Most Eligible Bachelors In Tollywood Actors Topic Becomes Viral - Sakshi
Sakshi News home page

అబ్బే.. ఈ హీరోలకు అసలు పెళ్లి ధ్యాసే లేదుగా!

Jun 9 2023 11:23 AM | Updated on Jun 15 2023 1:32 PM

Tollywood Heros Most Eligible Bachelors Marriage Viral Topic - Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లి టాపిక్‌ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ఇంకా 30 ఏళ్ల వయసు వచ్చినా.. పెళ్లి ఊసెత్తని హీరోలు ఎవరెవరు ఉన్నారో అని ఫ్యాన్స్‌ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ మధ్యే ఈ జాబితా నుంచి వైదొలిగాడు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ శర్వానంద్‌. జూన్‌ 3న శర్వానంద్‌ రక్షితారెడ్డిని వివాహమాడారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇంతలోనే వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారంటూ వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. వీరి నిశ్చితార్థం నేడు(జూన్‌ 9న) జరగనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మెగా ‍ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!)

అయితే పెళ్లి ఆలోచన  లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న బడా హీరోలు మాత్రం చాలా మందే ఉన్నారు. టాలీవుడ్‌లో​  బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్.. ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోలిస్తే ప్రభాస్ వయస్సు అందరికంటే ఎక్కువగానే ఉంటుంది. ప్రభాస్ పెళ్లి మీద రోజుకో వార్త పుట్టుకొచ్చినప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్‌గా మిగిలిపోయాడు.

చివరకు ప్రభాస్‌ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని చెప్పిన శర్వానంద్‌ కూడా ఓ ఇంటివాడు అయిపోయాడు. దీంతో  ‘ఆదిపురుష్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పెళ్లి గురించి అభిమానుల అరుపులకు  సమాధానమిస్తూ.. ఎప్పుడైనా ఇక్కడే తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానని ప్రభాస్‌ హామీ ఇచ్చాడు. కానీ ఆ శుభాకార్యం ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.

ఇక ఇదే వరుసలో  మరో హీరో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు. తన చిన్న వయసు వారంతా పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో తేజ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. టాలీవుడ్‌లో మరో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్‌  హీరో రామ్ పోతినేని.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం దాటుతున్న పెళ్లికి మాత్రం సై అనడం లేదు.

ఇదే లిస్ట్‌లో విజయ్‌ దేవరకొండ, అడవి శేష్‌, బెల్లం కొండ శ్రీనివాస్‌, సిద్ధార్థ్,  అల్లు శిరిష్‌, తరుణ్‌ ఇలా బ్యాచ్‌లర్‌ల లిస్ట్‌ పెద్దదిగానే ఉంది. ఎంతోమంది హీరోలు.. పెళ్లయ్యాక కూడా సక్సెస్‌ అయ్యారు. మరి ఈ హీరోలు మాత్రం పెళ్లి విషయాన్నే మర్చిపోయి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది.. ఈ హీరోలంతా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లయితే చూద్దామని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌)

---- పోడూరి నాగ ఆంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement