వచ్చే మెసెజ్‌లను పట్టించుకోకండి’ అని సాయి తేజ్ ట్వీట్ చేశారు. ఇక ఈ విషయంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలా మోసం చేసేవాడికైనా సిగ్గు ఉండాలి.. డబ్బులు పంపేవాడికైనా సిగ్గుండాలి.. మెగా హీరోని కేవలం 15వేలు అడగడం ఏంటి? అయినా అంత తక్కువ అడిగితే ఎలా నమ్ముతారనుకున్నాడు? అని సెటైర్లు వేస్తున్నారు. PLEASE BE CAREFUL !!! 🙏🏼 pic.twitter.com/KMGqR3Z6xY — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 30, 2021 -
సింహం పిల్లలతో ఆడుకుంటున్న మెగా హీరో.. ఫోటో వైరల్
ఒకప్పుడు వరుస ప్లాపులను మూటగట్టుకున్న సుప్రీం హీరో సాయితేజ్.. ఇటీవల హిట్ ట్రాక్ ఎక్కాడు. 2019లో ‘చిత్రలహరి’లో విజయం అందుకున్న సాయితేజ్.. ఆ తర్వాత ‘ప్రతి రోజు పండుకే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’తో ఆ హిట్స్ పరంపర కొనసాగించాడు. ప్రస్తుతం సాయితేజ్ క్రియేటివ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన రిపబ్లిక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సాయితేజ్ షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ అయింది. సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే ఈ యంగ్ హీరో.. గురువారం ఓ అరుదైన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోలో సాయితేజ్ రెండు సింహం పిల్లలతో ఆడుకుంటున్నారు. ఈరోజు ఎర్త్ డే సందర్బంగా ప్రకృతితో మనం కలిసి జీవించాలంటూ సాయితేజ్ ఆ ఫోటోలను షేర్ చేశాడు. This #EarthDay let’s take a simple oath of “LIVE AND LET LIVE” ...let’s be a little more compassionate towards our nature. pic.twitter.com/wpA5daMNwd — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 22, 2021 చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్’పై చిరంజీవి సంచలన ట్వీట్ కరోనాతో డ్రైవర్ మృతి.. టెన్షన్లో మెగా ఫ్యామిలీ! -
అధికారం మాత్రమే శాశ్వతం అంటున్న రమ్యకృష్ణ
సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఇందులో శక్తిమంతమైన రాజకీయ నాయకురాలు విశాఖ వాణి పాత్ర చేస్తున్నారు రమ్యకృష్ణ. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ‘తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం’ అని రాసిన వాక్యాలతో ఆమె లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే పాత్రను సాయితేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించనున్నారు’’ అన్నారు. -
మిస్టరీ ఆరంభం
ఒకపక్క ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలతో ఫుల్ బిజీగా ఉండి కూడా గురువారం తన నూతన చిత్రాన్ని ప్రారంభించారు సాయితేజ్. ‘సోలో బ్రతుకే...’ చిత్రాన్ని నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో చేసిన కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లేను సమకూరుస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి సాయితేజ్ క్లాప్‌నిచ్చారు. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి, కుమారుడు సుక్రాంత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ కార్తీక్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. -
ప్రేమ, పెళ్లితో జీవితం నాశనం: మెగా హీరో
కరోనా వైరస్ అనంతరం థియేటర్లలో విడుదలకానున్న స్టార్ హీరో సినిమా సోలో బ్రతుకే సోబెటర్. సాయిధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. సుబ్బు దర్శకత్వం వహిస్తుండగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ముందుగా ఓటీటీలో విడుదల చేయాలని భావించగా ఇటీవల థియేటర్లు తెరుచుకోవడంతో పెద్ద స్క్రీన్ మీద సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే థియేటర్లలో ఇప్పటికే కొన్ని చిన్న సినిమాలు విడుదలైనప్పటికీ ప్రేక్షకులు అంతగా థియేటర్లకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ఇక ఈ అనుమానాలను పక్కనపెడతూ డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. చదవండి: తెరుచుకున్న థియేటర్లు.. ఐమ్యాక్స్‌లో మెగా హీరో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ నేడు(శనివారం) విడుదలయ్యింది. ఇందులో తన గురించి తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్లాలంటూ చెబుతూ.. జీవించడానికి మనకు బోలెడు హక్కులు ఉంటే, ప్రేమ పెళ్లి అని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామని అంటాడు. అలా పెళ్లికి దూరంగా ఉండే మన హీరో సడెన్‌గా హీరోయిన్(నభా నటేష్) ప్రేమలో పడి తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. చివర్లో ఆర్ నారాయణమూర్తి చెప్పిన పెళ్లి చేసుకోవాలన్న డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి సినిమాలో వినోదమంతా తేజ్ క్యారెక్టర్ చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ట్రైలర్‌ను చూస్తుంటే కామెడీ, లవ్, యాక్షన్‌తో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది. చదవండి: మెగా ఫ్యామిలిలో మళ్లీ పెళ్లి బాజాలు.. -
కలసి నవ్వుకుందాం
సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై సుబ్బు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కరోనా వల్ల మూతబడిన థియేటర్లు రీ ఓపెన్ అయ్యాక విడుదల కానున్న పెద్ద సినిమా ఇదే కావటం విశేషం. ఈ సందర్భంగా సాయిధరమ్ మాట్లాడుతూ– ‘‘ఇన్ని రోజులూ మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటానికి క్రిస్మస్కు వస్తున్నాం. మీ (ప్రేక్షకులు) ఈలలు.. గోలలు వినడానికి చాలా ఎదురు చూస్తున్నాం. కలసి నవ్వుకుందాం’’ అన్నారు. ‘‘క్రిస్మస్ పండగకు మా సినిమా రావటం ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి. దిలీప్, సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
డాక్టర్‌గా సాయితేజ్
త్వరలో డాక్టర్‌గా ఆసుపత్రికి వెళ్లనున్నారట సాయితేజ్. దేవ కట్టా దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్‌లో ఆరంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాలో కథరీత్యా సాయితేజ్ డాక్టర్ పాత్రలో నటిస్తారట. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఏలూరులో జరుగుతుందని సమాచారం. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తారని టాక్. ప్రస్తుతం ‘సోలో బతుకే సో బెటర్’ చిత్రంలో స్టూడెంట్‌గా సాయితేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
కొత్త సినిమా ప్రస్థానం
‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు సాయితేజ్. ప్రస్తుతం ‘ప్రస్థానం’ చిత్రదర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో తన నూతన చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. నివేదా పేతురాజ్ హీరోయిన్. జగపతిబాబు పవర్ఫుల్ రోల్ చేయనున్నారు. జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేసి, స్క్రిప్ట్ అందించగా, నటుడు పవన్ కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వంశీ పైడిపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దేవ కట్టా మాట్లాడుతూ– ‘‘ఎగ్జయిట్మెంట్ కలిగించే అద్భుతమైన కథతో ఈ సినిమా చేస్తున్నాం. ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్యామ్ దత్. -
నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది
‘‘యంగ్∙ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలను రూపొందించే మారుతి, ‘ప్రతిరోజూ పండగే’ లాంటి భావోద్వేగాలకు సంబంధించిన కథను అద్భుతంగా తీశారు’’ అని సుకుమార్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్ మాట్లాడుతూ – ‘‘సినిమా మొత్తం బాధ అనే ఎమోషన్ ఉన్నా ప్రేక్షకులు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారని నాతో ‘బన్నీ’ వాస్ అన్నాడు. సినిమా చూశాక అతను చెప్పింది కరెక్టే కదా అనిపించింది. ఆద్యంతం నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది ఈ సినిమా. సాయితేజ్‌కి మేనమామ పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘కొన్ని ఫ్లాప్స్ ఎదురవగానే నా కెరీర్ అయిపోయిందని చాలామంది జోక్స్ వేసుకున్నారు. ఈ సినిమా రూపంలో మంచి హిట్ దక్కింది. నా కెరీర్లో నిలిచిపోయే సినిమా ఇచ్చారు మారుతి’’ అన్నారు సాయితేజ్. ‘‘నిర్మాతగా నేను ఈస్థాయిలో ఉండటానికి ‘దిల్’రాజుగారు, అల్లు అరవింద్‌గారితోపాటు సుకుమార్‌గారు కూడా ఓ కారణం. నన్ను నిర్మాతను చేయడానికి ‘100% లవ్’ తీశారు’’ అన్నారు ‘బన్నీ’ వాస్. ‘‘థియేటర్లో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే వాళ్లను ఇంకా నవ్వించాలనే కసి పెరిగింది. సుకుమార్‌గారు మా సినిమాని అభినందించడం హ్యాపీ’’ అన్నారు మారుతి. ఈ కార్యక్రమంలో తమన్, రాశీఖన్నా, రావు రమేశ్, పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
ఆ ముద్ర పడకుండా చూసుకుంటున్నా
‘‘సీరియస్ విషయాన్ని కూడా ఎక్కువ సీరియస్‌గా తీసుకోను నేను. అది నా మనస్తత్వం. ఏదైనా విషయం చెప్పాలన్నా ఎంటర్టైనింగ్గానే చెబుతాను. నా సినిమాలో కథలను కూడా అలానే చెప్పాలనుకుంటాను’’ అన్నారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలయింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి పంచుకున్న విశేషాలు. ► ‘ప్రతిరోజూ పండగే’ కథను ఎవరికి చెప్పినా బావుంది అన్నారు. 65 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం. సినిమా రిలీజ్ ముందు కూడా పెద్ద టెన్షన్ పడలేదు. ఎందుకంటే.. ఎమోషన్స్‌తో ఓ కథను సరిగ్గా చెప్పగలిగితే ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాతో అది మళ్లీ నిరూపితం అయింది. ► థియేటర్స్‌లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషన్ కంటే కామెడీ టైమింగ్ ఏమైనా డామినేట్ అయిందా? అనే డౌట్ వచ్చింది. ‘భలే భలే మగాడివోయి’ సినిమా తర్వాత ఇన్ని ఫోన్ కాల్స్ రావడం ఇదే. ‘చాలా హెల్దీగా చేశావు’ అని చిరంజీవిగారు అభినందించారు. ‘చాలా బాగా డీల్ చేశావు’ అని రాఘవేంద్రరావుగారు అన్నారు. ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ► రావు రమేశ్‌గారు పాత్ర బాగా వచ్చింది అని అందరూ అంటున్నారు. ఆయన యాక్ట్ చేస్తుంటే మేమందరం ఎగ్జయిట్ అయ్యాం. ► మారుతి ఒక జానర్ సినిమాలే తీయగలడు అని ముద్ర వేయించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే సినిమా సినిమాకు జానర్ మారుస్తుంటాను. ఒకేలాంటి సినిమాలు తీస్తే నాకు నేనే బోర్ కొట్టేస్తాను. ► ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. బెస్ట్ కథలే ఇవ్వాలి. వెబ్ సిరీస్‌లు కూడా వస్తున్నాయి. అవే ఫ్యూచర్. నేనూ వెబ్ సిరీస్ చేస్తాను. నెట్‌ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’కి అడిగారు. కానీ కుదర్లేదు. -
అందరూ కనెక్ట్ అవుతారు
సాయి తేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఎస్కేయన్ సహ–నిర్మాత. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు... ► ఈ చిత్రంలో రాజమండ్రికి చెందిన టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజిల్ అర్ణా పాత్ర చేశాను. మొదట్లో నాకు టిక్ టాక్ అంటే తెలియదు. ఈ కథ వింటున్నప్పుడు భయం వేసింది. ఏంజిల్ అర్ణా ఏంటి? టిక్ టాక్ సెలబ్రిటీ ఏంటి? అని అనుకున్నాను. ఆ తర్వాత నేను టిక్ టాక్ యాప్‌ను నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఆ తర్వాత టిక్ టాక్ ఫన్ తెలిసింది. టిక్ టాక్‌పై సెటైరికల్‌గా నా పాత్ర ఉండదు. నా క్యారెక్టర్‌కు అందరూ బాగా కనెక్ట్ అవుతారు. ► రియల్‌లైఫ్‌లో నాకు చాలా సిగ్గు. సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఆలోచించేదాన్ని. ఇప్పుడు అలా కాదు. కొంతమంది నా ఫ్రెండ్స్‌లో టిక్ టాక్ చేసేవారు ఉన్నారు. క్యారెక్టర్ కోసం కొంతమంది టిక్ టాక్ సెలబ్రీటీలను కూడ కలిశాను. ‘జిల్’ సినిమా తర్వాత నేను బబ్లీ క్యారెకర్ట్ చేసింది ఈ సినిమాలోనే. ► సాయితేజ్ మంచి కో స్టార్. పాత్రకు నేను న్యాయం చేయగలనని దర్శకులు మారుతిగారు నన్ను నమ్మారు. సెట్లో ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సింది రాబట్టుకుంటారు. చాలా హ్యూమరస్‌గా ఉంటారు. ► ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ► నేను హీరోయిన్గా నటించిన ‘వెంకీమామ, ప్రతిరోజూ పండగే’ చిత్రాలు వారం గ్యాప్‌లో విడుదల అవుతున్నాయి. వీటిని నేను ప్లాన్ చేయలేదు. విడుదలైన ‘వెంకీమామ’ చిత్రంలో నేను పోషించిన హారిక పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. హారిక లాంటి పాత్ర నేను ఇంతవరకు చేయలేదు. ► ఈ చిత్రానికి నేను డబ్బింగ్ చెప్పలేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి నా పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. కథా చర్చలు జరుగుతున్నాయి. నా తర్వాతి చిత్రాల గురించి త్వరలో వెల్లడిస్తాను. -
నాగబాబు బర్త్‌డే; మెగా ఫ్యామిలీలో సందడి
మెగా బ్రదర్, లాఫింగ్ స్టార్ నాగబాబు పుట్టినరోజు వేడుకలను ‘మెగా’ ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను వారు ట్విటర్లో పంచుకున్నారు. మంగళవారం( అక్టోబర్ 29) నాగబాబు పుట్టినరోజు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులతోపాటు అటు సినీ ప్రముఖులు ఇటు అభిమానుల నుంచి బర్త్‌డే విషెస్‌తో ట్విటర్ మోత మెగింది. నాగాబాబు గారాలపట్టి నిహారిక తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తండ్రి నుదుటిపై ముద్దు పెడుతూ ‘ఐ లవ్ యూ నానా.. ఈ ప్రపంచంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది నువ్వే.. గత జన్మలో ఖచ్చితంగా నా కొడుకుగా పుట్టుంటారు.’ అంటూ నిహారిక తన తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. View this post on Instagram I love you so much Nanna! ❤️ I need a bigger heart to fit in all the love I have for you! You make me laugh like no other. And you are one in a gazillion! 😘😘😘 . You were definitely my son in the last birth😂😘 . . Thanks a lot for this picture @pranithbramandapally 🤗 A post shared by Niharika Konidela (@niharikakonidela) on Oct 29, 2019 at 2:46am PDT అలాగే కొడుకు వరుణ్ తేజ్ సైతం తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ‘నీ మొహం మీద చిరునవ్వు కోసం మేము ఏదైనా చేస్తాం. ఇంతటి అందమైన జీవితాన్ని అందించినందుకు ధన్యవాదాలు.. నాన్నా లవ్ యూ ద మోస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ ట్విటర్ వేదికగా మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘నాగాబాబు మామ హ్యాపీ బర్త్‌డే.. లవ్ యూ సో మచ్’ అంటూ ట్వీట్ చేశారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగబాబు తనకుంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెరలో ప్రసారమయ్యే ఓ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. Happy birthday Nana! Will do anything to put a smile on your face.. Thanks for this wonderful life you’ve given me.. Love you the most!❤️❤️❤️ pic.twitter.com/HipE4AlP3X — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) October 29, 2019 -
'జవాన్'గా మెగా హీరో
యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆ ప్రభావం తన మీద పడకుండా, మీడియం రేంజ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో మంచి సక్సెస్‌లు సాధించిన సాయి, తన నెక్ట్స్ సినిమాల టైటిల్స్‌తోనే సినిమాల మీద అంచనాలు పెంచేస్తున్నాడు. ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తిక్క సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ప్రముఖ రచయిత బివియస్ రవి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు సాయి. ఈ సినిమాకు జవాన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. దర్శకుడు హరీష్ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సోల్జర్‌గా సాయిధరమ్ తేజ్
యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆ ప్రభావం తన మీద పడకుండా, మీడియం రేంజ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో మంచి సక్సెస్‌లు సాధించిన సాయి, తన నెక్ట్స్ సినిమాల టైటిల్స్‌తోనే సినిమాల మీద అంచనాలు పెంచేస్తున్నాడు. ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తిక్క సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ప్రముఖ రచయిత బివియస్ రవి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు సాయి. ఈ సినిమాకు సోల్జర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. దర్శకుడు హరీష్ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.