ప్రేమ, పెళ్లితో జీవితం నాశనం: మెగా హీరో | Solo Brathuke So better Trailer Released | Sakshi
Sakshi News home page

ప్రేమ, పెళ్లితో జీవితం నాశనం: మెగా హీరో

Published Sat, Dec 19 2020 12:22 PM | Last Updated on Sat, Dec 19 2020 2:27 PM

Solo Brathuke So better Trailer Released - Sakshi

కరోనా వైరస్‌ అనంతరం థియేటర్లలో విడుదలకానున్న స్టార్‌ హీరో సినిమా సోలో బ్రతుకే సోబెటర్‌. సాయిధరమ్‌ తేజ్‌, నభా నటేష్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సుబ్బు దర్శకత్వం వహిస్తుండగా.. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్‌, నరేష్‌, సత్య, వెన్నెల కిషోర్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.  ముందుగా ఓటీటీలో విడుదల చేయాలని భావించగా ఇటీవల థియేటర్లు తెరుచుకోవడంతో పెద్ద స్క్రీన్‌ మీద సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే థియేటర్లలో ఇప్పటికే కొన్ని చిన్న సినిమాలు విడుదలైనప్పటికీ  ప్రేక్షకులు అంతగా థియేటర్లకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ఇక ఈ అనుమానాలను పక్కనపెడతూ డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది. చదవండి: తెరుచుకున్న థియేటర్‌లు.. ఐమ్యాక్స్‌లో మెగా హీరో

‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ నేడు(శనివారం) విడుదలయ్యింది. ఇందులో తన గురించి తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్లాలంటూ చెబుతూ.. జీవించడానికి మనకు బోలెడు హక్కులు ఉంటే, ప్రేమ పెళ్లి అని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామని అంటాడు. అలా పెళ్లికి దూరంగా ఉండే మన హీరో సడెన్‌గా హీరోయిన్‌(నభా నటేష్‌) ప్రేమలో పడి తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. చివర్లో ఆర్‌ నారాయణమూర్తి చెప్పిన పెళ్లి చేసుకోవాలన్న డైలాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి  సినిమాలో వినోదమంతా తేజ్‌ క్యారెక్టర్‌ చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ట్రైలర్‌ను చూస్తుంటే కామెడీ, లవ్‌, యాక్షన్‌తో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన లభించింది. చదవండి: మెగా ఫ్యామిలిలో మళ్లీ పెళ్లి బాజాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement