నిర్మాతగా స్టార్ డైరెక్టర్‌ భార్య.. ట్రైలర్‌ చూశారా? | Varun Dhawan Latest Movie Baby John trailer Out Now | Sakshi
Sakshi News home page

Baby John trailer: కీర్తి సురేశ్ ఎంట్రీ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది!

Published Mon, Dec 9 2024 7:12 PM | Last Updated on Mon, Dec 9 2024 7:20 PM

Varun Dhawan Latest Movie Baby John trailer Out Now

వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'బేబీ జాన్'. ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌లో విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్‌ మూవీగానే బేబీ జాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ యాక్షన్ సీన్స్, ఫైట్స్‌ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వామికా గబ్బి రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్‌మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించడం మరో విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement