
సీనియర్ హీరోలు కమలహాసన్, రజనీకాంత్, అజిత్ వంటి వారు తమ వయసుకు తగ్గ కథాపాత్రల్లో నటించడం మొదలెట్టి చాలా కాలమే అయ్యింది. నటుడు విజయ్ కూడా లియో చిత్రంతో ఆ తరహా పాత్రల్లో నటించడం మొదలెట్టారు. అలాగు ఈ హీరోలు తమ వయసుకు తగ్గ హీరోయిన్లతోనే నటిస్తున్నారు. అలా నటుడు రజనీకాంత్ సమీపకాలంలో సీనియర్ నటీమణులతోనే నటిస్తున్నారు. ఈయన పీక్ టైమ్‌లో నటించలేని నేటి సీనియర్ నటీమణులు సిమ్రాన్, త్రిష, ఈశ్వరీరావు, రమ్యకృష్ణ వంటి వారికి ఇప్పుడు అవకాశాలు వరిస్తున్నాయి. కా
గా తాజాగా నటుడు రజనీకాంత్ వేట్టైయాన్ అనే చిత్రాన్ని పూర్తి చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇంతకు ముందు నటించని నటుడు ఫాహత్‌ఫాజిల్, రానా దగ్గుపాటి, నటి మంజువారియర్, రిత్వికా సింగ్, దుషారా విజయన్ తదితరులు నటిస్తున్నారు. ముఖ్యంగా నటుడు ఫాహత్ ఫాజిల్ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి చిత్రం అంతా ఉండే వినోదభరిత పాత్రలో నటించినట్లు సమాచారం.
అలాగే నటి మంజువారియర్ ఇందులో రజనీకాంత్‌కు భార్యగా నటించనట్లు తనే ఒక కార్యక్రమంలో చెప్పారు. మలయాళంలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈమె ఇంతకు ముందు తమిళంలో నటుడు అజిత్ సరసన తుణివు, ధనుష్‌కు జంటగా అసురన్ వంటి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా వేట్టైయాన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment