డాక్టర్‌గా సాయితేజ్‌ | sai dharam tej dockor role in new movie | Sakshi
Sakshi News home page

డాక్టర్‌గా సాయితేజ్‌

Published Fri, Mar 20 2020 5:52 AM | Last Updated on Fri, Mar 20 2020 5:52 AM

sai dharam tej dockor role in new movie - Sakshi

సాయితేజ్‌

త్వరలో డాక్టర్‌గా ఆసుపత్రికి వెళ్లనున్నారట సాయితేజ్‌. దేవ కట్టా దర్శకత్వంలో సాయితేజ్‌ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్‌లో ఆరంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాలో కథరీత్యా సాయితేజ్‌ డాక్టర్‌ పాత్రలో నటిస్తారట. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ ఏలూరులో జరుగుతుందని సమాచారం. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తారని టాక్‌. ప్రస్తుతం ‘సోలో బతుకే సో బెటర్‌’ చిత్రంలో స్టూడెంట్‌గా సాయితేజ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement